సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
దేశంలో గిరిజనులకు సంబంధించి వివిధ రకాల జానపద నృత్యరీతులు, కళలు, సంస్కృతిని ప్రోత్సహించి పరిరక్షించేందుకు ఏడు జోనల్ కల్చరల్ సెంటర్లను ఏర్పాటు చేసిన భారత ప్రభుత్వం: శ్రీ జి.కిషన్ రెడ్డి.
నాడు పోస్టు చేయడమైనది:
27 JUL 2021 6:14PM by PIB Hyderabad
ముఖ్యాంశాలు :
గుర్తింపు పొందని భాషలు, గిరిజన భాషలను ప్రోత్సహించి వాటిని పరిరక్షించేందుకు కేంద్ర సాహిత్య అకాడమీ ప్రత్యేకంగా చర్యలు చేపడుతుంది.
-గిరిజన పరిశోధన సంస్థలను బలోపేతం చేయడం, వాటికి మద్దతు నిచ్చేందుకు , గిరిజన పరిశోధన సంస్థలకు మద్దతు పథకం కింద రాష్ట్రప్రభుత్వాలకు నిధులు సమకూర్చడం .
దేశంలో గిరిజనులకు సంబంధించి వివిధ రకాల జానపద నృత్యరీతులు, కళలు, సంస్కృతిని ప్రోత్సహించి పరిరక్షించేందుకు ఏడు జోనల్ కల్చరల్ సెంటర్లను భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఈ జెడ్ సి సిలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను, కార్యకలాపాలను దేశవ్యాప్తంగా క్రమంతప్పకుండా ఏర్పాటు చేస్తాయి.
సాహిత్య అకాడమీ కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ కింద గల స్వతంత్ర ప్రతిపత్తికలిగిలిన సంస్థ. ఇది వివిధ భాషలను ప్రత్యేకించి గుర్తింపు పొందని, గిరిజన భాషలను పరిరక్షించి, ప్రోత్సహిస్తుంది.
గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ గిరిజన పరిశోధన సంస్థల (టిఆర్ఐల) కోసం ఒక పథకాన్ని నిర్వహిస్తున్నది. ఈ పథకం కింద, గిరిజన పరిశోధన సంస్థలకు మౌలిక సదుపాయాల కల్పనలో మద్దతునిచ్చేందుకు వాటిని బలోపేతం చేసేందుకు, పరిశోధన డాక్యుమెంటేషన్ కార్యకలాపాలకు,అనువర్తిత పరిశోదనకు , వివిధ పరిష్కారాల సాధనకు ,అభివృద్ధి నమూనాల సృష్టికి, గిరిజన మ్యూజియంల ఏర్పాటుకు , గిరిజన పండుగల నిర్వహణకు, గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, నృత్యం, మ్యూజిక్, పెయింటింగ్, వంటివాటి పరి రక్షణకు శిక్షణ సామర్ధ్యాల నిర్మాణానికి రాష్ట్రప్రభుత్వాలకు నిధులు సమకూరుస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 1739696)
సందర్శకుల సూచీ సంఖ్య : : 217