రైల్వే మంత్రిత్వ శాఖ
30,455 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ను.. ఆక్సిజన్ ఎక్స్ప్రెస్లు దేశానికి అందించాయి.
16000 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ను దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రాంతాలకు ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ల ద్వారా పంపడం జరిగింది.
424 ఆక్సిజన్ ఎక్స్ప్రెస్లు దేశవ్యాప్తంగా ఆక్సిజన్ డెలివరీని పూర్తిచేశాయి
ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు ఇప్పటివరకు 1748 ట్యాంకర్ల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ను రవాణా చేశాయి. 15 రాష్ట్రాలకు ఉపశమనం కలిగించాయి
ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు 5000 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ను తమిళనాడులోని వివిధ ప్రాంతాలకు చేరవేశాయి.
Posted On:
14 JUN 2021 7:58PM by PIB Hyderabad
మహారాష్ట్రకు 614 మెట్రిక్ టన్నులు, ఉత్తర ప్రదేశ్‌కు దాదాపు 3,797 మెట్రిక్ టన్నులు, మధ్యప్రదేశ్‌కు 656 మెట్రిక్ టన్నులు, ఢిల్లీకు 5,722 మెట్రిక్ టన్నులు, హరియానాకు 2,354 మెట్రిక్ టన్నులు, రాజస్థాన్‌కు 98 మెట్రిక్ టన్నులు, కర్ణాటకకు 3,862 మెట్రిక్ టన్నులు, ఉత్తరాఖండ్‌కు 320 మెట్రిక్ టన్నులు, తమిళనాడుకు 5,054 మెట్రిక్ టన్నులు, ఆంధ్రప్రదేశ్‌కు 3,744 మెట్రిక్ టన్నులు, పంజాబ్‌కు 225 మెట్రిక్ టన్నులు, కేరళకు 513 మెట్రిక్ టన్నులు, తెలంగాణకు 2,972 మెట్రిక్ టన్నులు, జార్ఖండ్‌కు 38 మెట్రిక్ టన్నులు, అసోంకు 480 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను చేరవేశాయి.
పోస్ట్ చేసిన తేదీ: 14 జూన్, 2021 పీఐబీ, ఢిల్లీ
అన్ని అడ్డంకులను అధిగమిస్తూ.. నూతన పరిష్కారమార్గాలను కనుగొంటూ.. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ను చేరవేడం ద్వారా ఆయా రాష్ట్రాలకు ఉపశమనం కల్పిస్తూ భారతీయ రైల్వే తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.
దేశసేవలో భాగంగా ఆక్సిజన్ ఎక్స్ప్రెస్లు లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ రవాణాలో 30000 మెట్రిక్ టన్నుల మైలురాయిని అధిగమించాయి.
భారత రైల్వే ఇప్పటివరకు1748 కి పైగా ట్యాంకర్లలో దాదాపు 30,455 మెట్రిక్ టన్నుల ఎల్‌ఎంఓను దేశంలోని వివిధ రాష్ట్రాలకు చేరవేసింది.
424 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు ఇప్పటివరకు తమ ప్రయాణాన్ని పూర్తి చేసి వివిధ రాష్ట్రాలకు ఉపశమనం కలిగించడం గమనార్హం..
ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు దేశంలోని దక్షిణాది రాష్ట్రాలకు 16000 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్‌ఎంఓ) ను చేరవేశాయి.
ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు వరుసగా 3,700, 3,800, 5,000 మెట్రిక్ టన్నుల ఎల్‌ఎంఓలను రవాణా చేశాయి.
తాజాగా మరో 4 లోడ్ చేసిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు 20 ట్యాంకర్లలో 362 మెట్రిక్ టన్నుల ఎల్‌ఎమ్‌ఓతో గమ్యంవైపు ప్రయాణిస్తున్నాయి.
ఈ ఏడాది ఏప్రిల్ 24న మహారాష్ట్రకు 126 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ను చేరవేయడంతో ఆక్సిజన్ ఎక్స్ప్రెస్లు తమ ప్రయణాన్ని ప్రారంభించాయి.
అభ్యర్థించే రాష్ట్రాలకు సాధ్యమైనంత తక్కువ సమయంలో సాధ్యమైనంత ఎల్‌ఎంఓను అందించడానికి భారత రైల్వే ప్రయత్నం చేస్తోంది.
ఉత్తరాఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, హరియానా, తెలంగాణ, పంజాబ్, కేరళ, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్, అసోం రాష్ట్రాలకు ఆక్సిజన్ను చేరవేయడం ద్వారా ఆక్సిజన్ ఎక్స్ప్రెస్లు పై15 రాష్ట్రాలకు ఉపశమనం కలిగించాయి.
