జల శక్తి మంత్రిత్వ శాఖ

కర్ణాటకలో జలజీవన్ మిషన్ ప్రగతిపై కేంద్రంతో ఉమ్మడి సమీక్ష!


భేటీలో పాలుపంచుకున్న కేంద్ర జలశక్తి మంత్రి,
కర్ణాటక ముఖ్యమంత్రి.

పనులను వేగవంతం చేసేందుకు
చర్యలు తీసుకుంటామన్న కర్ణాటక సి.ఎం.

‘ప్రతి ఇంటికీ నీరు’ అనే లక్ష్యాన్ని
2023లోగా సాధిస్తామని హామీ

Posted On: 13 JUL 2021 3:58PM by PIB Hyderabad

  కర్ణాటక రాష్ట్రంలో జలజీవన్ మిషన్ కార్యక్రమం అమలుపై ఈ రోజు బెంగళూరులోని విధాన సౌధలో జరిగిన ఉమ్మడి సమీక్షా సమావేశంలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కర్ణాటక ముఖ్యమంత్రి బి.ఎస్. యడ్యూరప్ప పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి మాట్లాడుతూ, కర్ణాటకలోని మిగిలిన 61.05 లక్షల ఇళ్లకు 2023నాటికల్లా కుళాయిల ద్వారా మంచినీటిని అందించేలా జలజీవన్ మిషన్ పనులను వేగవంతం చేసేందుకు తగిన చర్యలన్నీ తీసుకుంటామని కేంద్రమంత్రికి హామీ ఇచ్చారు. జలజీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా ‘ప్రతి ఇంటికీ నీటి సరఫరా’ అన్న లక్ష్యాన్ని సాధించేందుకు రాష్ట్రానికి అవసరమైన  పూర్తిస్థాయి మద్దతును కేంద్రం అందిస్తుందని జలశక్తి మంత్రి కర్ణాటక ముఖ్యమంత్రికి భరోసా ఇచ్చారు. 2024వ సంవత్సరానికల్లా దేశంలోని ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నీటిని కుళాయిల ద్వారా అందించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా జలజీవన్ మిషన్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.

https://ci5.googleusercontent.com/proxy/A-Ajb8TsfsqpU_k-VSq0RDjAFAtLDpu5qNp7345ncIEU7cT1ED6DJC2Wm82D2brBns4x7XkKWdfJWimk27cI5CnvtTC8-WcWH4NfAQnvH76z5ojZHAD4dI_Vaw=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00195GC.jpghttps://ci3.googleusercontent.com/proxy/6-KfgvuJKSkVd6FLxEy04lblXevA1joAZtocQvTqnpqI8ZyPzNdcs5OSoRzASy5MPmBx820kB5knCTTpMNhG6vWsRqdlU51lTPYjoRHlpxoywtOuxJ55nPVjdw=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002EGXV.jpg

  గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన, నాణ్యమైన తాగునీటిని తగిన పరిమాణంలో క్రమం తప్పకుండా, దీర్ఘకాలిక ప్రాతిపదికపై అందించేందుకు సంబంధించిన జలజీవన్ మిషన్ కార్యక్రమంపై ముఖ్యమంత్రి నాయకత్వంలో నెలవారీ సమీక్షా సమావేశాలను కర్ణాటక ప్రభుత్వం నిర్వహించబోతోంది. ఈ నాటి ఉమ్మడి సమీక్షా సమావేశం సందర్భంగా జాతీయ జలజీవన్ కార్యక్రమం మిషన్ డైరెక్టర్, అదనపు కార్యదర్శి భరత్ లాల్ మాట్లాడుతూ, కర్ణాటక రాష్ట్రంలో పథకం అమలు, ప్రణాళికను ప్రధానంగా ప్రస్తావిస్తూ కార్యక్రమ వివరాలను సమర్పించారు. ఆ తర్వాత కర్ణాటక ప్రభుత్వానికి చెందిన ప్రిన్సిపల్ కార్యదర్శి, ఇతర సీనియర్ అధికారులతో భరత్ లాల్ సమీక్షా సమావేశం నిర్వహించారు. కర్ణాటకలో జలజీవన్ మిషన్ పనులను వేగవంతం చేసే అంశంపై ఈ సమావేశంలో చర్చించారు.

