సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

వ్యవసాయం / గ్రామీణ పరిశ్రమలు

Posted On: 29 JUL 2021 3:09PM by PIB Hyderabad

 ప్రధానంగా వ్యవసాయ మరియు గ్రామీణ రంగాలలో సూక్ష్మ సంస్థలను నెలకొల్పడం ద్వారా  ద్వారా దేశంలో ఉపాధి అవకాశాలను కల్పించడానికి  జాతీయ స్థాయిలో  ఖాదీ గ్రామీణ పరిశ్రమల సంఘం (కెవిఐసి) నోడల్ ఏజెన్సీగా 2008-09 నుంచి ప్రధాన మంత్రి ఉపాధి ఉత్పత్తి కార్యక్రమాన్ని (పిఎమ్‌ఇజిపి) మంత్రిత్వ శాఖ అమలు చేస్తోంది.

 ఈ పథకం కింద పిఎమ్‌ఇజిపి కింద నిధులు పొందిన సూక్ష్మ యూనిట్ మంజూరు అయిన 24 నుంచి 36 నెలల తరువాత  వాస్తవంగా ఏర్పాటై  పనిచేస్తున్నదా లేదా  అన్న అంశాన్ని100% భౌతిక ధ్రువీకరణ  అవుట్ సోర్స్ ఏజెన్సీల ద్వారా జరుగుతుంది. భౌతిక ధ్రువీకరణ సమయంలో మంజూరైన  మొత్తం యూనిట్లలో 85% పనిచేస్తున్నట్లు వెల్లడయింది. 

వలస కార్మికులతో పాటు అందరికి ఉపాధి అవకాశాలను మెరుగు పరచడానికి  కెవిఐసి ద్వారా ఎంఎస్‌ఎంఇ మంత్రిత్వ శాఖ ఈ కింది చర్యలను తీసుకుంటున్నది. 

i . పిఎమ్‌ఇజిపి కింద గత మూడేళ్లలో17.44 లక్షల మందికి ఉపాధి కల్పించే 214495 యూనిట్ల ఏర్పాటుకు మార్జిన్ మనీ సబ్సిడీగా  6209.62 కోట్ల రూపాయలను పంపిణీ చేశారు. 

ii .  పిఎమ్‌ఇజిపి యూనిట్లు మనుగడ సాగించడానికి ఉచితంగా సాంకేతిక, ఆర్థిక మరియు మార్కెటింగ్ నిపుణుల సేవలను అందించడం జరుగుతుంది. 

iii . సక్రమంగా పనిచేస్తున్న పిఎమ్‌ఇజిపి   / ముద్ర  యూనిట్లను విస్తరించడానికి 15% నుంచి  20% వరకు సబ్సిడీతో రెండవ రుణంగా కోటి రూపాయలు అందించబడుతుంది.

iv .  పిఎమ్‌ఇజిపి మరియు ఇతర ఖాదీ మరియు గ్రామ పరిశ్రమ ఉత్పత్తులకు ఆన్‌లైన్ మార్కెటింగ్ సౌకర్యాలను కల్పించడానికి కెవిఐసి ఇ-కామర్స్ పోర్టల్‌ను  అభివృద్ధి చేసింది. 

v . వ్యవసాయ మరియు గ్రామీణ పరిశ్రమలలో ఉపాధి కల్పించడానికి  685 మంది రైతులకు తేనెటీగల పెంపకం/తేనె మిషన్ కింద శిక్షణ ఇవ్వబడింది మరియు కుంభర్ షష్ క్తికారన్ ప్రోగ్రామ్ కింద సుమారు 1000 మంది కుమ్మరులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. వీరికి  తేనెటీగల పెంపకం యూనిట్లు విద్యుత్ తో పని చేసే కుండల తయారీ యూనిట్లు  అందించబడ్డాయి.

వీటితో పాటు  కోవిడ్ -19 మహమ్మారి పరిస్థితిని ఎదుర్కోవటానికి పరిశ్రమలుఎంఎస్‌ఎంఇలతో సహా సమాజంలోని అన్ని వర్గాలకు20 లక్షల కోట్ల రూపాయల సమగ్ర ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించింది.  ఎంఎస్‌ఎంఇ  లకు సంబంధించిన ప్రకటనలు మరియు వాటి ప్రస్తుత స్థితి క్రింద ఇవ్వబడింది:

i . ఎంఎస్‌ఎంఇలకు అత్యవసర క్రెడిట్ లైన్: ఎటువంటి హామీ లేకుండా 2020 మే 23వ టీ నుంచి అమలు లోకి వచ్చే విధంగా  ప్రభుత్వం రూ. 3,00,000 కోట్ల రుణ పథకాన్ని అమలు చేస్తున్నది. దీనివల్ల 45 లక్షల ఎంఎస్‌ఎంఇ యూనిట్లకు ప్రయోజనం కలుగుతుంది. 02.07.2021 నాటికి  2.73 లక్షల కోట్ల రూపాయల మేరకు మంజూరు అయ్యాయి. 

ii . ఒత్తిడికి గురైన ఎంఎస్‌ఎంఇలకు సబార్డినేట్ అప్పుగా 20,000 కోట్లు: 17.07.2021 నాటికి  75.82 కోట్ల రూపాయల విలువ చేసే  715 హామీలు  ఇవ్వడం జరిగింది. 

iii .200 కోట్ల రూపాయల వరకు విలువ చేసే ప్రభుత్వ సేకరణకు గ్లోబల్ టెండర్లు ఉండవు .

iv . ఎంఎస్‌ఎంఇల బకాయిల చెల్లింపు : ఎంఎస్‌ఎంఇ బకాయిలను 45 రోజుల్లోపు చెల్లించాలని ప్రభుత్వ సంస్థలుసిపిఎస్‌ఇలకు ప్రభుత్వం ఆదేశించింది. మే 2020 నుంచి  26.07.2021 వరకు ఎంఎస్‌ఎంఇలకు 55863.30 కోట్ల రూపాయలను చెల్లించడం జరిగింది. 

ఈ సమాచారాన్ని కేంద్ర, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రి శ్రీ నారాయణ్ రాణే ఈ రోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో అందించారు. 

 

****


(Release ID: 1740338) Visitor Counter : 490


Read this release in: English , Urdu