రైల్వే మంత్రిత్వ శాఖ

దేశానికి 28000 మెట్రిక్ టన్నుల ఎల్‌ఎంఓని పంపిణీ చేసిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్


- దేశ వ్యాప్తంగాగా ఆక్సిజన్ స‌ర‌ఫ‌రా చేప‌ట్టిన 397 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు

- ఇప్పటి వరకు 1628 ట్యాంకర్ల ద్వారా ఎల్‌ఎంఓను రవాణా చేసి దాదాపుగా 15 రాష్ట్రాలకు ఉపశమనం క‌ల్పించిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు

- తమిళనాడులో 3900 మెట్రిక్ టన్నుల మేర లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను (ఎల్‌ఎంఓ) ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ ద్వారా అందించ‌బ‌డింది

- ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల‌లో వరుసగా 3100, 3400 మెట్రిక్ టన్నుల మేర ప్రాణ‌వాయువు చేరవేత‌

- మహారాష్ట్రలో 614 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ణు, ఉత్తర ప్రదేశ్‌లో దాదాపు 3797 మెట్రిక్ టన్నులు, మధ్యప్రదేశ్‌లో 656 మెట్రిక్ టన్నులు, ఢిల్లీలో 5722 మెట్రిక్ టన్నులు, హర్యానాలో 2354 మెట్రిక్ టన్నులు, రాజస్థాన్ రాష్ట్రంలో 98 మెట్రిక్ టన్నులు, కర్ణాటకలో 3450 మెట్రిక్ టన్నులు, ఉత్తరాఖండ్‌లో 320 మెట్రిక్ టన్నులు, 3972 మెట్రిక్ టన్నులు తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్‌లో 3130 మెట్రిక్ టన్నులు, పంజాబ్‌లో 225 మెట్రిక్ టన్నులు, కేరళలో 513 మెట్రిక్ టన్నులు, తెలంగాణలో 2765 మెట్రిక్ టన్నులు, జార్ఖండ్‌లో 38 ఎంటీ, అస్సాంలో 400 ఎంటీల ప్రాణ‌వాయువు ర‌వాణా

