సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
సాంస్కృతిక శాఖ కేంద్ర సలహా మండలి సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర సాంస్కృతిక మంత్రి
Posted On:
23 JUN 2021 7:51PM by PIB Hyderabad
కేంద్రా సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ నేడు ఢిల్లీలోని గాంధీ స్మృతిలో (రాజ్‌ఘాట్) జరిగిన కేంద్ర సలహా మండలి (సీఏబీసీ) సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి మండలి సభ్యులు కొందరు హైబ్రిడ్ విధానంలో పాల్గొన్నారు. కొందరు సభ్యులు ఈ సమావేశానికి వ్యక్తిగతంగా హాజరు అయ్యారు. మరికొందరు వర్చువల్ విధానంలో ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సమావేశంలో భాగంగా ముందుగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన, కొనసాగుతున్న వివిధ కార్యకలాపాలను గురించి, భారతదేశ స్వాతంత్య్ర 75 ఏండ్ల వేడుక “ఆజాది కా అమృత్ మహోత్సవ్” నిర్వహణను గురించి చర్చలు జరిపారు. సీఏబీసీ బోర్డు సభ్యులు వివిధ కార్యకలాపాలను గురించి తెలుసుకున్నారు. ఈ విషయంలో.. వారి తమ విలువైన సలహాలను పంచుకున్నారు. ఈ సమావేశం సందర్భంగా, కళలు, సంగ్రహాలయాలు, సాంస్కృతిక ప్రదేశాలు, వివిధ రకాల అకాడమీలకు చెందిన కార్యకలాపాలు, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నిధులు సమకూర్చే జ్ఞాన సంస్థల వంటి విషయాలను గురించి.. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ చేపట్టిన వివిధ రకాల కార్యకలాపాల గురించి సమగ్రంగానూ చర్చలు జరిపారు. ఈ సమావేశంలో భాగంగా.. ఇటీవలి సంవత్సరాలలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేపట్టిన వివిధ రకాల కార్యకలాపాలపై వివరణాత్మక ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. చర్చ సందర్భంగా సభ్యులు.. కేంద్ర సాంస్కృతిక శాఖ వివిధ రకాల కార్యక్రమాలలో పాలుపంచుకోవాలని, రూపొందించాలని, భారత సమాజంలోని వివిధ స్థాయిలలో సృజనాత్మకతపై దృష్టి పెట్టడానికి తోడు ప్రస్తుత ప్రాంతీయ కార్యక్రమాల ద్వారా నిర్లక్ష్యం చేయబడిన, జనజీవనంలో నిలబడలేని విధంగా ఉన్న వివిధ ప్రాంతాలలో సృజనాత్మకతపై దృష్టి పెట్టడానికి ప్రస్తుత విధాన కార్యక్రమాలను ముమ్మరం చేయాలని కూడా సలహా ఇవ్వడం జరిగింది. కళాకారుల పని మరియు జీవన పరిస్థితులను చక్కదిద్దడానికి సంక్షేమ చర్యలు తీసుకోవడంలో కళాకారుల కేంద్రీకృత విధానాన్ని చాలా దగ్గరగా పర్యవేక్షించాలని సభ్యులు సిఫారసు చేశారు. సాంస్కృతిక మంత్రి సూచనలను స్వాగతించారు. భారతదేశం యొక్క గొప్ప సంస్కృతి మరియు వారసత్వాన్ని ప్రోత్సహించడం, అభివృద్ధి చేయడం మరియు పరిరక్షించడం కోసం తగిన చర్యలు చేపడతామని సభ్యులకు కేంద్ర మంత్రిత్వ శాఖ హామీ ఇచ్చింది. ముఖ్యంగా ఇప్పటి వరకు నిర్లక్ష్యానికి చేయబడిన మన వారసత్వ కళలను నిలబెట్టేందుకు గాను తగిన చర్యలు చేపడుతామని హామీ ఇచ్చింది. ఈ సమావేశంలో సీఏబీసీ సభ్యులు డాక్టర్ అనుపమ హోస్కెరే, ప్రొఫెసర్ చందన్ కుమార్, డాక్టర్ చంద్ర ప్రకాష్, శ్రీ చేతన్ జోషి, శ్రీ రవీంద్ర బాజ్పాయ్, శ్రీ దేవేంద్ర శర్మ, వెన్ లామా చోస్పెల్ జోట్పా, శ్రీమతి మంజు బోరా, డాక్టర్ విక్రమ్ సంపత్, ప్రొఫెసర్ డాక్టర్ అచింత్యా బిస్వాస్, ప్రొఫెసర్ మిచెల్ డానినో, శ్రీ ఎస్. ఎన్. సేతురామ్, డాక్టర్ సరోజ్ రాణి, శ్రీ సహమ్షేర్ సింగ్ మన్హాస్, డాక్టర్ బి. ఆర్ మణి మరియు ప్రొఫెసర్ బసంత్ షిండే తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కేంద్ర సాంస్కృతిక కార్యదర్శి, కమిటీ మెంబర్ కన్వీనర్ శ్రీ రాఘవేంద్ర సింగ్‌తో పాటుగా.. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.
***
(Release ID: 1729906)
Visitor Counter : 237