వ్యవసాయ మంత్రిత్వ శాఖ

ఐక్యరాజ్యసమితి ఆహార సదస్సు నిర్వహణకు మంత్రుల సన్నాహక సమావేశం


1960లలో ఆహారధాన్యాల కొరత ఎదుర్కొన్న భారతదేశం హరిత విప్లవం ద్వారా ఎగుమతిదారుగా అభివృద్ధి సాధించింది.. వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శ్రీమతి శోభా కరండ్లాజే

2023 ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా పాటించాలన్న భారత్ ప్రతిపాదనకు అంగీకరించిన ఐక్యరాజ్యసమితి, ఇతర దేశాలకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి.

Posted On: 27 JUL 2021 5:01PM by PIB Hyderabad

"సుస్థిర అభివృద్ధి సాధనకు ఆహార వ్యవస్థల్లో మార్పులు:సవాళ్ళను ఎదుర్కోవడం"అనే అంశానికి ప్రాధాన్యత ఇస్తూ ఐక్యరాజ్య సమితి నిర్వహించనున్న సదస్సుకు ముందు జరిగిన మంత్రుల స్థాయి సన్నాహక సమావేశంలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీమతి  శోభా కరండ్లాజే వర్చువల్ విధానంలో పాల్గొని ప్రసంగించారు. ఆహార వ్యవస్థలపై జరిగిన ఐక్యరాజ్యసమితి ఆహార రంగంలో అనుసరించవలసిన విధానాలపై ఇచ్చిన సూచనలకు అనుగుణంగా భారతదేశం తన ఆహార వ్యవస్థ ఆర్ధికంగా, సామాజికంగా, పర్యావరణపరంగా సుస్థిరంగా ఉండేలా చూడడానికి చర్యలను అమలు చేస్తున్నదని మంత్రి వివరించారు. భారతదేశం తన వ్యవసాయ-ఆహార వ్యవస్థలను స్థిరమైన వ్యవస్థలుగా మార్చడానికి తీసుకున్న వివిధ చర్యల గురించి మంత్రి శిఖరాగ్ర సమావేశానికి తెలియజేశారు. రైతుల ఆదాయాన్ని, గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయాలను ఎక్కువ చేయడానికి చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం పోషకాహార లోపం మరియు పోషకాహార లోపం సమస్యలను పరిష్కరించే అంశాలపై దృష్టి సారించిందని మంత్రి వివరించారు. 

వ్యవసాయ రంగ ప్రాధాన్యతను వివరించిన మంత్రి అభివృద్ధి చెందుతున్న దేశాలలో సామాజిక ఆర్ధిక రంగాల్లో అవసరమైన మార్పులను తీసుకుని వచ్చి,ప్రపంచ భవిష్యత్తు సుస్థిరంగా ఉండేలా చూడడానికి ఈ రంగానికి ప్రాధాన్యత ఇవ్వక తప్పదని స్పష్టం చేశారు. భారతదేశంలో వ్యవసాయ రంగం విజయం సాధించి ప్రగతి పథంలో పయనిస్తున్నదని మంత్రి అన్నారు.  1960 ప్రాంతాల్లో సాధించిన హరిత విప్లవం వల్ల గతంలో ఆహారధాన్యాల కొరతను ఎదుర్కొన్న భారతదేశం వీటిని ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిందని అన్నారు. 

వ్యవసాయ రంగానికి భారతదేశం ఇస్తున్న ప్రాధాన్యతను మంత్రి వివరించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత ప్రభుత్వం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించడానికి చర్యలను తీసుకుంటున్నదని అన్నారు. వ్యవసాయ దిగుబడులను ఎక్కువ చేసి, రైతులు కొనుగోలుదారులకు ప్రయోజనం కలిగే విధంగా పంటల మార్కెటింగ్ విధానాన్ని అమలు చేస్తున్నదని మంత్రి వివరించారు. 

