భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ

పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షపాతం కురిసే అవకాశం

Posted On: 11 JUL 2021 4:27PM by PIB Hyderabad

భారత వాతావరణ విభాగం(ఐఎండీ) అందించిన వాతావరణ సమాచారం ప్రకారం కొంకణ్ మరియు గోవా ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షపాతం కురిసే అవకాశం ఉంది.

హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హరియాణ, చండీగఢ్, ఢిల్లీ, గుజరాత్, మధ్య మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాలతోపాటు యానమ్, తెలంగాణ, కర్ణాటక దక్షిణ తీరప్రాంతాలు, కేరళ, మాహె, తమిళనాడు, పుదుచ్ఛేరి, కరైకాల్ తదితర ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షపాతం కురిసే అవకాశం ఉంది.

జమ్మూకశ్మీర్, లడఖ్, గిల్గిత్-బాల్టిస్తాన్, ముజఫరాబాద్, పశ్చిమ ఉత్తర ప్రదేశ్, తూర్పు రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్, బిహార్, ఉప హిమాలయన్, పశ్చిమ బెంగాల్ ,సిక్కిం, ఒడిశా, అండమాన్, నికోబార్ దీవుల్లోని పలు ప్రదేశాలతోపాటు సౌరాష్ట్ర, కచ్, మరాఠ్వాడ, రాయలసీమ, ఉత్తర కర్ణాటక, లక్షదీవుల్లోనూ భారీ వర్షపాతం కురుస్తుందని వాతావరణ విభాగం బులెటిన్ సూచించింది.

పంజాబ్, హరియాణ, చండీగఢ్, ఢిల్లీ, అండమాన్, నికోబార్ దీవులు, తెలంగాణతోపాటు జమ్ముకశ్మీర్, లడఖ్, గిల్గిట్‌‌–బాల్టిస్తాన్, ముజఫరాబాద్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, విదర్భ, బిహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, సిక్కిం, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, మధ్యమహారాష్ట్ర, మరాఠ్వాడా, ఆంధ్రప్రదేశ్ లోని తీరప్రాంతాలు, యానాం, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్ఛేరి, కరైకాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం కురుస్తుందని, గాలుల వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లుగా నమోదవుతుందని వాతావరణ విభాగం పేర్కొంది.
 
పశ్చిమ రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో వేడిగాలులు వీస్తాయని, గంటకు 45–55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో వేడిగాలులు వీస్తాయని వాతావరణ విభాగం తెలిపింది. అరేబియా సముద్రంలో పశ్చిమ కేంద్ర, నైరుతి ప్రాంతంతోపాటు తూర్పు కేంద్ర, ఈశాన్య ప్రాంతంలోనూ వేడిగాలు ప్రభావం ఉంటుందని వాతావరణ విభాగం తెలిపింది. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ తీరాలతోపాటు లక్షద్వీప్తోపాటు బంగాళాఖాతంలోని పశ్చిమ కేంద్ర, దక్షిణ ప్రాంతాలు, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ తీర ప్రాంతాలు, మన్నార్ గల్ఫ్, అండమాన్ సముద్రంలోనూ ప్రభావం ఉంటుందని వాతవరణ విభాగం తెలిపింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులెవరూ  ఈ ప్రాంతాల్లోకి వెళ్లవద్దని వాతావరణ విభాగం సూచించింది. 

 

****

 


(Release ID: 1734683) Visitor Counter : 182