మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
అక్రమ రవాణాలో ఇంటర్నెట్ పాత్ర
నాడు పోస్టు చేయడమైనది:
29 JUL 2021 4:14PM by PIB Hyderabad
సైబర్ నేరాలను అరికట్టడానికి, ఇంటర్నెట్ ఆధారంగా జరిగే దోపిడీలను నివారించడానికి సమాచార సాంకేతిక చట్టం-2000లో పలు నిబంధనలున్నాయి. భారత రాజ్యంగంలో 7వ షెడ్యూల్ ప్రకారం ‘పోలీసులు’ మరియు ‘పబ్లిక్ ఆర్డర్’ అనేవి రాష్ట్రం పరిధిలోని అంశాలు. సైబర్ నేరాలతో సహా.. చట్టాలను అమలు చేసే సంస్థల ద్వారా నేరాల నివారణ, గుర్తింపు, దర్యాప్తు, విచారణకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన బాధ్యత వహిస్తాయి. చట్టాలను అమలు చేసే సంస్థలు నేరస్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాయి. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సామర్థ్యాలను పెంచడం కోసం వివిధ పథకాల కింద ఆదేశాలు జారీ చేయడం, సూచనలు, హెచ్చరికలు చేయడంతోపాటు ఆర్థిక సహాయం అందిస్తుంది.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ లను ఏర్పాటుచేయడం, జూనియర్ సైబర్ కన్సల్టెంట్ల నియామకం, అవసరమైన శిక్షణ ఇవ్వడం కోసం సైబర్ క్రైమ్ ప్రివెన్షన్ విమెన్ & చిల్డ్రన్ (సిసిపిడబ్ల్యుసి) పథకం కింద అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆర్థిక సహాయం అందించింది. కేంద్ర ప్రభుత్వం చూపిన ఈ చొరవతో ఇప్పటిదాకా 18 రాష్ట్రాల్లో సైబర్ ఫోరెన్సిక్ లాబొరేటరీలు, శిక్షణ కేంద్రాలను ప్రాంభించారు. అంతేకాకుండా సైబర్ నేరాలపై అవగాహన కల్పించడం, హెచ్చరికల జార, దర్యాప్తు సామర్థ్యాన్ని పెంచడం, చట్టాన్ని అమలు చేసే సిబ్బందికి శిక్షణ, ప్రాసిక్యూటర్లు, జ్యుడిషియల్ అధికారులు, సైబర్ ఫోరెన్సిక్ సౌకర్యాలను మెరుగుపర్చడం వంటి వాటిపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సైబర్ నేరాల నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం సైబర్ క్రైబ్ కోఆర్డినేషన్ సెంటర్ ను ఏర్పాటుచేసింది. దీనిద్వారా సైబర్ నేరాల దర్యాప్తు కోసం అవసరమైన మార్గదర్శకాలను రూపొందించడంతోపాటు, సమగ్ర, సహకార పద్ధతిలో సైబర్ నేరాల దర్యాప్తు జరిగేలా చూస్తోంది. మహిళలు మరియు పిల్లలపై జరిగే సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించి, అన్ని రకాల సైబర్ నేరాలకు సంబంధించిన సంఘటనలను నివేదించే సదుపాయాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవడానికి నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (www.cybercrime.gov.in) అందుబాటులోకి తెచ్చింది. ఆన్‌లైన్ సైబర్ ఫిర్యాదులను నమోదు చేయడంలో సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్ 155260 కూడా పనిచేస్తోంది.
***
(రిలీజ్ ఐడి: 1740477)
సందర్శకుల సూచీ సంఖ్య : : 179