ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 వాక్సినేష‌న్ అప్‌డేట్‌


రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు ఇప్ప‌టివ‌ర‌కు 38.60 కోట్ల వాక్సిన్ డోస్‌లు స‌ర‌ఫ‌రా చేయ‌డం జ‌రిగింది.

రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాలు, ప్రైవేటు ఆస్ప‌త్రుల వ‌ద్ద ఇప్ప‌టివ‌ర‌కు 1.44 కోట్ల మిగులు, వాక్సిన్ డొస్ లు వాడ‌కానికి అందుబాటులో ఉన్నాయి.

Posted On: 11 JUL 2021 10:25AM by PIB Hyderabad

కేంద్ర ప్ర‌భుత్వం దేశ వ్యాప్తంగా కోవిడ్ -19 వాక్సిన్ కార్య‌క్ర‌మాన్ని వేగవంతం చేసేందుకు క‌ట్టుబ‌డి ఉంది.   కోవిడ్ -19 సార్వ‌త్రిక వాక్సినేష‌న్‌కు సంబంధించిన కొత్త ద‌శ‌2021 జూన్ 21 నుంచి ప్రారంభ‌మైంది. మ‌రిన్ని వాక్స‌న్‌లు అందుబాటులోకి తీసుకురావ‌డం ద్వారా వాక్సినేష‌న్‌ను వేగ‌వంతం చేశారు. మ‌రింత మెరుగైన ప్ర‌ణాళిక ద్వారా వాక్సిన్ అందుబాటుకు సంబంధించిన ముంద‌స్తు స‌మాచారం అందించ‌డంతోపాటు, వాక్సిన్ అందుబాటును రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు పెంచ‌డం జ‌రిగింది.

దేశ వ్యాప్త వాక్సినేష‌న్ కార్య‌క్ర‌మంలొ భాగంగా, భార‌త ప్ర‌భుత్వం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు కోవిడ్ వాక్సిన్‌ల‌ను ఉచితంగా స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ది. కోవిడ్ -19 వాక్సినేష‌న్ నూత‌న ద‌శ‌లో  కేంద్ర ప్ర‌భుత్వం , వాక్సిన్ ఉత్ప‌త్తిదారులు ఉత్ప‌త్తి చేసే వాక్సిన్‌లో 75 శాతం వాక్సిన్‌ను సేక‌రించి దానిని ఉచితంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు స‌ర‌ఫ‌రా చేస్తుంది.
ఇప్ప‌టివ‌ర‌కూ 38.60 కోట్ల (38,60,51,110) వాక్సిన్ డొస్‌ల‌ను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు పంపిణీ చేయ‌డం జ‌రిగింది. మ‌రో 11,25,140 డోస్‌లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి.

ఇందులో వృధా అయిన వాక్సిన్ తో క‌లిపి 37,16,47,625 డోస్‌లు ( ఈ రోజు ఉద‌యం 8 గంట‌ల వ‌ర‌కు అందుబాటులో ఉన్న స‌మాచారం ప్రకారం) వాడారు.
1.44 కోట్ల‌కు పైగా (1,44,03,485) మిగులు వాక్సిన్ డోస్‌లు ఉన్నాయి. ఈ మిగులు వాక్సిన్ డోస్‌లు కేంద్ర , రాష్ట్ర ప్ర‌భుత్వాలు, ప్రైవేటు ఆస్ప‌త్రుల వ‌ద్ద  వాడ‌కం కోసం ఉన్నాయి.



 

****


(Release ID: 1734630) Visitor Counter : 176