రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

కోవిడ్ -19 నిర్వ‌హ‌ణ

Posted On: 28 JUL 2021 5:11PM by PIB Hyderabad

కోవిడ్‌-19 నిర్వ‌హ‌ణ కోసం సివిల్ ఆసుప‌త్రుల‌లో మోహ‌రించిన సిబ్బంది వివ‌రాలుః 
వైద్య అధికారి & నిపుణులు (స్పెష‌లిస్టులు)  - 602
న‌ర్సులు                                                             - 224
పారామెడిక‌ల్ సిబ్బంది                                   - 1802
త‌మ కాల‌ప‌రిమితి ముగిసి విధుల నుంచి వైదొల‌గ‌నున్న 236మంది షార్ట్ సర్వీస్ క‌మిష‌న్ అధికారుల కాల‌ప‌రిమితిని మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో పొడిగించారు. 
అంతేకాకుండా, 2017 త‌ర్వాత సైన్యంలో త‌మ ఉద్యోగ కాల‌ప‌రిమితి ముగించుకున్న  మాజీ సాయుధ ద‌ళాల వైద్య సేవ‌లకు (ఎఎఫ్ఎంఎస్‌) చెందిన వైద్య అధికారుల‌ను, మాజీ మిల‌ట‌రీ న‌ర్సింగ్ స‌ర్వీస్ (ఎంఎన్ఎస్‌) కు చెందిన అధికారుల‌ను కాంట్రాక్టు ప‌ద్ధ‌తిలో నియ‌మించేందుకు టూర్ ఆప్ డ్యూటీ అన్న ప‌థ‌కాన్ని ప్ర‌భుత్వం ఆమోదించింది. 
త్రివిధ ద‌ళాల‌కు చెందిన ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన వైద్యుల‌ను తిరిగి విధుల‌లో చేరి, కోవిడ్ ప‌రిహారం కోసం  టూర్ ఆఫ్ డ్యూటీ పేరిట చేసిన ప్ర‌తిపాద‌నకు క్ర‌మంగా ఉండ‌ట‌మే కాక ఇది  కోవిడ్ మ‌హ‌మ్మారి తీవ్ర‌త కార‌ణంగా ఏర్ప‌డిన క్రియాశీల‌క అవ‌స‌రం ఆధారంగా చేసిన‌ది. కాగా ప్ర‌స్తుతం కోవిడ్ మ‌హ‌మ్మారి తీవ్ర‌త త‌గ్గు ముఖం ప‌ట్టింది. 
ఆర్మ‌డ్ ఫోర్సెస్ మెడిక‌ల్ స‌ర్వీసెస్ ఫిజీషియ‌న్లు, అనెస్థ‌టిస్టులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ రెసిడెంట్లు, వైద్య అధికారులు, ఆసుప‌త్రి నిర్వ‌హ‌కులు, న‌ర్సులు, పారామెడిక‌ల్ సిబ్బందిని కోవిడ్ -19 రోగుల సంర‌క్ష‌ణ విధుల కోసం నియ‌మించింది. 
అంతేకాకుండా, ఇ- సంజీవ‌ని వేదిక‌పై టెలి- క‌న్స‌ల్టేష‌న్ ను అందించేందుకు అనుభ‌వ‌జ్ఞుల సేవ‌ల‌ను ఉప‌యోగించ‌డం జ‌రిగింది. మొత్తం 100 మంది ఎఎఫ్ఎంఎస్ అనుభ‌వ‌జ్ఞులు పోర్ట‌ల్ పై న‌మోదు అయి ఉన్నారు, ఇప్ప‌టి వ‌ర‌కూ 22000 క‌న్స‌ల్టేష‌న్ల‌ను అందించారు. 
ప్ర‌భుత్వ అధికారులు భ‌ద్ర‌త‌, అగ్నిమాప‌క‌, బ‌యోమెడిక‌ల్ వృధా నిర్వ‌హ‌ణ‌, మార్చురీ సేవ‌లు, రిఫ‌ర‌ల్‌, అంబులెన్స్ త‌దిత‌ర సేవ‌ల‌ను అందించ‌డం ద్వారా ప్ర‌భుత్వ అధికారులు మ‌ద్ద‌తు అందించారు. అలాగే, ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా, రోగుల‌ను ఉంచేందుకు ముందుగానే త‌యారు చేసిన హాంగ‌ర్లు, రోగుల సంర‌క్ష‌ణ‌కు అవ‌స‌ర‌మైన అన్నిర‌కాల వైద్య ప‌రికరాల‌ను అందించ‌డంలో వారు కీల‌క పాత్ర పోషించారు. 
బుధ‌వారం నాడు శ్రీ‌మ‌తి రీటా బ‌హుగుణ జోషి లోక్‌స‌భ‌లో వేసిన ప్ర‌శ్న‌కు లిఖిత పూర్వ‌క స‌మాధానంలో ర‌క్షణ శాఖ స‌హాయ‌ మంత్రి అజ‌య్ భ‌ట్ వెల్ల‌డించారు. 

***



(Release ID: 1740104) Visitor Counter : 111


Read this release in: English , Punjabi