మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఉపాధ్యాయులకు డిజిటల్ శిక్షను ఇచ్చేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు
Posted On:
29 JUL 2021 3:06PM by PIB Hyderabad
కేంద్రం ఆగస్టు 2019లో ప్రతిపాదించిన ప్రాయోజిత కార్యక్రమం కింద పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సంపూర్ణ అభివృద్ధి కోసం జాతీయ చొరవ నిష్ఠ (ఎన్ఐఎస్‌హెచ్‌టిహెచ్ఎ - ) పేరిట ప్రాథమిక స్థాయిలో అభ్యాస ఫలితాలను మెరుగుపరచేందుకు సమగ్ర ముఖాముఖి ఉపాధ్యాయుల శిక్షణా కార్యక్రమానికి పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖ శ్రీకారం చుట్టింది.
ప్రాథమిక స్థాయిలో ఉపాధ్యాయులకు వృత్తిపరమైన అవకాశాలను నిరంతరం అభివృద్ధి చేసేందుకు, కోవిడ్ -19 సవాళ్ళ కారణంగా దీక్షా ప్లాట్ఫాం ను ఉపయోగించి అక్టోబర్ 2020న నిష్ఠను ఈ శాఖ ప్రారంభించింది. దాదాపు 24 లక్షల మంది ఉపాధ్యాయులు జూన్, 2021నాటికి నిష్ఠ ఆన్‌లైన్ శిక్షణా కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నారు.
ఈ సమాచారాన్ని రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ద్వారా కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు.
***
(Release ID: 1740334)