ఇప్పటిదాకా మహారాష్ట్రకు 614 మెట్రిక్ టన్నులు, ఉత్తర ప్రదేశ్‌కు దాదాపు 3,797 మెట్రిక్ టన్నులు, మధ్యప్రదేశ్‌కు 656 మెట్రిక్ టన్నులు, ఢిల్లీకు 5,722 మెట్రిక్ టన్నులు, హరియానాకు 2,354 మెట్రిక్ టన్నులు, రాజస్థాన్‌కు 98 మెట్రిక్ టన్నులు, కర్ణాటకకు 3,862 మెట్రిక్ టన్నులు, ఉత్తరాఖండ్‌కు 320 మెట్రిక్ టన్నులు, తమిళనాడుకు 5,054 మెట్రిక్ టన్నులు, ఆంధ్రప్రదేశ్‌కు 3,744 మెట్రిక్ టన్నులు, పంజాబ్‌కు 225 మెట్రిక్ టన్నులు, కేరళకు 513 మెట్రిక్ టన్నులు, తెలంగాణకు 2,972 మెట్రిక్ టన్నులు, జార్ఖండ్‌కు 38 మెట్రిక్ టన్నులు, అసోంకు 480 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ రైళ్లు చేరవేశాయి.
ఇప్పటివరకు దేశంలోని 15 రాష్ట్రాల్లోని 39 నగరాలు / పట్టణాల్లో ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు ప్రాణవాయువును చేరవేశాయి. అవి.. ఉత్తరప్రదేశ్లోని లక్నో, వారణాసి, కాన్పూర్, బరేలీ, గోరఖ్‌పూర్, ఆగ్రా.. మధ్యప్రదేశ్లో సాగర్, జబల్పూర్, కాట్ని, భోపాల్, మహారాష్ట్రలోని నాసిక్, నాగపూర్, పుణే, ముంబై, షోలాపూర్, తెలంగాణలో హైదరాబాద్, హర్యానాలోని ఫరీదాబాద్, గురుగ్రామ్, ఢిల్లీలోని కాంట్, ఓఖ్లా, రాజస్థాన్‌లో కోటా, కనక్‌పారా, కర్ణాటకలోని బెంగళూరు, ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్, ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, గుంటూరు, తాడిపత్రి, విశాఖపట్నం, తమిళనాడులో చెన్నై, టుటికోరిన్, కోయంబత్తూర్, మదురై, పంజాబ్‌లోని భటిండా, ఫిల్లౌర్, అస్సాంలోని కమ్రప్ మరియు జార్ఖండ్‌లోని రాంచీ.
ఆక్సిజన్ సరఫరా స్థానాలతో భారతీయ రైల్వేలు వేర్వేరు మార్గాలను మ్యాప్ చేసింది. రాష్ట్రాలకు ఏవైనా అభివృద్ధి అవసరాలకు సేవలందించేందుకు రైల్వే సిద్ధంగా ఉంది. లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ను తీసుకురావడానికి రాష్ట్రాలు భారత రైల్వేకు ట్యాంకర్లను అందిస్తాయి.
క్లిష్ట సమయాన్ని అధిగమించేందుకు భారతీయ రైల్వే దేశంలోని హపా, బరోడా, ముంద్రా, తూర్పున రూర్కెలా, దుర్గాపూర్, టాటానగర్, అంగుల్ వంటి ప్రదేశాల నుండి ఆక్సిజన్ తీసుకొని.. దానిని ఉత్తరాఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పంపిణీ చేస్తోంది. రాజస్థాన్, తమిళనాడు, హర్యానా, తెలంగాణ, పంజాబ్, కేరళ, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, అసోం రాష్ట్రాలకు చేరవేస్తోంది.
ఆక్సిజన్ కొరత నుంచి ఉపశమనం కలిగించేందుకు, సాధ్యమైనంత త్వరగా గమ్యస్థానాలను చేరుకునేందుకు భారతీయ రైల్వే నూతన ప్రమాణాలను పాటించడం ద్వారా సరికొత్త బెంచ్మార్క్లను సృష్టిస్తోంది. ఈ క్లిష్టమైన సరుకు రవాణా.. రైళ్ల సగటు వేగం చాలా సందర్భాలలో 55 కన్నా ఎక్కువగా నమోదైంది. అధిక ప్రాధాన్యత కలిగిన గ్రీన్ కారిడార్‌లో.. సాధ్యమైనంత త్వరగా ఆక్సిజన్ను చేరవేసేందుకు రైల్వే సిబ్బంది రాత్రనకా పగలనకా ఓ సవాలుగా తీసుకొని శ్రమిస్తున్నారు. వివిధ విభాగాల్లోని సిబ్బంది విధుల మార్పు సమయాన్ని ఒక నిమిషానికి తగ్గించారు.
ఆక్సిజన్ రవాణాకు ఎటువంటి అంతరాయం కలగకుండా రైల్వే ట్రాక్లను నిరంతరం తెరిచే ఉంచేలా సిబ్బంది అప్రమత్తతను పాటించారు.
రైల్వే సిబ్బంది తీసుకున్న ఈ చర్యల ద్వారా ఇతర సరకు రవాణాకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగని రీతిలో ఇవన్నీ జరుగుతున్నాయి.
కొత్తగా ఆక్సిజన్ను నింపుకొని బయలుదేరే ప్రక్రియ కూడా సరళంగా ఏమీ ఉండదు. గణాంకాలు ఎప్పటికప్పుడు నవీకరించబడతాయి. ఆక్సిజన్ను నింపుకున్న మరిన్ని ఆక్సిజన్ ఎక్స్ప్రెస్లు తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తాయని ఆశిస్తున్నారు.
***
(Release ID: 1727122)
Visitor Counter : 145