కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కోవడానికి కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చర్యలు

Posted On: 20 JUL 2021 4:44PM by PIB Hyderabad

కంపెనీల చట్టం 2013, పరిమిత బాధ్యత భాగస్వామ్యం చట్టం 2008, దివాలా మరియు దివాలా కోడ్, 2016 లోని నిబంధనలు ప్రాధమికంగా అమలు జరిగేలా కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చర్యలను తీసుకుంటున్నదని కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి వ్యవహారాలు శ్రీ రావు ఇందర్‌జిత్ సింగ్ తెలిపారు. ఈ రోజు రాజ్య సభలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చిన మంత్రి సమాధానం ఇస్తూ శాఖ పనితీరును, కోవిడ్ ను ఎదుర్కోవడానికి అమలు చేసిన చేసిన చర్యలను వివరించారు.

i ) 2020 ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు ఎంసీఏ 21 దాఖలు లో జరిగిన జాప్యాన్ని దృష్టిలో ఉంచుకుని కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించడానికి అవసరమైన పత్రాలను దాఖలు చేయడానికి అవకాశం కల్పిస్తూ కంపెనీస్ ఫ్రెష్ స్టార్ట్ స్కీమ్, 2020 ను ప్రారంభించడం జరిగింది. పత్రాలను సమర్పించడంలో జరిగిన జాప్యానికి విధించే జరిమానాలు విధించడం, ప్రాసిక్యూషన్లు మరియు విచారణల నుంచి దీనిప్రకారం మినహాయింపు లభిస్తుంది. కంపెనీస్ ఫ్రెష్ స్టార్ట్ స్కీమ్, 2020 ను ప్రారంభించడం వల్ల భారతదేశంలో నమోదైన 4,73,131 కంపెనీలు, 1,065 విదేశీ కంపెనీలు ప్రయోజనం పొందాయని రికార్డుల ద్వారా తెలుస్తోంది. 

ii )నిబంధనల ప్రకారం కంపెనీల రిజిస్ట్రార్ ('ఆర్‌ఓసిలేదా 'రిజిస్ట్రార్‌)కు నిర్ణీత వ్యవధిలో పత్రాలను సమర్పించడంలో విఫలమైన పరిమిత భాగస్వామ్య సంస్థల వ్యాపార కార్యక్రమాలు సజావుగా సాగేలా చూడడానికి కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఎల్‌ఎల్‌పి సెటిల్మెంట్ స్కీమ్‌ 2020ను ప్రవేశపెట్టింది. 

పరిమిత భాగస్వామ్య సంస్థలు కొన్ని పత్రాలను సమర్పించడానికి వీలు కల్పించే ఈ పథకాన్ని 16.03.2020 నుంచి 31.03.2020 వరకు అమలు చేయడం జరిగింది. అయితే, కోవిడ్ వల్ల ఏర్పడిన పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అన్ని పత్రాలను సమర్పించడానికి వీలు కల్పిస్తూ పథకంలో కొన్ని మార్పులు చేసి పథకం 01.04.2020 నుంచి 31.12.2020 వరకు తిరిగి అమలు చేయడం జరిగింది. దీని ప్రకారం, పత్రాలను సమర్పించడంలో విఫలమైన పరిమిత భాగస్వామ్య సంస్థలు వాటిని ఎటువంటి జరిమానాలు, ప్రాసిక్యూషన్‌ లేకుండా ఆలస్యమైన పత్రాలను దాఖలు చేయడానికి అనుమతించబడ్డాయి. ఎల్‌ఎల్‌పి సెటిల్మెంట్ స్కీమ్ 2020 ను ఉపయోగించుకుని 1,05,643 ఎల్‌ఎల్‌పిలు తమ పెండింగ్ పత్రాలను దాఖలు చేసి ప్రయోజనం పొందాయి. 