Posted On: 09 JUN 2021 6:43PM by PIB Hyderabad

కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి విస్త‌రిస్తున్న ప్రస్తుత స‌మ‌యంలో వివిధ అడ్డంకులను అధిగమించి కొత్త పరిష్కారాల్ని కనుగొంటూ.. భారతీయ రైల్వే దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను (ఎల్‌ఎంఓ) పంపిణీ చేస్తోంది. త‌ద్వారా ఉపశమనం కలిగించే ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. భార‌తీయ రైల్వేకు చెందిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు దేశ‌సేవలో భాగంగా 28000 మెట్రిక్ టన్నుల ఎల్‌ఎంఓ డెలివరీని చేర వేశాయి. ఇప్పటివరకు భారతీయ‌ రైల్వే 1628కి పైగా ట్యాంకర్లలో.. దాదాపు 28060 మెట్రిక్ టన్నుల ఎల్‌ఎంఓను దేశంలోని వివిధ రాష్ట్రాలకు పంపిణీ చేసింది. 397 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు ఇప్పటివరకు తమ ప్రయాణాన్ని పూర్తి చేసి వివిధ రాష్ట్రాలకు త‌గినన ఉపశమనాన్ని కలిగించాయని గమనించవచ్చు. ఈ ప‌త్రికా విడుద‌ల సమ‌యం వ‌ర‌కు 5 లోడ్ చేసిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు 24 ట్యాంకర్లలో 494 మెట్రిక్ టన్నుల ఎల్‌ఎమ్‌ఓతో నడుస్తున్నాయి.
3900 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్‌ఎంఓ) తమిళనాడులో ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ ద్వారా ఆఫ్‌లోడ్ చేయబడింది. ఆయా ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో వరుసగా 3100 మరియు 3400 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను (ఎల్‌ఎంఓ) చేర‌వేశాయి. ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ తమ డెలివరీని 45 రోజుల క్రితం ఏప్రిల్ 24న మహారాష్ట్రలో 126 మెట్రిక్ టన్నుల భారంతో త‌న ప్ర‌యాణాన్ని చేప‌ట్టింద‌ని చెప్పాలి. ఆక్సిజ‌న్ కావాల‌ని అభ్యర్థించే రాష్ట్రాలకు సాధ్యమైనంత తక్కువ సమయంలో.. సాధ్యమైనంత ఎక్కువ‌గా త‌మ ద్వారా ఎల్‌ఎంఓ అందించడానికి భారత‌ రైల్వే ప్రయత్నిస్తోంది. ఉత్తరాఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, కేరళ, ఢిల్లీ, హర్యానా, తెలంగాణ, పంజాబ్, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్ మరియు అస్సాం రాష్ట్రాల‌కు భార‌తీయ రైల్వే ద్వారా ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ ద్వారా ప్రాణ వాయువు ఉపశమనం ల‌భించింది. ఈ ప‌త్రికా విడుదల వెలువ‌డే సమయానికి  మహారాష్ట్రలో 614 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్, ఉత్తర ప్రదేశ్‌కు దాదాపు 3797 మెట్రిక్ టన్నులు, మధ్యప్రదేశ్‌కు 656 మెట్రిక్ టన్నులు, ఢిల్లీకి 5722 మెట్రిక్ టన్నులు, హర్యానాకి 2354 మెట్రిక్ టన్నులు, రాజస్థాన్‌కి 98 మెట్రిక్ టన్నులు, కర్ణాటకకి 3450 మెట్రిక్ టన్నులు, ఉత్తరాఖండ్‌కి 320 మెట్రిక్ టన్నులు, తమిళనాడుకు 3972 మెట్రిక్ టన్నులు, ఆంధ్రప్రదేశ్‌కు 3130 మెట్రిక్ టన్నులు, పంజాబ్‌కు 225 మెట్రిక్ టన్నులు, కేరళకు 513 మెట్రిక్ టన్నులు, తెలంగాణకు 2765 మెట్రిక్ టన్నులు, జార్ఖండ్‌కు 38 మెట్రిక్ టన్నులు, అస్సాంకు 400 మెట్రిక్ టన్నుల మేర ప్రాణ‌వాయువు ఆక్సిజ‌న్ ఎక్స్‌ప్రెస్‌ల ద్వారా ర‌వాణా చేయ‌డం జ‌రిగింది.
39 న‌గ‌రాల‌కు స‌ర‌ఫ‌రా..
