రైల్వే మంత్రిత్వ శాఖ

ఉద్దంపూర్ - శ్రీనగర్ - బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్ట్ (యు ఎస్ బీ ఆర్ ఎల్) ప్రగతిని సమీక్షించిన కేంద్ర రైల్వే, వాణిజ్య & పారిశ్రామిక మరియు వీనినియోగదారుల వ్యవహారాల, ఆహార మరియు ప్రజాపంపిణీ మంత్రి శ్రీ పీయూష్ గోయల్


కోవిడ్ రెండవ దశ వల్ల పనులకు జరిగిన నష్టం పూడ్చడానికి రానున్న మాసాల్లో అదనపు ప్రయత్నం చేయాలి - శ్రీ గోయల్

యు ఎస్ బీ ఆర్ ఎల్ ప్రాజెక్టులో మిగిలిన పనిని పట్టుదలతో అనుకున్న గడువు 2023 ఏప్రిల్ లోగా పూర్తి చేయాలని సంకల్పం

దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కాశ్మీర్ కు అన్ని కాలాలలో ప్రయాణానికి అనువైన రవాణా సౌకర్యాల కల్పనపై దృష్టి

రైలు మార్గ నిర్మాణం మరియు పట్టాలు వేసే పని సత్వరం పూర్తిచేయడానికి ప్రాజెక్టు పనులపై నియమితకాలిక సమీక్ష

2021-22 సంవత్సరానికి యు ఎస్ బీ ఆర్ ఎల్ ప్రాజెక్టుకు బడ్జెట్ లో రూ. 4200 కోట్లు కేటాయింపు

Posted On: 25 MAY 2021 8:03PM by PIB Hyderabad

కేంద్ర రైల్వే, వాణిజ్య & పారిశ్రామిక మరియు వీనినియోగదారుల వ్యవహారాల,  ఆహార మరియు ప్రజాపంపిణీ మంత్రి  శ్రీ  పీయూష్ గోయల్  మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా   రైల్వే బోర్డు చైర్మన్, సి యి ఓ రైల్వేలకు చెందిన సీనియర్ అధికారులతో  ఉద్దంపూర్ -  శ్రీనగర్ - బారాములా రైల్ లింక్ ప్రాజెక్ట్ (యు ఎస్ బీ ఆర్ ఎల్)  ప్రగతిని సమీక్షించారు.  

కోవిడ్  రెండవ దశ విజృంభణ వల్ల  ప్రజలు సతమతమవుతున్న ప్రస్తుత తరుణంలో కూడా ఈ ఏడాది  ఏప్రిల్, మే నెలల్లో  యు ఎస్ బీ ఆర్ ఎల్ ప్రాజెక్టు పనులలో గణనీయమైన ప్రగతిని సాధించినందుకు రైల్వే మంత్రి వారిని అభినందించారు.   కోవిడ్ రెండవ దశ వల్ల  పనులకు జరిగిన నష్టం పూడ్చడానికి  రానున్న మాసాల్లో అదనపు ప్రయత్నం చేయాలని మంత్రి వారిని ఆదేశించారు.  

యు ఎస్ బీ ఆర్ ఎల్ ప్రాజెక్టుకు  2021-22 బడ్జెట్ లో  రూ. 4200 కోట్లు కేటాయించినట్లు మంత్రికి తెలియజేశారు.   ఈ ప్రాజెక్టుకు కేటాయింపుల్లో ఎలాంటి అవరోధాలు  ఉండకూడదని మంత్రి అధికారులను  ఆదేశించారు.  

ఉద్దంపూర్ -  శ్రీనగర్ - బారాముల్లా  రైల్ లింక్ ప్రాజెక్ట్ (యు ఎస్ బీ ఆర్ ఎల్) గురించి
❖   ప్రాజెక్టు నేపధ్యం :  

      ఉద్దంపూర్ -  శ్రీనగర్ - బారాముల్లా  రైల్ లింక్ ప్రాజెక్ట్ (యు ఎస్ బీ ఆర్ ఎల్)  పొడవు 272 కిలోమీటర్లు .  ఉద్దంపూర్ నుంచి బారాముల్లా వరకు  ఉన్న ఈ రైలు మార్గం కాశ్మీర్ లోయను దేశంలోని ఇతర ప్రాంతాలకు కలుపుతుంది.  దీనిని 2002లో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు.  మొత్తం 272 కిలోమీటర్ల ప్రాజెక్టులో  161 కిలోమీటర్ల మేర ప్రాజెక్టు పూర్తి కావడమే కాక ప్రారంభించడం జరిగింది.     ప్రాజెక్టు పనులను మూడు మూడు చరణాలుగా విభజించారు.  
      i.    ఉద్దంపూర్ =  కాట్రా -  25 కిలోమీటర్లు  ( 2014 జూలైలో ప్రారంభం)  
      ii.    క్వాజీగుండ్ -  బారాముల్లా --  118 కిలోమీటర్లు ( 2009 అక్టోబర్ లో ప్రారంభం)  
     iii.    బనీహాల్ -   క్వాజీగుండ్ -   18 కిలోమీటర్లు  ( 2013 జూన్ లో ప్రారంభం)  
     iv.    కాట్రా   --   బనీహాల్     --    111 కిలోమీటర్లు నిర్మాణంలో ఉంది (2022-23లో  పూర్తిచేయాలని లక్ష్యం)  