రైతుల ఆదాయం రెట్టింపు అయ్యేలాచూడడానికి భారతదేశం సంస్కరణలను అమలు చేస్తున్నదని శ్రీమతి కరండ్లాజే అన్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఇటీవల కాలంలో వ్యవసాయ రంగం గణనీయంగా అభివృద్ధి చెందిందని అన్నారు. కరోనా సమయంలో కూడా గత రికార్డులను  అధిగమించి వ్యవసాయ దిగుబడులు వచ్చాయని పేర్కొన్నారు. పంటలను కోసిన తరువాత రైతులు నష్టపోకుండా చూడాలన్న లక్ష్యంతో మౌలిక సదుపాయాలను కల్పించడానికి 12 అమెరికా డాలర్ల విలువ చేసే ఒక నిధిని ఏర్పాటు చేశామని శ్రీమతి కరండ్లాజే అన్నారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను కల్పించడమే కాకుండారుణ హామీని అందించడం జరుగుతుందని అన్నారు. 

2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా పాటించాలన్న భారతదేశ ప్రతిపాదనకు అంగీకరించిన ఐక్యరాజ్యసమితి, ఇతర దేశాలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.పోషక సవాళ్లను పరిష్కరించడానికి, వ్యవసాయ-ఆహార వ్యవస్థలలో వైవిధ్యాన్ని తీసుకురావడానికి భారత్ కృషి చేస్తున్నదని మంత్రి వివరించారు. దీనికోసం ప్రధానంగా ఆహార ధాన్యం ఆధారిత వ్యవస్థల నుంచి పండ్లు మరియు కూరగాయలు వంటి ఇతర అధిక-విలువైన పంటలకు వైవిధ్యీకరణకు ప్రభుత్వం మద్దతు ఇస్తుందని ఆమె అన్నారు.

భారతదేశం అమలు చేస్తున్న వివిధ సంస్కరణలపై మాట్లాడిన మంత్రి చిన్న మరియు సన్నకారు  రైతులకుప్రయోజనం కల్పించడానికి రైతు ఉత్పత్తి సంస్థల ఏర్పాటు మరియు ప్రోత్సాహానికి ప్రభుత్వం  పథకాన్నిప్రారంభించిందని అన్నారు.  వ్యవసాయ ఉత్పత్తుల  అంతరాష్ట్ర   వ్యవసాయ మార్కెటింగ్ సమస్యలను పరిష్కరించడానికి సంస్కరణలను అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద 110 మిలియన్ల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు సుమారు 18 బిలియన్ యుఎస్ డాలర్లు జమ అయ్యాయని అన్నారు.   ప్రతి గ్రామీణ కుటుంబానికి సంవత్సరానికి 100 రోజులు స్వచ్ఛంద ప్రాతిపదికన పనిచేయడానికి రాజ్యాంగబద్ధమైన హక్కును అందించే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని దేశంలో అమలు చేస్తున్నామని మంత్రి సమావేశానికి తెలిపారు. 

స్థిరమైన ఉత్పాదకత, ఆహార భద్రత భూసార పరిరక్షణ లక్ష్యంగా  భారతదేశం సేంద్రీయ వ్యవసాయాన్ని  ప్రోత్సహిస్తోందని మంత్రి చెప్పారు.  విలువైన నీటి వనరులను పరిరక్షించడానికి, మైక్రో ఇరిగేషన్ టెక్నాలజీలను ఉపయోగించడం ద్వారా వ్యవసాయ స్థాయిలో నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచే పథకాన్ని ప్రారంభించామని తెలిపిన మంత్రి  దీని కోసం 672 మిలియన్ డాలర్ల తో ప్రత్యేక సూక్ష్మ సేద్య నిధిని ఏర్పాటు చేశామన్నారు. 

పోషకాహార లోపం మరియు పోషకాహార లోపం సమస్యలను పరిష్కరించడానికి భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార-ఆధారిత భద్రతా కారక్రమాలను అమలు చేస్తున్నదని వివరించిన మంత్రి 2020 లో సుమారు 800 మిలియన్ల మందికి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రయోజనం కలిగించామని అన్నారు.   దేశంలో  మిడ్ డే  భోజన పథకం సుమారు 120 మిలియన్ల పాఠశాల పిల్లలకు ప్రయోజనం కలిగిస్తున్నదని మంత్రి తెలిపారు. 

 

  వ్యవసాయ-ఆహార వ్యవస్థలను సుస్థిర వ్యవస్థలుగా మార్చడంతో పాటు  సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 2030 లో నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి  భారత్ తన ప్రయత్నాలను కొనసాగిస్తుందని మంత్రి శిఖరాగ్ర సమావేశానికి హామీ ఇచ్చారు.

***



(Release ID: 1739946) Visitor Counter : 192