iii ) కోవిడ్ రెండవ దశ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని కొన్ని ఫారాలను దాఖలు చేయడంలో కంపెనీలు / పరిమిత భాగస్వామ్య సంస్థలకు అదనపు రుసుము వసూలు చేయడంపై సడలింపును (  సిహెచ్‌జి  -1 ఫారం ,   సిహెచ్‌జి  - 4 ఫారం మరియు సిహెచ్‌జి -9 ఫారంఛార్జ్ సంబంధిత ఫారమ్‌లు కాకుండా ఇతర  ఫారమ్‌లు )మంజూరు చేసింది. దీని ప్రకారం   2021 ఏప్రిల్ 31, 2021 నుంచి  31 మే, 2021 వరకు దాఖలు చేయాల్సిన / గడువు ఉన్న ఫారాలను  (పైన పేర్కొన్న ఛార్జ్ సంబంధిత ఫారమ్‌లు కాకుండా) 2021 జూలై 31 వరకు అదనపు ఫీజులు లేకుండా సమర్పించడానికి అవకాశం కలిగించడం జరిగింది.

జూలై 312021 వరకు సాధారణ ఫీజులు మాత్రమే చెల్లించవలసి ఉంటుంది. 30.06.2021 నాటి జనరల్ సర్క్యులర్ నెం .11 / 2021 ద్వారా 2021 ఆగస్టు 31 వరకు ఈ కాలపరిమితిని మరింత పొడిగించారు.

iv ) చట్టాన్ని గౌరవించే పనిచేస్తున్న  సంస్థలకు కోవిడ్ నేపథ్యంలో  ఉపశమనం కలిగించడానికి కంపెనీ చట్టం, 2013 ప్రకారం ఛార్జీలకు సంబంధించిన ఫారాలను దాఖలు చేయడానికి గడువును 2020 మార్చి నుంచి డిసెంబర్ 31 వరకు పొడిగిస్తూ ఒక పథకం ప్రారంభించబడింది.

v ) కోవిడ్ -19 మహమ్మారి వల్ల ఏర్పడిన సమస్యలను పరిశీలించిన కార్పొరేట్ వ్యవహారాల శాఖ  03.05.2021న జారీ  చేసిన  7/2021ఉత్తర్వులలో ఒక సంస్థ లేదా ఛార్జ్ హోల్డర్ ఏర్పాటు  / మార్పులకు సంబంధించి సమర్పించవలసి ఉన్నఫారంల   ( సిహెచ్‌జి   -1 ఫారం మరియు  సిహెచ్‌జి   -9 ఫారం) గడువును పొడిగించడం లేదా మినహాయింపు ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం (i) 1.4.2021 కి ముందుకానీ అటువంటి ఫారమ్‌ను దాఖలు చేయడానికి గడువు  1.4.2021 నాటికి చట్టం యొక్క సెక్షన్ 77 ప్రకారం ముగియకుండా ఉండడం లేదా (ii) 1.4.2021 నుంచి 31.5.2021 మధ్య ఏదైనా తేదీ వరకు (రెండు తేదీలు కలుపుకొని) గడువు కలిగిన వాటికి ఈ సౌకర్యం వర్తిస్తుంది. పైన పేర్కొన్న ఉత్తర్వుల్లో ఫారంలను సమర్పించడానికి విధించిన గడువును నిర్దేశించిన ఫీజుల వివరాలను తెలియజేయడం జరిగింది. ఆ తరువాత ఈ అవకాశాన్ని 31.07.2021 నుంచి 01.08.2021 వరకు పొడిగించడం జరిగింది. 

vi ) కంపెనీల చట్టం, 2013 లోని సెక్షన్ 252 ప్రకారం 2020 డిసెంబర్ 1 నుంచి 2020 డిసెంబర్ 31 మధ్య ఎన్‌సిఎల్‌టి ద్వారా పునరుద్ధరించిన కంపెనీల కోసం కాండొనేషన్ ఆఫ్ డిలే స్కీమ్‌ను ఎంసిఎ ప్రకటించింది. రిజిస్ట్రార్‌తో ఫారాలను దాఖలు చేయడంలో జాప్యాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఈ పథకం వీలు కల్పిస్తుంది. జరిగిన జాప్యానికి జరిమానాలు కూడా విధించరు. 

