ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 23 కోట్లకు పైగా వాక్సిన్ డోస్‌ల పంపిణీ
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వద్ద ఇప్పటికీ వాడకానికి అందుబాటులో ఉన్న 1.57 కోట్లకుపైగా వాక్సిన్ డోస్‌లు
Posted On:
01 JUN 2021 10:12AM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న వాక్సినేషన్ కార్యక్రమంలో భారత ప్రభుత్వం రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలకు కోవిడ్ వాక్సిన్‌ను ఉచితంగా అందుబాటులో ఉంచుతున్నది. దీనికి తోడు భారత ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు నేరుగా వాక్సిన్ తెప్పించుకునేందుకు వీలు కలిగిస్తున్నది. కోవిడ్ మహమ్మారి నియంత్రణ, వ్యాప్తి నిరోధానికి సమగ్ర వ్యూహంలో వాక్సినేషన్ కీలకమైనది గా ఉంది.దీనితోపాటు టెస్ట్, ట్రాక్, ట్రీట్, కోవిడ్ సానుకూల ప్రవర్తన ముఖ్యమైనవిగా ఉన్నాయి.
సరళీకృత , వేగవంతమైన 3 వ దశ కోవిడ్ -19 వాక్సినేషన్ వ్యూహం 2021 మే 1 నుంచి ప్రారంభమైంది.
ఈ వ్యూహం కింద ప్రతినెల కేంద్ర డ్రగ్ లేబరెటరీ (సిడిఎల్) ఆమోదంచిన వాక్సిన్ డోసులను కేంద్ర ప్రభుత్వం ఏ తయారీ దారునుంచైనా 50 శాతం వరకు డోస్‌లను సమీకరిస్తుంది. ఈ డోస్‌లను ఇంతకు ముందు లాగే పూర్తి ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వాలకు అందుబాటులో ఉంచుతారు.
భారత ప్రభుత్వం ఇప్పటివరకు ఉచిత కేటగిరలో, అలాగే నేరుగా రాష్ట్రాల ప్రొక్యూర్‌మెంట్ కేటగిరీ కింద 23 కోట్లకు పైగా వాక్సిన్ డోస్‌లను (23,18,36,510) రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అందుబాటులోకి తెచ్చింది.
ఇందులో మొత్తం వినియోగం, వృధా అయిన వాటితో కలిపి 21,51,48,659 డోస్‌లు( ఈ రోజు ఉదయం 8 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం)
1.57 కోట్ల కు పైగా కోవిడ్ వాక్సిన్ డోస్‌లు (1,57,74,331) ఇంకా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలవద్ద వినియోగానికి సిద్దంగా ఉన్నాయి.
****
(Release ID: 1723343)
Visitor Counter : 244
Read this release in:
Tamil
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada