ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్‌-19 కార‌ణంగా మ‌ర‌ణించిన ఆరోగ్య కార్య‌క‌ర్త‌ల కుటుంబాల‌కు న‌ష్ట‌ప‌రిహారం

Posted On: 20 JUL 2021 3:50PM by PIB Hyderabad

కోవిడ్ -19 మ‌హ‌మ్మారిపై పోరాటం చేస్తున్న ఆరోగ్య కార్య‌క‌ర్త‌ల‌కు ప్ర‌ధాన‌మంత్రి గ‌రీబ్ క‌ళ్యాణ్ ప్యాకేజీ కింద (పిఎంజికెపి) బీమా ప‌థ‌కం కింద జీవిత బీమా సౌక‌ర్యాల‌ను క‌ల్పిస్తున్నారు.  ప్ర‌భుత్వం రూపొందించిన ముసాయిదాలో  భాగంగా కోవిడ్ -19 బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హించే సిబ్బందికి, ముఖ్యంగా  రోగుల‌కు ప్ర‌త్య‌క్షంగా వైద్య సేవ‌లు అందిస్తూ, ఆ వ్యాధి సోకే అవ‌కాశం ఉన్న క‌మ్యూనిటీ హెల్త్ కేర్ కార్య‌క‌ర్త‌లు, ప్రైవేటు హెల్త్ కేర్ వ‌ర్క‌ర్లు స‌హా  ఆరోగ్య సంర‌క్ష‌ణ సేవ‌లు అందిస్తున్న సిబ్బందికి ఈ  ప‌థ‌కం కింద వ్య‌క్తిగ‌త ప్ర‌మాదం క‌వ‌ర్ గా రూ. 50 ల‌క్ష‌లు మేర‌కు ల‌బ్ధి పొందే అవ‌కాశం ఉంది. పైన పేర్కొన్న ప‌థ‌కం కింద ల‌బ్ధి సౌక‌ర్యాన్ని 180 రోజుల‌కు (24.04.2021 నుంచి) పొడిగించారు.
ఈ ప‌థ‌కం కింద 15 జులై 2021 నాటికి మొత్తం 921మంది వైద్యుల‌కు, ఆరోగ్య సంర‌క్ష‌ణ కార్య‌క‌ర్త‌ల‌కు రూ. 50 ల‌క్ష‌ల చొప్పున బీమా క్లెయిమును చెల్లించారు.
మ‌హ‌మ్మారి స‌మ‌యంలో మాన‌వ వ‌న‌రుల సంక్షోభాన్ని గుర్తిస్తూ, ఆరోగ్య‌& కుటుంబ సంక్షేమ శాఖ వైద్య అధికారులు, సిబ్బంది సంక్షేమం కోసం ర‌క్ష‌ణ చ‌ర్య‌ల‌ను మెరుగుప‌ర‌చే అనేక చ‌ర్య‌ల‌ను చేప‌ట్టింది.
ఈ అంశంలో తీసుకున్న ఇత‌ర చ‌ర్య‌లు ః
కోవిడ్ -19 నేప‌థ్యంలో  అంటువ్యాధుల (స‌వ‌ర‌ణ‌) ఆర్డినెన్స్‌ను 22 ఏప్రిల్ 2020న జారీ చేశారు. అంతేకాకుండా, ఈ ఆర్డినెన్స్ ను పార్ల‌మెంటు లో ప్ర‌వేశ‌పెట్టి, ఆమోదించి 29 సెప్టెంబ‌ర్ 2020న నోటిఫై చేశారు. ఆరోగ్య సంర‌క్ష‌ణ సేవ‌లు అందించే సిబ్బంది (హెచ్ఎస్‌పిలు)ని హింసాత్మ‌క చ‌ర్య‌ల నుంచి ర‌క్ష‌ణ‌ను, భ‌ద్ర‌త‌ను అందించ‌డం అన్న‌ది స‌వ‌ర‌ణ‌లో భాగం. 
కోవిడ్‌-19 వాక్సినేష‌న్ చొర‌వ‌ను 16 జ‌న‌వ‌రి, 2021న ప్రారంభించిన త‌ర్వాత‌, ఆరోగ్య కార్య‌క‌ర్త‌ల‌ను తొలి ప్రాధాన్య‌తా గ్రూపుగా గుర్తించ‌డం జ‌రిగింది. కోవిడ్ సంబంధిత ప‌నుల‌లో నిమ‌గ్న‌మైన వైద్యుల‌కు  వాక్సిన్ ఇవ్వ‌వ‌ల‌సిందిగా రాష్ట్ర ప్ర‌భుత్వాలు/  కేంద్ర పాలిత ప్రాంతాల ప్ర‌భుత్వాల‌ను ప‌దే ప‌దే కోర‌డం జ‌రిగింది.
ఆరోగ్య సంర‌క్ష‌ణ కార్య‌క‌ర్త‌ల‌కు ఇన్ఫెక్ష‌న్ వ‌చ్చే ప్ర‌మాదాన్ని క‌నిష్టం చేసేందుకు   సంక్ర‌మ‌ణ నివార‌ణ‌, నియంత్ర‌ణ ప‌ద్ధ‌తుల‌కు సంబంధించిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు అందించింది. 
అన్ని వ‌ర్గాల ఆరోగ్య సంర‌క్ష‌ణ కార్య‌క‌ర్త‌ల‌కు ఐజిఒటి ప్లాట్‌ఫాంపై నివార‌ణ‌, నియంత్ర‌ణ పై శిక్ష‌ణ‌ను అందుబాటులోకి తెచ్చారు.
ఆసుప‌త్రి, సామాజిక ప‌రిస‌రాల‌లోపిపిఇల‌ను హేతుబ‌ద్ధంగా ఉప‌యోగించ‌డంపై మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ఆరీ చేయ‌డం జ‌రిగింది. వివిధ ప్ర‌మాద‌క‌ర ప‌రిస‌రాల‌లో సూచిత  పిపిఇ ల‌ను వినియోగించ‌డం అనే రిస్క్ ఆధారిత ప‌ద్ధ‌తిని మార్గ‌ద‌ర్శ‌కాలు అనుస‌రించాయి. 
సంక్ర‌మ‌ణ నివార‌ణ‌కు, రోగ‌నిరోధ‌క‌త‌కు ఆరోగ్య కార్య‌క‌ర్త‌ల‌కు హైడ్రాక్సీక్లోరోక్విన్ ను అందించారు. ఈ మేర‌కు సూచ‌న‌ల‌ను 23 మార్చి 2020న ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ జారీ చేసింది. 
అధిక రిస్కును ఎదుర్కొనే ఆరోగ్య‌కార్య‌క‌ర్త‌ల‌కు మొద‌ట్లో ఒక‌వారం పాటు క్వారెంటీన్ చేసి, అనంత‌రం ఆరోగ్య కార్య‌క‌ర్త ఆరోగ్య ప‌రిస్థితిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని, క్వారెంటీన్ ను మ‌రొక వారం పొడిగిస్తున్నారు. కోవిడ్ వార్డుల‌లో, ఆసుప‌త్రుల‌లోని కోవిడ్‌యేత‌ర ప్రాంతాల‌లో ప‌ని చేస్తున్న ఆరోగ్య కార్య‌క‌ర్త‌ల‌కు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ 18 జూన్ 2020న  ఈ మేర‌కు సూచ‌న‌ల‌ను జారీ చేసింది. 
ఈ స‌మాచారాన్నికేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్ట‌ర్ భార‌తీ ప్ర‌వీణ్ ప‌వార్ మంగ‌ళ‌వారంనాడు రాజ్య‌స‌భ‌కు లిఖిత పూర్వ‌క స‌మాధానం ద్వారా వెల్ల‌డించారు. 

***



(Release ID: 1737337) Visitor Counter : 145


Read this release in: English , Urdu