మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
జండర్ బడ్జెటింగ్ విధానం అమలు
Posted On:
29 JUL 2021 4:17PM by PIB Hyderabad
రాష్ట్ర / కేంద్రపాలిత ప్రాంతాల స్థాయిలో జండర్ బడ్జెటింగ్ (జీబీ) సంస్థాగతీకరణకు మద్దతు ఇవ్వడానికి మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ స్థిరమైన ప్రయత్నాలు చేసింది.
ఇప్పటివరకు 27 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు జీబీని అవలంబించాయి మరియు లింగ వివక్ష పరిష్కరించడానికి మరియు లింగ సమానత్వాన్ని పెంచడానికి వివిధ చర్యలు చేపట్టాయి. జండర్ బడ్జెట్ కోసం నోడల్ విభాగాన్ని గుర్తించడం, జండర్ బడ్జెట్ సెల్‌ల ఏర్పాటు, రాష్ట్ర మహిళా/ బాలికల విధానాన్ని రూపొందించడం, జండర్ డేటా బ్యాంక్ ఏర్పాటు మరియు రాష్ట్ర బడ్జెట్‌లో జండర్ బడ్జెట్ ప్రకటనను చేర్చడం వంటి చర్యలు ఇందులో ఉన్నాయి. వివిధ
రంగాలలో మరియు అన్ని స్థాయిల పాలనలో లింగ యంత్రాంగాలను సంస్థాగతీకరించే విధానాన్ని మరింత బలోపేతం చేయడానికి గాను మంత్రిత్వ శాఖ జండర్ బడ్జెట్ గురించి ప్రత్యేకంగా ఒక హ్యాండ్‌బుక్‌ను అభివృద్ధి చేసింది. రాష్ట్ర/ యుటీ స్థాయిలో జండర్ బడ్జెట్‌ను పెంచడానికి ప్రభుత్వ అధికారుల సామర్థ్యాన్ని పెంపొందించడానికి.. మంత్రిత్వ శాఖ ప్రభుత్వ శిక్షణా సంస్థలకు ఆర్థిక సహాయం కూడా అందిస్తోంది. దీనికితో 21 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు జండర్ బడ్జెట్‌పై నిరంతర సామర్థ్యాన్ని పెంపొందించే ప్రయత్నాల కోసం నియమిత రాష్ట్ర సమన్వయ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశాయి. ఈ సమాచారాన్ని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ ఈ రోజు రాజ్యసభకు ఇచ్చిన ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
***
(Release ID: 1740473)
Visitor Counter : 188