❖యు ఎస్ బీ ఆర్ ఎల్ ప్రాజెక్టు  కాట్రా -- బనీహాల్  సెక్షన్  

   ప్రాజెక్టు మధ్యలో ఉన్న కాట్రా -- బనీహాల్ సెక్షన్ (111 కిలోమీటర్లు)  నిర్మాణపు పనులు జరుగుతున్నాయి.   ఈ సెక్షను  ఎక్కువగా సొరంగాలతో నిండి ఉంటుంది.   మొత్తం 111 కిలోమీటర్లలో దాదాపు  97 కిలోమీటర్లు అంటే 87%  సొరంగాలు ఉంటాయి.   అన్నిటికన్నా పెద్దదైన సొరంగం టి -49  పొడవు  12.75 కిలోమీటర్లు.    ఈ  సెక్షనులో  97.6 కిలోమీటర్ల పొడవున్న 27 ప్రధాన సొరంగాలు ఉండగా ,   66.4  కిలోమీటర్ల పొడవున్న 8  పక్కకు తప్పుకుని వెళ్లే  సొరంగాలు ఉన్నాయి.    ఈ రెండూ కలిపి కాట్రా -- బనీహాల్ సెక్షనులో మొత్తం  164  కిలోమీటర్ల సొరంగాలు నిర్మాణం కొనసాగుతున్నది.  ఇప్పటి వరకు  97.6 కిలోమీటర్ల పొడవున్న 27 ప్రధాన సొరంగాలలో  84.2 కిలోమీటర్ల పొడవున్న 20 సొరంగాలు,  66.4  కిలోమీటర్ల పొడవున్న 8  పక్కకు తప్పుకుని వెళ్లే  సొరంగాలలో  56.61 కిలోమీటర్ల పొడవున్న 3 సొరంగాల నిర్మాణం పూర్తయ్యింది.  ఈ సెక్షనులో  మొత్తం 7 కిలోమీటర్ల పొడవున్న 37 వంతెనలు ఉన్నాయి.   వాటిలో 26 పెద్ద వంతెనలు కాగా,  11 చిన్న వంతెనలు.    ఇప్పటివరకు  13 పెద్ద వంతెనలు,10 చిన్న వంతెనల నిర్మాణం పూర్తయ్యింది.  మిగిలిన అన్ని వంతెనల పనులు  కొనసాగుతున్నాయి.   ఆ వంతెనలలో  చీనాబ్ నదిపై నిర్మించిన వారధి కూడా ఉంది.   ( ఆ వారధి మొత్తం పొడవు 1315 మీటర్లు,  కమాను వెడల్పు 467 మీటర్లు మరియు  నదీతలంపై నుంచి 359 మీటర్ల ఎత్తు)  ఇది ప్రపంచంలోనే ఎక్కువ ఎత్తయిన  రైలు వంతెన.   2021 ఏప్రిల్  5వ తేదీన  చీనాబ్ వారధి కమాను ప్రారంభం జరిగింది.   భారతీయ రైల్వే లో మొట్టమొదటి కేబుల్ బ్రిడ్జిని  అంజి ఖాడ్ (వంతెన)పై నిర్మించడం జరుగుతోంది.   ప్రధాన పైలాన్ (తోరణము)లోని 193 మీటర్లలో 130 మీటర్లు పోతపోయడం జరిగింది.  అదేవిధంగా అంజి వంతెనకు అనుబంధంగా నిర్మించే వంతెన భాగం పోతపోయడం కూడా పూర్తయ్యింది.  
మరో రెండు పెద్ద వంతెనలు 310 మీటర్లున్న 39 &  260 మీటర్ల పొడవున్న 43 వంతెనల పనులు  ప్రారంభించగా పురోగమిస్తున్నాయి.  

