విద్యుత్తు మంత్రిత్వ శాఖ
పవర్‌గ్రిడ్ సాయంతో డయ్యుకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించిన కేంద్ర విద్యుత్ శాఖ
Posted On:
30 MAY 2021 4:38PM by PIB Hyderabad
తౌక్టే తుపాను కారణంగా భారీగా ధ్వంసమైన టింబ్డీ-ధోకద్వ, సావర్‌కుండ్ల-ధోకద్వ 220 కేవీ విద్యుత్ సరఫరా లైన్లను కేంద్ర విద్యుత్ శాఖ పునరుద్ధరించింది. మహారత్న హోదా కలిగిన, విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (పవర్‌గ్రిడ్) సాయంతో లైన్లకు మరమ్మతులు చేసింది. ఈ లైన్లు డయ్యుకు విద్యుత్‌ను సరఫరా చేస్తాయి.
తౌక్టే తుపాకును కారణంగా ఈ విద్యుత్ మార్గంలో 33 టవర్లు కూలిపోయాయి. దాదాపు 600 మంది సిబ్బంది రాత్రింబవళ్లు కష్టపడి మరమ్మతులు పూర్తి చేశారు. 'అత్యవసర పునరుద్ధరణ వ్యవస్థ'ను ఉపయోగించిన పవర్‌గ్రిడ్, టింబ్డీ-ధోకద్వ మధ్య 11 టవర్లను బాగు చేయడంతోపాటు 10 కొత్త టవర్లను ఈ నెల 28న నిర్మించింది.
ఈ లైను పునరుద్ధరణతో, గెట్కోకు చెందిన పదిహేను 66కేవీ ఉప కేంద్రాలకు విద్యుత్ అందింది. తద్వారా డయ్యు, చుట్టుపక్కల ప్రాంతాలకు విద్యుత్ సరఫరా జరిగింది. సవర్‌కుండ్ల-ధోకద్వ మధ్య విద్యుత్ లైన్ల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి.
***
(Release ID: 1722966)
Visitor Counter : 133