కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

భారత్‌లో 2018-2021 మధ్య 320 విదేశీ కంపెనీల నమోదు

Posted On: 27 JUL 2021 6:21PM by PIB Hyderabad

   దేశంలో గడచిన మూడేళ్ల వ్యవధిలో మొత్తం 320 విదేశీ కంపెనీలు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ సహాయమంత్రి శ్రీ రావు ఇందర్‌జీత్‌ సింగ్‌ రాజ్యసభలో ఇవాళ ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. దీనిపై మంత్రి వివరిస్తూ- కంపెనీల చట్టం-2013లోని సెక్షన్‌ 2 (42) కింద ‘విదేశీ కంపెనీ’కి స్పష్టమైన నిర్వచనం ఉందని తెలిపారు. తదనుగుణంగా భారతదేశానికి వెలుపల స్థాపించబడిన ఏదైనా కంపెనీ లేదా దాని కార్పొరేట్‌ శాఖ (ఎ) భారత్‌లో స్వయంగా లేదా ప్రాతినిధ్య సంస్థ ద్వారా భౌతికంగా లేదా ఎలక్ట్రానిక్‌ విధానం ద్వారా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తుంటే; (బి) భారత్‌లో మరే రీతిలోనైనా ఏదైనా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లయితే ఈ నిర్వచనం పరిధిలోకి వస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ మేరకు గడచిన మూడేళ్లలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నమోదైన విదేశీ కంపెనీల జాబితాను మంత్రి సభకు సమర్పించారు. అది కిందివిధంగా ఉంది:

రాష్ట్రాలు

2018-19

2019-20

2020-21

అస్సాం

0

0

0

ఆంధ్రప్రదేశ్

2

0

1

బీహార్

1

0

1

ఢిల్లీ

26

28

15

గోవా

1

0

0

గుజరాత్

2

1

4

హర్యానా

19

22

4

హిమాచల్ ప్రదేశ్

0

0

1

కర్ణాటక

7

8

9

కేరళ

1

1

0

మహారాష్ట్ర

42

40

23

మణిపూర్

1

0

0

ఒడిషా

0

1

1

రాజస్థాన్

1

2

1

తమిళనాడు

6

7

9

తెలంగాణ

1

3

2

ఉత్తర ప్రదేశ్

1

8

3

ఉత్తరాఖండ్

1

1

1

పశ్చిమ బెంగాల్

6

2

3

మొత్తం

118

124

78

   విదేశీ కంపెనీల ద్వారా ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పొందిన రంగాలవారీ రాబడుల వివరాలను నిర్వహించడం లేదని మంత్రి తెలిపారు.

సదరు విదేశీ కంపెనీలు గడచిన మూడేళ్లలో దాఖలు చేసిన ఫారాలు, రిజిస్ట్రేషన్‌ రుసుముల కింద వసూలు చేసిన సొమ్ముపై ఆయన సమర్పించిన వివరాలు కింది విధింగా ఉన్నాయి:

వివరాలు

2019

2020

2021

నమోదైన విదేశీ కంపెనీలు

118

124

78

సదరు విదేశీ కంపెనీలు దాఖలు చేసిన ఫారాలు, రిజిస్ట్రేషన్‌ రుసుముల కింద వసూలు చేసిన సొమ్ము (రూ.లలో)

13,58,22,000

13,20,03,100

7,02,46,600

 

***



(Release ID: 1739828) Visitor Counter : 116


Read this release in: English , Urdu