ఈ పథకం ఫిబ్రవరి 1, 2021 నుండి అమలులో ఉంది మరియు 2021 మార్చి 31 వరకు అటువంటి కంపెనీలు ఏవైనా ఇ-ఫారాలను దాఖలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి.ఈ పథకం ఫిబ్రవరి 1, 2021 నుంచి  అమలులో ఉంది. 2021 మార్చి 31 వరకు కంపెనీలు ఇ-ఫారాలను దాఖలు చేయడానికి గడువు ఇవ్వడం జరిగింది. 

vii  ) కోవిడ్ -19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని కంపెనీలకు ఉపశమనం కలిగించడానికి వివిధ విషయాలకు సంబంధించి తీర్మానాలను ఆమోదించడానికి వీడియో కాన్ఫరెన్స్  లేదా ఇతర ఆడియో-విజువల్ మార్గాల ద్వారా బోర్డు సమావేశాలను నిర్వహించడానికి అనుమతి ఇవ్వబడింది. అంతకుముందు ఈ అంశాలను ఆమోదించడానికి బోర్డు సమావేశాలకు స్వయంగా హాజరై డైరెక్టర్లు తమ ఆమోదాన్ని తెలియజేయవలసి ఉండేది. కోవిడ్ నేపథ్యంలో  సంస్థలకు ఇటువంటి సదుపాయం తొలుత 2021 జూన్ 30 వరకు కల్పించడం జరిగింది.  (ప్రారంభంలో ఇది 30.06.2020 వరకు అమలులో ఉన్న ఈ సౌకర్యం  తరువాత 30.09.2020 మరియు 31.12.2020 వరకు పొడిగించబడింది). కోవిడ్ రెండవ దశను దృష్టిలో ఉంచుకుని అన్ని అంశాలను వీడియో కాన్ఫరెన్స్లేదా ఇతర ఆడియో విజువల్ మార్గాల ద్వారా చర్చించి ఆమోదించడానికి వీలు కల్పిస్తూ కంపెనీల రూల్ 4 (బోర్డు మరియు దాని అధికారాల సమావేశాలు) నిబంధనలను 15.06.2021 జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా తొలగించడం జరిగింది. దీని ప్రకారం ప్రభుత్వ లక్ష్యం మేరకు వ్యాపార లావాదేవీలు సులువుగా కొనసాగించడానికి అవకాశం కలుగుతుంది. 

viii ) 2021 జూన్ 30 వ తేదీ వరకు  వీడియో కాన్ఫరెన్సింగ్ (విసి) లేదా ఇతర ఆడియో-విజువల్ మార్గాల (ఓఎవిఎం) ద్వారా ఎక్స్‌ట్రా ఆర్డినరీ జనరల్ మీటింగ్స్ (ఇజిఎం) నిర్వహించడానికి ఈ -ఓటింగ్ సదుపాయం / రిజిస్టర్డ్ ఇమెయిళ్ళ ద్వారా సరళీకృత ఓటింగ్ నిర్వహించడానికి కంపెనీలకు అనుమతి ఇవ్వడం జరిగింది. కోవిడ్ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ సౌకర్యం 2021 డిసెంబర్ 31వరకు పొడిగించబడింది. 

ix ) 2020 సంవత్సరంలో జరగాల్సి ఉన్న  లేదా 2021 సంవత్సరంలో నిర్వహించవలసి ఉన్న వార్షిక సర్వసభ్య సమావేశాలను  వీడియో కాన్ఫరెన్సింగ్  లేదా ఇతర ఆడియో-విజువల్ మార్గాల  ద్వారా నిర్వహించడానికి అనుమతులు జారీ అయ్యాయి. ఆర్ధిక వివరాల భౌతిక కాపీలను పంపించడంలో ఇబ్బందులు ఉన్నందున బోర్డు నివేదికలుఆడిటర్ నివేదికలు మరియు వాటికి జత చేయవలసిన ఇతర పత్రాలను ఈ మెయిల్ ద్వారా పంపించడానికి కంపెనీలకు అనుమతులు జారీ అయ్యాయి. 

x )  కార్పొరేట్ వ్యవహారాల శాఖ సూచన మేరకు  మేరకు 2020 మార్చి 31తో  ముగిసిన ఆర్థిక సంవత్సరానికి వార్షిక సర్వసభ్య సమావేశ నిర్వహణ గడువును కంపెనీల రిజిస్ట్రార్ 2020 డిసెంబర్ 31 వరకు పొడిగించారు.  ( కంపెనీల చట్టం  96 సెక్షన్ కింద రిజిస్ట్రార్  పొడిగించగల గరిష్ట కాలం ).

