ప్రధాన మంత్రి కార్యాలయం
కోవిడ్-19పై మత సంస్థ ల, సామాజిక సంస్థల ప్రతినిధుల తో ప్రధాన మంత్రి సమావేశం
వ్యాక్సీన్ ల విషయం లో చైతన్యం కల్పించేందుకు, వ్యాక్సీన్ పట్ల విముఖత ను తొలగించేందుకు ప్రభుత్వం తో కలిసి కృషి చేయాలని ప్రధాన మంత్రి పిలువు
మహమ్మారి సమయంలో అందించిన సహాయం ఏక్ భారత్-ఏక్ నిష్ఠా ప్రయాస్ సిద్ధాంతానికి చక్కని ఉదాహరణ : ప్రధాన మంత్రి
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేయాలని ప్రధాన మంత్రి పిలుపు
భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత్ జోడో ఆందోళన్ ద్వారా దేశాన్ని ఐక్యం చేసేందుకు కలిసికట్టుగా కృషి చేద్దాం : ప్రధాన మంత్రి
ముందువరుస లో నిలిచి కోవిడ్-19 పై పోరాటం సాగించినందుకు ప్రధాన మంత్రి కి ధన్యవాదాలు తెలిపిన నాయకులు; మూడో విడత కోవిడ్-19 నివారణ కు సంపూర్ణ మద్దతు ఇస్తామని హామీ
Posted On:
28 JUL 2021 7:45PM by PIB Hyderabad
దేశం లో కోవిడ్-19 మహమ్మారి తాజా స్థితి పై చర్చించేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మత సంఘాలు, సామాజిక సంఘాల ప్రతినిధులతో బుధవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సమావేశమయ్యారు.
దేశ ప్రయోజనాల కోసం సమాజం, ప్రభుత్వం కలిసికట్టు గా కృషి చేయగలుగుతాయి అనేందుకు ఈ సమావేశం మరో చక్కని ఉదాహరణ అని ప్రధాన మంత్రి అన్నారు. కోవిడ్-19 సందర్భం గా ఎదురైన సవాళ్ల ను దీటు గా ఎదుర్కోవడం లో ఆయా సంస్థ లు చేసిన కృషి ని ప్రధాన మంత్రి ప్రశంసించారు. మహమ్మారి ప్రభావం తో బాధిత ప్రజలకు కుల మతాల కు అతీతం గా అందిన సహాయం “ఏక్ భారత్-ఏక్ నిష్ఠ ప్రయాస్” సిద్ధాంతాని కి మరో చక్కని ఉదాహరణ అని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా దేవాలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలు ఆస్పత్రులుగాను, ఐసలేశన్ కేంద్రాలు గాను పరివర్తన చెందడమే కాకుండా కష్టాల పాలైన వారికి అవసరమైన ఆహారాన్ని, మందుల ను కూడా అందించాయి అని ఆయన చెప్పారు.
దేశవ్యాప్తం గా ప్రజలందరికీ త్వరిత గతి న వ్యాక్సీన్ ను ఇప్పించేందుకు చేపట్టవలసిన చర్యల పై చర్చిస్తూ “సబ్ కో వ్యాక్సీన్, ముఫ్త్ వ్యాక్సీన్” (అందరికి టీకామందు, ఉచితం గా టీకా) ప్రచార ఉద్యమం కరోనా తో పోరాటం లో రక్షణ కవచం వంటిది అని అభివర్ణించారు. దేశం లో వ్యాక్సీన్ పై చైతన్యాన్ని వ్యాప్తి చేసేందుకు, వ్యాక్సీన్ విషయం లో ప్రచారం లోకి వచ్చిన వదంతులను, గందరగోళాన్ని తిప్పికొట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి కి అండగా నిలవండి అంటూ మత సంఘాల నాయకుల ను, సామాజిక సంఘాల నాయకుల ను ఆయన కోరారు. ప్రత్యేకించి వ్యాక్సీన్ పట్ల తీవ్ర విముఖత ఉన్న ప్రాంతాల లో మరింత సహకారం అవసరం అని ఆయన చెప్పారు. మన ఆరోగ్య కార్యకర్త లు దేశం లో ప్రతి పౌరుని కి/ పౌరురాలి కి చేరువ కావడానికి ఇది ఎంతో సహాయపడుతుంది అని ఆయన అన్నారు.
దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం లో అంతా భాగస్వాములు కావాలి అని నాయకుల కు ప్రధాన మంత్రి పిలుపు నిచ్చారు. “ఆజాదీ కా అమృత్ మహోత్సవ్” లో ప్రతి ఒక్కరు భాగస్వాములు అయ్యేటట్టు చూడాలి అని ఆయన విజ్ఞప్తి చేశారు. “భారత్ జోడో ఆందోళన్” ను దేశవ్యాప్తం గా నిర్వహించేందుకు మనందరం చేతులు కలపాలని, ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ వాస్తవ స్ఫూర్తి ని ప్రదర్శించాలని పిలుపునిచ్చారు.
కేంద్రీయ ధార్మిక జన్ మోర్చా కన్వీనరు, జమాత్-ఇ-ఇస్లామీ హింద్ వైస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ సలీమ్ ఇంజినీర్; ఉత్తర ప్రదేశ్ కు చెందిన భారతీయ సర్వ ధర్మ సంసద్ జాతీయ కన్వీనరు, మహా ఋషి పీఠాధీశ్వర్ గోస్వామి సుశీల్ మహారాజ్; న్యూ ఢిల్లీ కి చెందిన ఓంకార్ ధామ్ పీఠాధీశ్వర్ స్వామి ఓంకారానంద్ సరస్వతి; న్యూ ఢిల్లీ కి చెందిన గురుద్వారా బంగలా సాహిబ్ ప్రముఖ గ్రంథి సింహ్ సాహిబ్ జ్ఞాని రంజిత్ సింహ్; న్యూ ఢిల్లీ కి చెందిన ఇన్స్ టిట్యూట్ ఆఫ్ హార్మనీ ఎండ్ పీస్ స్టడీజ్ వ్యవస్థాపక డైరెక్టరు డాక్టర్ ఎం.డి. థామస్; అఖిల భారత రవిదాసీయా ధర్మ సంఘటన్ ప్రెసిడెంట్ స్వామి వీర్ సింహ్ హిత్ కారి; జైపుర్ గల్ తా పీఠ్ కు చెందిన స్వామి సంపత్ కుమార్; న్యూ ఢిల్లీ కి చెందిన అంతర్జాతీయ మహావీర్ జైన్ మిశన్ ప్రెసిడెంట్ ఆచార్య వివేక్ ముని; న్యూ ఢిల్లీ కి చెందిన లోటస్ టెంపల్, భారతీయ బహాయి సముదాయానికి చెందిన జాతీయ ట్రస్టీ, కార్యదర్శి డాక్టర్ ఎ.కె.మర్చెంట్; న్యూ ఢిల్లీ లోని రామకృష్ణ మిశన్ ప్రెసిడెంట్ స్వామి శంతాత్మానంద్; హరియాణా కు చెందిన ఓం శాంతి రిట్రీట్ సెంటర్ కు చెంది సిస్టర్ బి.కె.ఆశా గారు లు ఈ చర్చల లో పాల్గొన్నారు.
ఈ చర్చ ను నిర్వహించినందుకు ప్రధాన మంత్రి కి మత నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మహమ్మారి కి వ్యతిరేకం గా జరుగుతూ ఉన్నటువంటి పోరాటం లో ఆయన అందించిన నిర్ణయాత్మక నాయకత్వాన్ని వారు కొనియాడారు. కోవిడ్-19 తో ఎదురైన సవాళ్ల ను పరిష్కరించడం కోసం విభిన్న మత సంస్థ లు, వివిధ సామాజిక సంఘాలు చేసిన అనుకరణీయ కార్యాల ను గురించి కూడా వారు ప్రస్తావించారు. ప్రస్తుతం అమలవుతున్న వ్యాక్సీనేశన్ కార్యక్రమం పట్ల జాగృతి ని విస్తరించేందుకు వారు వారి మద్దతు ను ప్రకటించారు. థర్డ్ వేవ్ ను అడ్డుకోవడం కోసం వారి వారి సూచనల ను, సలహాల ను సమర్పించారు.
***
(Release ID: 1740201)
Visitor Counter : 321
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam