సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని పది ప్రభుత్వ మ్యూజియంలు, గ్యాలరీలలోని 2.8 లక్షలకు పైగా కళాఖండాలు ఆన్-లైన్ లో దర్శించడానికి వీలుగా అందుబాటులో ఉన్నాయి : శ్రీ జి. కిషన్ రెడ్డి
Posted On:
19 JUL 2021 5:36PM by PIB Hyderabad
కోవిడ్-19 ప్రారంభానికి ముందే, ఏప్రిల్, 2014 నుండి జతాన్ కార్యక్రమం ద్వారా పది (10) మ్యూజియంలలోని కళాఖండాలను డిజిటలైజేషన్ చేసే పనిని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ చేపట్టింది. దీనితో పాటు, మంత్రిత్వ శాఖ 'మ్యూజియం గ్రాంట్ స్కీమ్' అనే పథకాన్ని కూడా నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న మ్యూజియంలలోని కళా ఖండాలను ఆన్-లైన్ లో దర్శించడానికి, వెబ్-సైట్ లో వాటి చిత్రాలు / జాబితాలను అందుబాటులో ఉంచడానికి వీలుగా, డిజిటలైజ్ చెయ్యడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు, సంఘాలు, స్వయంప్రతిపత్తి సంస్థలు, స్థానిక సంస్థలు, సొసైటీల చట్టం కింద నమోదుదైన ట్రస్టులకు, ఈ పధకం కింద, ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతోంది.
http://museumsofindia.gov.in వెబ్-సైట్ ద్వారా ఆన్-లైన్ లో వీక్షించడానికి వీలుగా, 30.06.2021 తేదీ నాటికి, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ మ్యూజియంలు, గ్యాలరీలలో అందుబాటులో ఉన్న కళాఖండాల సంఖ్య క్రింద ఇవ్వబడింది:
ప్రదర్శనశాల
పేరు
|
ఆన్-లైన్ లో అందుబాటులో ఉన్న కళాఖండాల సంఖ్య
|
నేషనల్ మ్యూజియం,
న్యూఢిల్లీ
|
80997
|
ఇండియన్ మ్యూజియం,
కోల్కతా
|
46326
|
విక్టోరియా మెమోరియల్ హాల్,
కోల్కతా
|
26611
|
సాలార్ జంగ్ మ్యూజియం,
హైదరాబాద్
|
47504
|
అలాహాబాద్ మ్యూజియం,
ప్రయాగ్ రాజ్
|
61642
|
నేషనల్ గ్యాలరీ అఫ్ మోడరన్ ఆర్ట్, న్యూఢిల్లీ
|
12902
|
నేషనల్ గ్యాలరీ అఫ్ మోడరన్ ఆర్ట్, ముంబాయి
|
1460
|
నేషనల్ గ్యాలరీ అఫ్ మోడరన్ ఆర్ట్, బెంగళూరు
|
534
|
ఏ.ఎస్.ఐ. గోవా మ్యూజియం
|
701
|
ఏ.ఎస్.ఐ.,
నాగార్జున కొండ మ్యూజియం
|
8450
|
మొత్తం
|
287127
|
ఈ సమాచారాన్ని సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ఈ రోజు లోక్‌సభకు సమర్పించిన లిఖితపూర్వక సమాధానంలో పొందుపరిచారు.
సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖల మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ఈ రోజు లోక్-సభకు అందజేసిన లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని పొందుపరిచారు.
*****
(Release ID: 1736995)
Visitor Counter : 110