https://ci6.googleusercontent.com/proxy/aIw5ADTG_zPgCqGrh1xd27Pgo72x2QG2GhaQkeIJ6t9imy3ijpf5XhmNsKnIq0Nm9JqZqjPC8hHd_Slr1P1NK4aFcL8nDXwVjxBprA81wwfVe5nR60t6d6_7Kg=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003W5ZT.jpg

  జలజీవన్ మిషన్ ప్రారంభించే సమయానికి, కర్ణాటకలోని 91.19 లక్షల ఇళ్లకు గానూ 24.51లక్షల ఇళ్లకు (అంటే 26.88లక్షల ఇళ్లకు) మాత్రమే మంచి నీటి కుళాయిల కనెక్షన్లు ఉన్నాయి. ఇక, గత 22 నెలల కాలంలో 5.62 లక్షల ఇళ్లకు మంచినీటి కుళాయిల కనెక్షన్లు అందించారు. ఫలితంగా ఇపుడు కర్ణాటక రాష్ట్రంలోని గ్రామాల్లో 30.14లక్షల ఇళ్లకు (అంటే 33.05శాతం ఇళ్లకు) నీటి కనెక్షన్లు అందుబాటులో ఉన్నాయి.

  2023వ సంవత్సరం లోగా కర్ణాటకలో  ‘ప్రత ఇంటికీ నీటి సరఫరాl’  అన్న లక్ష్యాన్ని సాధించేందుకు కర్ణాటక ప్రభుత్వం ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంది. 2021-22వ సంవత్సరంలో 25.17లక్షల ఇళ్లకు, 2022-23లో 17.93 లక్షల ఇళ్లకు, 2023-24లో మిగిలిన 19.93 లక్షల ఇళ్లకు మంచి నీటి కుళాయల కనెక్షన్లు అందించాలని కర్ణాటక ప్రభుత్వం లక్ష్యాలను నిర్దేశించుకుంది.

  ప్రతి ఇంటికీ పరిశుద్ధమైన తాగునీటిని అందించాలన్న కర్ణాటక ప్రభుత్వం దృఢదీక్షను దృష్టిలో పెట్టుకుని జలజీవన్ మిషన్ పనులకోసం కేంద్ర ప్రభుత్వ గ్రాంటుగా రూ. 5,008.79 కోట్ల మొత్తానికి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆమోదం తెలిపారు. గత సంవత్సరం అందించిన కేంద్ర కేటాయింపునకు తాజా మొత్తం నాలుగు రెట్లుగా చెప్పవచ్చు. పెరిగిన కేంద్రప్రభుత్వ కేటాయింపు, మిగిలిన ప్రారంభ మొత్తం రూ. 177.16కోట్లు, రాష్ట్రప్రభుత్వ వాటా సొమ్ము రూ. 5,215.93కోట్లు కలిపితే మొత్తం రూ. 10,401.88కోట్లు అవుతుంది. జలజీవన్ మిషన్ కింద 2021-22లో గ్రామీణ నీటి సరఫరా పనులు చేపట్టడానికి ఈ మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి అందుబాటులో ఉంటుంది. అంటే, పథకం పనులను వేగవంతం చేయడానికి తగినంత మొత్తం అందుబాటులో ఉంటుందన్నమాట.

https://ci5.googleusercontent.com/proxy/4YP2ORp4E6tJjs_GRt7vu-a45qjI0TwN7v9K2Eouh8fjcu5078YVAwb6x1s7b4VKQdqMQORXfrKzHpC8Io1cF63iAQ4cvJhE9L06XG3PNljluJB5jqFs5efwLA=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004O0CU.pngకర్ణాటక ప్రభుత్వానికి 2021-22లో 15వ ఆర్థిక సంఘం గ్రాంటుగా రూ. 1,426కోట్ల మొత్తం కేటాయింపు జరిగింది. గ్రామీణ స్థానిక పరిపాలనా సంస్థలు, పంచాయతీ రాజ్ సంస్థల పరిధిలో నీటి సరఫరా, పారిశుద్ధ్యం పనులకు గాను 15వ ఆర్థిక సంఘం గ్రాంటుతో ముడివడిన మొత్తంగా ఈ సొమ్మును కేటాయించారు. అలాగే, రాబోయే ఐదేళ్ల కాలానికి అంటే 2025-26వరకూ రూ. 7,534 కోట్ల నిధులు అందించేందుకు హామీ కూడా రాష్ట్రానికి లభించింది. కర్ణాటక రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంత భారీ స్థాయి పెట్టుబడితో ఆ రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకునే అవకాశాలు ఉన్నాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయ్యేందుకు, గ్రామాల్లో కొత్తగా ఉపాధి అవకాశాలు పెరిగేందుకు కూడా అవకాశాలు ఉన్నాయి.

