హోం మంత్రిత్వ శాఖ

దిశ బిల్లు

प्रविष्टि तिथि: 27 JUL 2021 4:52PM by PIB Hyderabad

భారత రాష్ట్రపతి అంగీకారం కోసం ఆంధ్రప్రదేశ్ దిశ (మహిళలు మరియు పిల్లలపై నిర్దేశిత నేరాలకు ప్రత్యేక కోర్టులు) బిల్లు 2020  స్వీకరించబడింది. నిబంధనల ప్రకారం రాష్ట్రపతి అనుమతి కోసం రాష్ట్రాల నుండి స్వీకరించిన బిల్లులు నోడల్ మంత్రిత్వ శాఖలు / విభాగాలతో సంప్రదించి ప్రాసెస్ చేయబడతాయి. దీని ప్రకారం బిల్లుకు సంబంధించిన వివిధ మంత్రిత్వ శాఖలు / విభాగాలతో సంప్రదింపుల ప్రక్రియ ప్రారంభించబడింది. ఈ నోడల్ మంత్రిత్వ శాఖలు / విభాగాల నుండి వచ్చిన వ్యాఖ్యలు / పరిశీలనలు వారి వివరణల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పంచుకోబడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం నుండి వివరణలు రాలేదు.

ఈ రోజు లోక్‌సభ ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా హోంశాఖ సహాయమంత్రి శ్రీ అజయ్ కుమార్ మిశ్రా ఈ విషయాన్ని వెల్లడించారు.


 

*****


(रिलीज़ आईडी: 1739577) आगंतुक पटल : 270
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu