వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
పీఎంజీకేఏవై కింద సుమారు 80 కోట్ల మంది లబ్ధిదారులకు 278 ఎల్‌ఎమ్‌టి ఆహార ధాన్యాలు ఉచితంగా కేటాయింపు
Posted On:
27 JUL 2021 4:47PM by PIB Hyderabad
2021 సంవత్సరంలో 7 నెలల కాలానికి అంటే 2021 మే-నవంబర్ లో పీఎంజీకేఏవై కింద సుమారు 80 కోట్ల ఎన్ఎఫ్ఎస్ఏ లబ్ధిదారులకు 278 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్‌ఎమ్‌టి) ఆహార ధాన్యాలు ఉచితంగా కేటాయించినట్టు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి శ్రీమతి సాధ్వీ నిరంజన్ జ్యోతి వెల్లడించారు. ఈ రోజు లోక్ సభలో ఆమె ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
8 నెలల వ్యవధిలో అంటే 2020 ఏప్రిల్-నవంబర్ మధ్య 80 కోట్ల మంది లబ్ధిదారులకు సుమారు 322 ఎల్‌ఎమ్‌టి ఆహార-ధాన్యాలు కేటాయించినట్టు చెప్పారు.
కోవిడ్-19 కు ఆర్థిక ప్రతిస్పందన కింద ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ కింద పేదలను ఆదుకునే చర్యలలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రారంభించింది, అదే ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన (పిఎంజికె). లక్షిత పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (టిపిడిఎస్) / నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ) (అంత్యోదయ అన్న యోజన), ప్రియారిటీ హౌస్‌హోల్డ్స్ (పిహెచ్‌హెచ్) పరిధిలో ఉన్న లబ్ధిదారులందరికీ సెంట్రల్ పూల్ కింద నెలకు ఒక్కొక్కొరికి 5 కిలోలు ఉచితంగా కేటాయించడం జరిగింది. . డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డిబిటి) కింద లబ్దిదారులకు కూడా ఇది వర్తింపజేశారు.
***
(Release ID: 1739687)
Visitor Counter : 168