జల శక్తి మంత్రిత్వ శాఖ

"నమామి గంగే" కార్యక్రమం కింద పశ్చిమ బెంగాల్‌లోని మహేస్థలలో 35 ఎంఎల్‌డీ మురుగునీటి శుద్ధి ప్లాంట్ల అభివృద్ధికి ఒప్పందం

Posted On: 17 JUN 2021 7:53PM by PIB Hyderabad

'నేషనల్‌ మిషన్‌ ఫర్‌ క్లీన్‌ గంగ' (ఎన్‌ఎంసీజీ), 'కోల్‌కతా మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ' (కేఎండీఏ), 'మహేస్థల వేస్ట్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌' (విశ్వరాజ్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సృష్టించిన ఎస్‌పీవీ) మధ్య త్రైపాక్షిక రాయితీ ఒప్పందం కుదిరింది. మహేస్థలలో పీపీపీ పద్ధతిలో 35 ఎంఎల్‌డీ మురుగునీటి శుద్ధి ప్లాంట్ల అభివృద్ధి కోసం ఈ ఒప్పందం కుదిరింది. ఈ కాంట్రాక్టు విలువ 273.52 కోట్ల రూపాయలు. ఎన్‌ఎంసీజీ డైరెక్టర్‌ జనరల్‌ శ్రీ రాజీవ్‌ రంజన్‌ మిశ్రా, ఎన్‌ఎంసీజీ ప్రాజెక్స్ట్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శ్రీ అశోక్‌ కుమార్‌ సింగ్‌ ఒప్పంద కార్యక్రమంలో పాల్గొన్నారు. కేఎండీఏ ప్రతినిధులు, సంబంధిత వ్యక్తులు కూడా పాల్గొన్నారు.

    మహేస్థలలో ప్రస్తుతమున్న మురుగునీటి సమస్యలను పరిష్కరించడం, గంగానదిలో మురుగునీటి కాలుష్యం కలవకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ ప్రాజెక్టు అమలు ద్వారా, శుద్ధి చేయని మురుగునీరు పట్టణం నుంచి విడుదల కాదు. తద్వారా గంగానదిలో కాలుష్యం తగ్గుతుంది.

    గంగానది తూర్పు ఒడ్డున మహేస్థల ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 4,49,423 జనాభా ఉంది. ఈ ప్రాజెక్టు ప్రధానాంశాలు క్రింది విధంగా ఉన్నాయి:

• ఎస్‌టీపీ - 35 ఎంఎల్‌డీ

• పంపింగ్ స్టేషన్లు - 4 

• ఎంపీఎస్‌ - 35 ఎంఎల్‌డీ - 1

• మళ్లింపు నిర్మాణాలు - 6

• రైజింగ్ మెయిన్స్ ఏర్పాటు - 5989

• మురుగునీటి శుద్ధి, నిల్వ - 1145 మీ.

• ఈపీఎస్‌ - 35 ఎంఎల్‌డీ

• 15 సంవత్సరాల పాటు నిర్వహణ
 

******



(Release ID: 1728057) Visitor Counter : 168


Read this release in: English , Urdu , Hindi