xi ) ఫైనాన్షియల్ స్టేట్మెంట్లు కంపెనీలు (అకౌంట్స్) రూల్స్కంపెనీస్ (ఆడిట్ అండ్ ఆడిటర్స్) రూల్స్ అండ్ కంపెనీస్ (ఆడిటర్స్ రిపోర్ట్) ఆర్డర్, 2020 ప్రకారం సమర్పించవలసి ఉన్న నివేదికల తయారీలో మార్పులు చేస్తూ   సవరణలు  చేయబడ్డాయి. నూతన విధానం  కంపెనీలు (ఆడిటర్స్ రిపోర్ట్) ఆర్డర్, 2020 కి వర్తిస్తుంది. దీనితో  2021-22 ఆర్థిక సంవత్సర ఆర్థిక నివేదికలను  ఆడిటర్లు మరియు సంస్థలు  సులభతరంగా సిద్ధం చేయడానికి అవకాశం కలుగుతుంది.

xii ) కంపెనీలు (ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్) నిబంధనలు 2015 ప్రకారం కోవిడ్ -19ను దృష్టిలో ఉంచుకుని  గత ఏడాది ప్రవేశపెట్టిన సంబంధిత అద్దె రాయితీ యొక్క ప్రయోజనాలను  18.06.2021 నుంచి 2022 జూన్ 30 వరకు అమలు చేయడం జరిగింది. 

xiii ) కంపెనీల చట్టం, 2013 (సిఎ -13) (120 రోజులు) లోని సెక్షన్ 173 ప్రకారం  తప్పనిసరిగా నిర్వహించవలసి ఉన్న కంపెనీల బోర్డు సమావేశాల వ్యవధిని  మరో 60 రోజుల పాటు అంటే 2021 సెప్టెంబర్  30 వరకు పొడిగించబడిందికోవిడ్  రెండవ దశ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని  మంత్రిత్వ శాఖ 2021-22 సంవత్సరానికి పైన పేర్కొన్న సడలింపును మరింత పొడిగించింది.  దీనితో  బోర్డు యొక్క రెండు వరుస సమావేశాలను 120 రోజుల వ్యవధిలో కాకుండా 180రోజుల వ్యవధిలో నిర్వహించటానికి అనుమతి ఇవ్వడం జరుగుతుంది.   

xiv ) ఒక సంస్థ యొక్క స్వతంత్ర డైరెక్టర్లు (ఐడిలు) కనీసం ఒక తప్పనిసరి సమావేశాన్ని నిర్వహించకుండా సడలింపు ఇవ్వబడింది. దీనితో   2019-20 ఆర్థిక సంవత్సరానికి ఒక సంస్థ యొక్క ఐడిలు అలాంటి సమావేశాన్ని నిర్వహించడంలో విఫలమైనా అది  ఉల్లంఘనగా పరిగణింపబడదు.

xv ) ప్రస్తుత స్వతంత్ర డైరెక్టర్లు తమ పేర్లను డేటాబ్యాంక్‌లో చేర్చడానికి అనుమతి కోరుతూ ఆన్ లైన్ లో నిర్ణయించిన గడువును 2019 డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి 13 నెలలకు పొడిగిస్తూ కంపెనీల (అపాయింట్‌మెంట్ అండ్  క్వాలిఫికేషన్ ఆఫ్ డైరెక్టర్స్) నిబంధనలు, 2014లలో కాలానుగుణంగా సవరణలు చేయబడ్డాయి. తన పేరును డేటా బ్యాంకులో చేర్చాలని కోరుతూ దరఖాస్తు చేయడంలో ఒక డైరెక్టర్ విఫలమైనా లేదా దీనిలో జాప్యం జరిగినా సంబంధిత సంస్థ సదరు జాప్యానికి 1000 రూపాయలను ఫీజుగా వసూలు చేసి ఆ వ్యక్తి పేరును రికార్డులలో నమోదు చేయడానికి వీలు కల్పిస్తూ కంపెనీలు (ఇండిపెండెంట్ డైరెక్టర్ల డేటాబ్యాంక్ క్రియేషన్ అండ్ మైంటెనెన్సు నిబంధనలు    2019 ను 18.06.2021 నాటి  నోటిఫికేషన్‌ ద్వారా సవరించడం జరిగింది. 

