వ్యవసాయ మంత్రిత్వ శాఖ
ప్రధానమంత్రి పంటల బీమా పథకం (పిఎంఎఫ్‌బివై) కింద రైతులు పొందుతున్న ప్రయోజనాలు
Posted On:
23 JUL 2021 6:06PM by PIB Hyderabad
ప్రధానమంత్రి పంటల బీమా పథకం (పిఎంఎఫ్‌బివై) వాస్తవిక/ వేలం ద్వారా నిర్ణయించిన ప్రీమియం రేట్లపై అమలు జరుగుతోంది. అయితే, మొత్తం రేట్లలో రైతులు ఖరీఫ్ పంటల కాలంలో 2%, రబీ పంటలు, నూనె గింజలకు గింజలకు 1.5%, వాణిజ్య/ ఉద్యానవన పంటలకు 5% మాత్రమే చెల్లించవలసి ఉంటుంది.2020 ఖరీఫ్ కాలంలో మిగిలిన వాస్తవిక/వేలం ధర రేట్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 నిష్పత్తిలో భరిస్తున్నాయి. ఈశాన్య ప్రాంత రాష్ట్రాల్లో ఈ నిష్పత్తి 90:10 గా ఉంది.
పిఎంఎఫ్‌బివై ప్రధాన అంశాలు:
i.) నివారించలేని ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు జరిగే పంట నష్టానికి సమగ్ర బీమా సౌకర్యాన్ని అందిస్తుంది. దీనివల్ల రైతుల ఆదాయాన్ని స్థిరీకరించే తో పాటు వారు వినూత్న పద్ధతులను అనుసరించడానికి ప్రోత్సహిస్తుంది .
ii) విత్తన కాలం, పంట కోతకు వచ్చే సమయంలో సంభవించే నష్టాలకు భీమా సౌకర్యం
iii ) పంట నష్టం కోసం ఎక్కువగా ఉన్నప్పుడు దావాల పరిష్కారం కోసం ప్రాంత విధానం. ప్రధాన పంటల కోసం నోటిఫైడ్ ఇన్సూరెన్స్ యూనిట్ గ్రామ / గ్రామ పంచాయతీకి తగ్గించబడింది.
iv ) వాస్తవిక / వేలం ప్రీమియం విధానం. కానీ , ఖరీఫ్ పంటలు, రబీ పంటలు మరియు వాణిజ్య / ఉద్యాన పంటలకు వరుసగా 2%, 1.5% మరియు 5% మాత్రమే రైతులు చెల్లించాలి. ఈ పరిమితులకు మించి ఎక్కువగా చెల్లించవలసిన ప్రీమియంను 50: 50 ప్రాతిపదికన కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. ఈశాన్య ప్రాంతంలో ఇది 90: 10 గా ఉంటుంది.
v ) ప్రీమియంకి మించి రైతులు చెల్లించవలసి వచ్చే బీమా మొత్తాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా సబ్సిడీగా అందిస్తాయి.
vi ) రుణాలు తీసుకున్న రైతులు/ రుణాలు పొందని రైతులకు ఏకరీతిగా మొత్తం బీమా అమలు
vii ) ప్రీమియం గరిష్ట పరిమితి తొలగింపు. ప్రీమియంపై గరిష్ట పరిమితిని తొలగించడం వల్ల రైతులుఎటువంటి తగ్గింపు లేకుండా పూర్తి మొత్తానికి బీమా క్లెయిమ్ పొందగలుగుతారు.
viii. వడగళ్ళు, కొండచరియలు విరిగి పడడం , నీటిలో మునిగిపోవడం , ఆకస్మిక భారీ వర్షం మరియు సహజ అగ్నిప్రమాదం మరియు తుఫాను, తుఫాను / అకాల వర్షాలు మరియు వడగళ్ళు కారణంగా ఎండబెట్టడం కోసం 14 రోజుల పాటు పొలంలో ఉంచిన పంటలకు జరిగే నష్టానికి వ్యక్తిగత వ్యవసాయ స్థాయిలో దేశవ్యాప్తంగా ఒకే విధంగా అంచనా వేయడం జరుగుతుంది.
ix )విత్తనాలను నాటని సమయంలో బీమా చేసిన మొత్తంలో 25% వరకు క్లెయిమ్‌లను కోరవచ్చును.
x ) పంట మధ్య కాలంలో ఉన్నప్పుడు బీమా చేసిన మొత్తం యూనిట్ లో నష్టం 50%కి మించి ఉన్నప్పుడు బీమా మొత్తంలో 25% “ఆన్-అకౌంట్ చెల్లింపు”గా పొందడానికి అవకాశం. మిగిలిన మొత్తం పంట కోత ప్రయోగ పరీక్షల ద్వారా నిర్ధారణ.
xi ) క్లెయిమ్‌లను త్వరితగతిన పరిష్కరించి చెల్లింపులు చేయడానికి రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ, స్మార్ట్ఫోన్లు మరియు డ్రోన్‌లను ఉపయోగించి పంట నష్టం అంచనా వేయడం.
xii ) మెరుగైన పరిపాలన, సమన్వయం, పారదర్శకత, సమాచారం సేవలను అందించడానికి పంట బీమా పోర్టల్ అభివృద్ధి చేయబడింది. క్లెయిమ్ మొత్తం ఎలక్ట్రానిక్ విధానం ద్వారా వ్యక్తిగత రైతు బ్యాంక్ ఖాతాకు జమ అవుతుంది.
xiii ) పథకాలపై అందరిలో అవగాహన కల్పించి వనరుల సమీకరణ కోసం ప్రత్యేక ప్రాధాన్యత.
xiv ) రైతులను బలవంతంగా కాకుండా వారు స్వచ్చంధంగా పథకంలో చేరేలా చర్యలను అమలు చేయడం.
ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన (పిఎఫ్‌ఎమ్‌బివై) కింద గత మూడేళ్లలో ప్రీమియం సబ్సిడీ అందించిన మొత్తం రైతు దరఖాస్తుల వివరాలు ఈ క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి:
సంవత్సరం
|
నమోదు చేసిన రైతు దరఖాస్తుల సంఖ్య (లక్షల్లో)
|
2018-19
|
577.7
|
2019-20
|
612.3
|
2020-21
|
613.6
|
ఈ సమాచారం కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ఈ రోజు రాజ్యసభలో రాతపూర్వక సమాధానంలో ఇచ్చారు.
(Release ID: 1738381)
Visitor Counter : 546