ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

వైద్యులు, ఆరోగ్య సంరక్షణ నిపుణులపై పెరిగిన భౌతిక‌ హింసాఘటనలు

Posted On: 20 JUL 2021 3:55PM by PIB Hyderabad

రాజ్యాంగ ప్రకారం ‘ఆరోగ్యం’ మరియు ‘శాంతి, భ‌ద్ర‌త‌లు’ రాష్ట్ర ప‌రిధిలోని అంశాలు. దేశంలో ఉన్న వైద్యులు, ఆరోగ్య రంగంలోని నిపుణులపై ఎన్ని బౌతిక‌ దాడి సంఘటనలు జరిగాయ‌నే అంశాన్ని కేంద్రం ప‌ర్య‌వేక్షించ‌దు. ఈ త‌ర‌హా దాడుల‌ను నిర‌సిస్తూ ఐఎంఏ 20 జూన్ 2021న దేశ వ్యాప్త నిరసనను నిర్వహించింది. హింసను తగ్గించడానికి కఠినమైన చట్టాలు తేవ‌డంతో పాటు వాటి స‌మ‌ర్థ‌వంత‌మైన‌ అమలు చేప‌ట్టాల‌ని ఐఎంఏ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. విధుల్లో ఉన్న వైద్యులలో సమర్థవంతమైన భద్రతా భావాన్ని పెంపొందించడానికి వీలుగా తక్షణ చర్యలను పరిగణనలోకి తేవ‌డానికి కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు/ యుటీలకు అడ్వైజ‌రీని జారీ చేసింది. అడ్వైజ‌రీలో ప‌లు వివ‌రాలు ఇలా ఉన్నాయి..
I. సున్నిత ప్రాంతాల‌లోని ఆసుపత్రుల భద్రత నిర్వ‌హ‌ణ‌ను ప్ర‌త్యేక‌మైన‌, శిక్షణ పొందిన భ‌ద్ర‌తా ద‌ళం ద్వారా చేప‌ట్టాలి.
II. సీసీటీవీ కెమేరాల ఏర్పాటుతో పాటుగా క్యాజువాలిటీ, ఎమ‌ర్జెన్సీ విభాగాల‌తో పాటుగా అధిక‌
సంద‌ర్శ‌న‌లు ఉండే ఆసుప‌త్రి ఆవ‌ర‌ణ‌ల‌లో అతి సమర్థవంతమైన కమ్యూనికేషన్ / సెక్యూరిటీ గాడ్జెట్‌లతో అన్ని వేళ‌ల త‌క్ష‌ణం స్పందించే భ‌ద్ర‌తా బృందాల ఏర్పాటు.

III. పర్యవేక్షణ మరియు శీఘ్ర ప్రతిస్పందనకు గాను మేటిగా అమర్చిన కేంద్రీకృత నియంత్రణ గది ఏర్పాటు చేయాలి

IV. అవాంఛనీయ వ్యక్తులకు ప్రవేశంపై పరిమితి విధించ‌డం

V. దాడుల‌కు ఎగ‌బ‌డే దుండగులకు వ్యతిరేకంగా సంస్థాగత ఎఫ్ఐఆర్

VI. ప్రతి ఆసుపత్రి ఆవ‌ర‌ణ‌, పోలీస్ స్టేషన్లలో వైద్యులను రక్షించే చట్టాన్ని ప్రదర్శించడం

VII. వైద్య నిర్లక్ష్యాన్ని పర్యవేక్షించడానికి నోడల్ అధికారి నియామకం

VIII. వైద్యులపై అధిక భారం / ఒత్తిడిని నివారించడానికి మరియు ప్రపంచ వైద్యుడు-రోగి నిష్పత్తిని నిర్వహించడానికి ఆసుపత్రులు / ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో (పీహెచ్‌సీ) ఖాళీగా ఉన్న వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది పదవులను భ‌ర్తీ చేయ‌డం.

IX. మెరుగైన మౌలిక సదుపాయాలు మరియు వైద్య పరికరాలు మరియు మెరుగైన కెరీర్ అవకాశాలున్న ప్రధాన మరియు మెట్రో నగరాలతో పోలిస్తే క‌ఠిన‌మైన‌ / మారుమూల‌ ప్రాంతాల్లో పని చేస్తున్న వైద్యులు మరియు పారా వైద్య సిబ్బందికి అదనంగా వివిధ‌ ద్రవ్య ప్రోత్సాహాన్ని అందించడం.
దీనికి అనుబంధంగా కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ‌ల మంత్రి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకూ చట్ట నియమాలను నిర్ధారించాలంటూ లేఖ రాశారు. తద్వారా వైద్యులు మరియు క్లినికల్ సంస్థలు తమ విధులను, వృత్తిపరమైన చ‌ర్య‌ల‌ను హింసకు భయపడకుండా నిర్వర్తించే వీలుంటుంద‌ని మంత్రి తెలిపారు. దీనికి తోడు చట్టం ప్రకారం, వైద్యులపై హింసకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాల‌ని కూడా మంత్రి కోరారు.
దాడుల‌కు దిగితే క‌ఠిన శిక్ష‌లు..
కోవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో భారత ప్రభుత్వం 2020 సెప్టెంబర్ 28 న ఎపిడెమిక్ డిసీజెస్ (సవరణ) చట్టం 2000కి ఆమోదం తెలిపింది. మహమ్మారి విస్త‌రిస్తున్న ప్ర‌స్తుత పరిస్థితులలో ఆరోగ్య సంరక్షణ సిబ్బందిపై హింసకు పాల్పడటం విచారించ‌ద‌గ్గ మరియు బెయిల్ జారీకి వీలులేని నేరం అని ఈ సవరించిన చట్టం చెబుతోంది.
-ఇలాంటి హింసాత్మ‌క‌ చర్యలకు పాల్ప‌డ‌టం లేదా మద్దతు ఇవ్వడం వ‌ల‌న మూడు నెలల నుండి అయిదు సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటుగా.. రూ.50,000/- నుండి రూ.2,00,000/- వరకు జరిమానా విధించ‌డ‌బ‌డుతుంది. త‌మత‌మ‌ చ‌ర్య‌ల ద్వారా  తీవ్రమైన బాధ కలిగించినట్లయితే, జైలు శిక్ష ఆరు నెలల నుండి ఏడు సంవత్సరాల వరకు మరియు రూ.1,00,000/- నుండి రూ.5,00,000/- వరకు జరిమానా విధించ‌బ‌డుతుంది.
-దీనికి అదనంగా, తాను పాడు చేసిన ఆస్తి సరసమైన మార్కెట్ విలువకు రెండింతలు అప‌రాధి బాధితుడికి పరిహారంగా చెల్లించాల్సి ఉంటుంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ ఈ రోజు ఇక్కడ రాజ్యసభకు ఇచ్చిన ఒక‌ లిఖితపూర్వక సమాధానంలో ఈ స‌మాచారాన్ని తెలిపారు.
                                 

****



(Release ID: 1737344) Visitor Counter : 118


Read this release in: English , Punjabi , Tamil