ఈ సవరణ ద్వారా గడువు పెంచాలని కోరుతూ అందిన అభ్యర్థనలను పరిష్కరించడం జరిగింది. 

xvi )చట్టం 2013 లోని సెక్షన్ 73 (2) (సి) కింద 20% డిపాజిట్ తిరిగి చెల్లించే రిజర్వ్ ను  రూపొందించడానికి మరియు కంపెనీల (షేర్ క్యాపిటల్ మరియు డిబెంచర్స్) నిబంధనలు, 2014 నియమం 18 ప్రకారం  డిబెంచర్లలలో 15% పెట్టుబడి పెట్టడానికి లేదా జమ చేయడానికి విధించిన గడువును 2020 డిసెంబర్ 31 వరకు పొడిగించబడింది.

xvii ) నూతనంగా నమోదైన కంపెనీలు తమ వ్యాపార ప్రారంభ డిక్లరేషన్ ను దాఖలు చేయడానికి 180 రోజుల అదనపు వ్యవధి అనుమతించబడింది.

xviii )   ప్రతి కంపెనీలో కనీసం ఒక  డైరెక్టర్ అయినా కనీసం 182 రోజుల పాటు భారతదేశంలో నివసించి ఉండాలంటూ  చట్టం లోని సెక్షన్ 149 ప్రకారం నిర్ధేశించిన నిబంధనను  2019-20 మరియు 2020- ఆర్థిక సంవత్సరానికి పరిగణనలోకి తీసుకోవడం జరగదు. 

xix )2020 మే మరియు 2020 జూలై 24 నాటి సెబీ సర్క్యులర్లకు లోబడి పనిచేస్తున్న కంపెనీలు  2020 డిసెంబర్ 31 వరకు రిజిస్టర్డ్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా లిస్టెడ్ కంపెనీలు తమ వాటాదారులకు రైట్స్ ఇష్యూ  నోటీసును పంపించలేకపోవడం ఈ చట్టం లోని  సెక్షన్ 62 (2) ఉల్లంఘనగా పరిగణించబడదు.  లిస్టెడ్ కంపెనీలు ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్ ద్వారా నోటీసు జారీ చేసే విధానాన్ని సెబీ ఆమోదించింది. 

xx ) లిస్టెడ్ కంపెనీలు , ఎన్‌బిఎఫ్‌సిలు డిబెంచర్లను  ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ప్రాతిపదికన జారీ చేసినప్పుడు  ఒక నిర్దిష్ట సంవత్సరంలో పరిపక్వత చెందిన డిబెంచర్లలో 15% ని అనుమతించిన వాటిలో  పెట్టుబడి పెట్టాలన్న నిబంధన వర్తించదు. 

xxi ) కోవిడ్ -19 రూపంలో ఎదురైన సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఎన్ ఎఫ్ ఆర్ ఏ -2 ఫారమ్‌ను  ఎన్ ఎఫ్ ఆర్ ఏ   తో దాఖలు చేయడానికి ఆడిటర్లు మరియు ఆడిట్ సంస్థలకు మొత్తం 270 రోజుల వరకు పొడిగించబడింది.

xxii )  సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సిఎపిఎఫ్) మరియు సెంట్రల్ పారా మిలిటరీ ఫోర్సెస్ (సిపిఎంఎఫ్) సీనియర్లు మరియు వితంతువులతో వారిపై ఆధారపడి జీవిస్తున్న వారి సంక్షేమం కోసం  కంపెనీలు చేసిన ఖర్చును సిఎస్ఆర్ ఖర్చుగా పరిగణిస్తారు.

 

xxiii )  సంస్థ కాస్ట్ ఆడిట్ నివేదికను  కాస్ట్ ఆడిటర్ సమర్పించవలసిన గడువును  2020 డిసెంబర్ 31 వరకు పొడిగించబడింది మరియు 2019-2020 ఆర్థిక సంవత్సరానికి సి ఆర్ ఎ -4 (కాస్ట్ ఆడిట్ రిపోర్ట్ నమూనా) దాఖలు చేయడానికి అదనపు రుసుము సడలించబడింది.

 

***



(Release ID: 1737457) Visitor Counter : 174


Read this release in: English , Tamil