   ఇక, పాఠశాలలు, ఆశ్రమ శాలలు, అంగన్ వాడీ కేంద్రాలకు కుళాయిల ద్వారా నీటి సరఫరా ఏర్పాటులో కర్ణాటక ప్రభుత్వం మంచి పనితీరు కనబర్చింది. ప్రస్తుతం రాష్ట్రంలోని 41,636 పాఠశాలలకు (అంటే 99శాతం), 51,563 అంగన్ వాడీ కేంద్రాలకు (95శాతం) కుళాయిల ద్వారా తాగునీటి సరఫరా ఏర్పాటు చేశారు. పాఠశాలలు, అంగన్ వాడీలకు నీటి సరఫరాకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వం చూపిన పనితీరును కేంద్రమంత్రి అభినందించారు. మిగిలిన స్కూళ్లు, అంగన్ వాడీ కేంద్రాలకు కూడా తాగునీటిని అందించి సాధ్యమైనంత త్వరగా వందశాతం ఫలితాల సాధనకు కృషి చేయాలని రాష్ట్రానికి సూచించారు. చిన్నారులకు మెరుగైన ఆరోగ్యం, మెరుగైన పారిశుద్ధ్యం లక్ష్యంగా ఈ పనులు పూర్తి చేయాలన్నారు.

   ఇక, నీటి ఎద్దడి ప్రాంతాలు, నీటి నాణ్యత లోపించిన ప్రాంతాలు, ఆశావహ జిల్లాలు, ఎస్.సి., ఎస్.టి. జనాభా ప్రాబల్యం కలిగిన ప్రాంతాలు, సంసద్ ఆదర్శ గ్రామ యోజన (ఎస్.ఎ.జి.వై.) పరిధిలోకి వచ్చే గ్రామాల్లో ప్రాధాన్యతా ప్రాతిపదికపై ఇంటింటికీ నీటి కుళాయిలు అమర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది.

   ఇక, నీటి నాణ్యతపై పర్యవేక్షణ, నిఘా కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. ఇందుకోసం అంగన్ వాడీ, ఆశా కార్యకర్తలు, స్వయం సహాయక బృందాల సభ్యులు, పంచాయతీ రాజ్ సంస్థల సభ్యులు, పాఠశాలల ఉపాధ్యాయులు తదితరులకు శిక్షణ అందిస్తున్నారు. క్షేత్రస్థాయి పరీక్షా కిట్లు (ఎఫ్.టి.కె.లు) వినియోగించి నీటి నమూనాలను పరీక్షించి నాణ్యతను నిర్ధారించే విధంగా వారికి ఈ శిక్షణ ఇస్తున్నారు. నీటి నాణ్యతా పరీక్షలకు సంబంధించి రాష్ట్రంలోని 78 లేబరేటరీల్లో ఒక పరిశోధనా శాలకు మాత్రమే ఎన్.ఎ.బి.ఎల్. గుర్తింపు ఉంది. మిగతా లేబరేటరీల స్థాయిని కూడా నవీకరించి, ఎన్.ఎ.బి.ఎల్. గుర్తింపు సాధించేందుకు రాష్ట్రప్రభుత్వం కృషి చేయాల్సి ఉంది. నాణ్యతా నిర్ధారణకోసం ప్రజలు తాము తీసుకువచ్చిన నీటి నమూనాలను తామే స్వేచ్ఛగా పరీక్షించుకునేలా ఈ లెబరేటరీలను వారికి అందుబాటులో ఉంచవలసిన అవసరం ఉంది.