ఇప్పటివరకు దేశంలోని 15 రాష్ట్రాల్లోని 39 నగరాలు / పట్టణాల‌కు ఆక్సిజ‌న్ ప్రాణ‌వాయువును ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు చేర‌వేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని లక్నో, వారణాసి, కాన్పూర్, బరేలీ, గోరఖ్ పూర్ & ఆగ్రా న‌గ‌రాల‌కు.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాగ‌ర్‌, జ‌బ‌ల్‌పూర్‌, క‌ట్నీ, భోపాల్ న‌గ‌రాలు.. మహారాష్ట్రలో ఉన్న‌ నాసిక్‌, పుణె, ముంబ‌యి, సొలాపూర్ త‌దిత‌ర న‌గరాల‌కు.. తెలంగాణ‌లోని హైద‌రాబాద్ న‌గ‌రానికి, హ‌ర్యానాలో ఉన్న గురుగ్రామ్‌, ఫ‌రిదాబాద్‌.. ఢిల్లీలో తుగ్ల‌కాబాద్‌, ఢిల్లీ కంటోన్‌మెంట్‌తో పాటు ఓక్లా త‌దిత‌ర ప్రాంతాల‌కు.. రాజ‌స్థాన్‌లోని కోట‌, క‌న‌కాపూర్ న‌గ‌రాల‌కు.. క‌ర్ణాట‌క‌లోని
బెంగ‌ళూరుకు.. ఉత్త‌రాఖండ్‌లోని డెహ్రాడూన్‌కు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఉన్న‌
గుంటూరు, నెల్లూరు, తాడిప‌త్రి, విశాఖ‌ప‌ట్ట‌ణ‌ము న‌గ‌రాల‌కు.. కేర‌ళాలో ఉన్న ఎర్నాకుళం న‌గ‌రాకికి.. త‌మిళ‌నాడు రాష్ట్రంలోని తిరువ‌ల్లూరు, టుటికోర్ని, కొయంబొత్తూరు, మ‌ధురై, చెన్నై న‌గ‌రాల‌కు.. పంజాబ్‌లోని ఫిల్లౌర్‌, బ‌టిండా న‌గ‌రాల‌కు.. అస్సాంలోని కామ్‌రూమ్ న‌గ‌రానికి.. జార్ఖండ్‌లోని రాంచీ న‌గ‌రానికి
ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆక్సిజ‌న్ ప్రాణ‌వాయువును చేర‌వేశాయి.
ర‌వాణాలో అత్య‌వ‌స‌ర ప్రాధాన్య‌త..
భారతీయ రైల్వే ఆక్సిజన్ సరఫరా స్థానాలతో వివిధ వేర్వేరు మార్గాలను మ్యాప్ చేశాయి.  దీనికి తోడు రాష్ట్రాల అభివృద్ధి అవసరాలను తీర్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఎల్‌ఎంఓను తీసుకురావడానికి రాష్ట్రాలు భారత రైల్వేకు ఆక్సిజ‌న్ ట్యాంకర్లను అందిస్తున్నాయి. భారతీయ‌ రైల్వే పశ్చిమంలోని హపా, బరోడా, ముంద్రా.. మరియు తూర్పున రూర్కెలా, దుర్గాపూర్, టాటానగర్, అంగుల్ వంటి ప్రదేశాల నుండి ఆక్సిజన్ తీసుకొని ఉత్తరాఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, హర్యానా, తెలంగాణ, పంజాబ్, కేరళ, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ & అస్సాం త‌దిత‌ర రాష్ట్రాలకు సంక్లిష్ట కార్యాచరణ మార్గ ప్రణాళిక ద్వారా పంపిణీ చేస్తోంది. ఆక్సిజన్ ఉపశమనం సాధ్యమైనంత వేగంగా చేరుకునేలా చూసేందుకు, ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ ఫ్రైట్ రైళ్లను నడపడంలో రైల్వే కొత్త ప్రమాణాలను, అపూర్వమైన స‌రికొత్త రికార్డుల‌ను సృష్టిస్తోంది. ఈ క్లిష్టమైన సరుకు రవాణా రైళ్ల సగటు వేగం చాలా సందర్భాలలో 55 కన్నా ఎక్కువగానే ఉంటోంది. ఆక్సిజన్ స‌ర‌ఫ‌రా వేగంగా సాధ్యమయ్యే సమయ వ్యవధిలో జ‌రిగేలా చూసేందుకు గాను అధిక ప్రాధాన్యత కలిగిన గ్రీన్‌కారిడార్‌లో, అత్యవసర భావనతో, వివిధ మండలాల కార్యాచరణ బృందాలు చాలా సవాళ్లతో కూడిన‌ పరిస్థితులలో నిరంత‌రాయంగా పనిచేస్తున్నాయి.  వివిధ విభాగాలపై సిబ్బంది మార్పుల కోసం సాంకేతిక నిలిపివేత‌ల‌ను 1 నిమిషానికి తగ్గించారు. ట్రాక్‌లు తెరిచి ఉంచడం మరియు ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ జిప్ చేయకుండా ఉండేలా అధిక అప్రమత్తతను నిర్వహిస్తుంది. ఆక్సిజ‌న్ ర‌వాణా కార‌ణంగా ఇతర సరుకు రవాణా వేగం కూడా తగ్గని రీతిలో.. దేశంలో ఆక్సిజ‌న్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల కార్య‌క‌లాపాలు నిరంత‌రాయంగా జరుగుతున్నాయి. దేశ‌లో వేగంగా ఆక్సిజ‌న్ వాయు ర‌వాణాను నిర్ధారించేందుకు వాస్త‌వస్థితి క‌స‌ర‌త్తు కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డం జ‌రుగుతోంది. దీనికి గాను గణాంకాలు ఎప్పటికప్పుడు నవీకరించబడతున్నాయి. మ‌రిన్ని లోడ్ చేసిన‌ ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు రాత్రి తరువాత.. త‌మ‌త‌మ గ‌మ్య‌స్థానాల‌కు  ప్రయాణాలను ప్రారంభిస్తాయని భావిస్తున్నారు.
                             

****


(Release ID: 1725857) Visitor Counter : 206