   జలజీవన్ మిషన్ అనేది అట్టడుగు స్థాయి సంస్థలకు, ప్రజలకు ప్రాధాన్యం ఇచ్చే కార్యక్రమం. ఇందులో ప్రణాళిక స్థాయినుంచి, అమలు, నిర్వహణ, పర్యవేక్షణ వంటి అంశాల వరకూ ప్రజా సమూహానికి కీలకపాత్ర ఉంటుంది. ఈ లక్ష్యసాధనకు వచ్చే ఐదేళ్లకోసం గ్రామ స్థాయి నీటి సరఫరా, పారిశుద్ధ్య కమిటీలను (వి.డబ్ల్యు.ఎస్.సి.లను), పానీ సమితులను బలోపేతం చేయడం, గ్రామ స్థాయి కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం వంటి చర్యలను చేపట్టవలసి ఉంటుంది. అలాగే, గ్రామ స్థాయికమిటీల నిర్వహణలో రాష్ట్ర స్థాయి అమలు సంస్థలకు (ఐ.ఎస్.ఎ.లకు) ప్రమేయం కల్పించడం, ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టడం అవసరం.

  ఇప్పటివరకూ కర్ణాటకలో 28,883 గ్రామాలకు గాను, 22,203 గ్రామస్థాయి నీటిసరఫరా, పారిశుద్ధ్య కమిటీలు లేదా పానీ సమితులు, 19,446 గ్రామ స్థాయి కార్యాచరణ ప్రణాళికలు మాత్రమే సిద్ధమయ్యాయి. పథకం అమలుకోసం 2021-22లో 30రాష్ట్ర స్థాయి అమలు ఏజెన్సీలకు ప్రమేయం కల్పించాలని కర్ణాటక ప్రభుత్వం సంకల్పించింది. ప్రతి ఇంటికీ నీటి సరఫరా లక్ష్య సాధనకోసం నీటి సరఫరా మౌలిక వ్యవస్థల దీర్ఘకాల సుస్థిర నిర్వహణ, పర్యవేక్షణకోసం కర్ణాటక ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని దాదాపు 2లక్షలమందికి శిక్షణ ఇవ్వాల్సి ఉంది.

   2019సంవత్సరం ఆగస్టు 15వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన జలజీవన్ మిషన్ కార్యక్రమం దేశన్యాప్తంగా వేగంగానే అమలవుతోంది. 2019లో ఈ పథకం ప్రారంభించేటప్పటికీ, దేశంలోని 19.20కోట్ల గ్రామీణ ఇళ్లకుగాను, కేవలం 3.23కోట్ల ఇళ్లకు (అంటే 17శాతం ఇళ్లకు మాత్రమే) మంచినీటి కుళాయిల కనెక్షన్లు ఉన్నాయి. గత 22 నెలల్లో కోవిడ్ వైరస్ మహమ్మారి సంక్షోభం, లాక్ డౌన్ ఆంక్షలు ఎదురైనప్పటికీ 4.47కోట్ల మేర ఇళ్లకు తాగునీటి కనెక్షన్లు ఏర్పాటు చేయగలిగారు. దీనితో తాగునీటి కనెక్షన్ల కవరేజీ 23.63శాతానికి పెరిగింది. గోవా, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులు, పుదుచ్చేరి ప్రాంతాల్లోని గ్రామీణ ఇళ్లకు ఇప్పటికే వందశాతం నీటి కనెక్షన్లు ఏర్పాటయ్యాయి.  ఆయా ప్రాంతాల్లో ‘ప్రతి ఇంటికీ మంచినీరు’ అన్న కల సాకారమైంది. ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ అన్న నినాదం స్ఫూర్తిగా గ్రామాల్లో  ప్రతి ఇంటికీ తాగునీటి కనెక్షన్లు అందించాలన్న లక్ష్యంతో జలజీవన్ మిషన్ అమలు జరుగుతోంది. ఇప్పటికే 71 జిల్లాలు, 99వేలకు పైగా గ్రామాల్లో ప్రతి ఇంటికీ తాగునీటి కుళాయిలు ఏర్పాటయ్యాయి.

 

***


(Release ID: 1735241) Visitor Counter : 172