 

❖   2021  ఏప్రిల్  &  మే నెలల్లో ప్రధానంగా సాధించిన ప్రగతి  


●     చీనాబ్ వంతెన - కమాను నిర్మాణం -  ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే వంతెన పనులు  ఏప్రిల్ నెలలో 58 మెట్రిక్  టన్నులు,   మే నెలలో 163 మెట్రిక్ టన్నులు విజయవంతంగా పూర్తిచేయడం జరిగింది.  మొత్తం మీద 10,619 మెట్రిక్ టన్నుల పనులు పూర్తయ్యాయి.  అయితే పెరిగిన కోవిడ్  కేసుల కారణంగా  వంతెన నుంచి కౌరి వైపు ఉన్న చివర చుట్టుపక్కల ఇటీవల కొన్ని ఆంక్షలతో కంటెయిన్మెంట్ జోన్ గా ప్రకటించడం జరిగింది.  

●      అంజి వంతెన  -  ప్రధాన తోరణం సిమెంటు నిర్మాణం :    2021 ఏప్రిల్ నెలలో 4 మీటర్ల లిఫ్ట్ మరియు 2021 మే నెలలో (24వరకు) 4 మీటర్ల లిఫ్ట్ పనులు.   మొత్తం 193 మీటర్లున్న ప్రధాన తోరణంలో 130 మీటర్ల నిర్మాణం పూర్తయ్యింది.   వివిధ భాగాల సంచిత కూర్పు 55 మీటర్లు పూర్తికాగా 30 మీటర్లను ప్రారంభించడం జరిగింది.  

●       రీసి ప్రాంతంలో  21 ఏప్రిల్ నెలలో 32 మీటర్లు ,  21 మే నెలలో 15మీటర్లను ప్రారంభించడం జరిగింది.  
●       బక్కాల్ (రీసి)  ప్రాంతంలో   43వ నెంబరు వంతెన వద్ద  2020 ఏప్రిల్ నెలలో 42.5 మీటర్లు  మరియు  2021 మే నెల (21 వరకు)లో
          9 మీటర్లు  

●        2021 ఏప్రిల్ నెలలో 1.46 కిలోమీటర్ల సొరంగం (గనుల)  తవ్వకం  పనులు  మరియు  2021 మే నెల (24వరకు) లో  0.78 కిలోమీటర్ల  సొరంగం (గనుల)  తవ్వకం  పనులు పూర్తయ్యాయి.  

2020-21 సంవత్సరంలో ప్రధానంగా సాధించిన ప్రగతి

●    2020-21 సంవత్సరంలో మొత్తం 14.97 కిలోమీటర్ల పొడవునా సొరంగం (గనుల) తవ్వకం పనులు  జరిగాయి    
●    5093 మీటర్ల పొడవున్న టి 2 సొరంగం ( ప్రధాన సొరంగం)  పనుల్లో పురోగతి 2020 ఆగస్టు 3న జరిగింది.  
●    8.6  కిలోమీటర్ల పొడవున్న టి -74ఆర్ (ప్రధాన సొరంగం) పనుల్లో పురోగతి 03-10-2020న జరిగింది.  ఇది యు  ఎస్ బి ఆర్ ఎల్ ప్రాజెక్టు లోని సొరంగాలలో రెండవ అతిపెద్ద సొరంగం.  ప్రాజెక్టులో అతిపెద్ద సొరంగం పీర్ పంజల్  సొరంగం పొడవు 11.2 కిలోమీటర్లు.
●      ఈ మార్గాన్ని తప్పించుకొని వెళ్లే సొరంగాలలో ఒకటైన టి -74ఆర్ (తప్పుకుని వెళ్లే సొరంగం) పురోగతి 05.12.2020న  జరిగింది.  దీని పొడవు  7.41 కిలోమీటర్లు.  
●       వంతెన నెంబరు 88  (1 x 45.7 మీటర్లు)  2020 అక్టోబర్ నెలలో పూర్తయ్యింది.
●       వంతెన నెంబరు 138  (3x 30.5 మీటర్లు)  2020 నవంబర్ నెలలో పూర్తయ్యింది.
●       వంతెన నెంబరు 59  (1x30.5 + 1x45.7 + 1x30.5 మీటర్లు)  2021 మార్చి నెలలో పూర్తయ్యింది.
●       వంతెనల నిర్మాణంలో భాగంగా ఉక్కు ఆకృతుల సృష్టిలో ఈ ఆర్ధిక  సంవత్సరంలో రికార్డు సృష్టించారు.  గతంలో  మరే  ఆర్ధిక
          సంవత్సరంలో జరుగని రీతిలో 15, 480  మెట్రిక్ టన్నుల ఆకృతులకు రూపకల్పన చేశారు.  
●        బ్రిడ్జి పనుల ప్రారంభం / ఉపరినిర్మాణము స్థాపన మొత్తం 15,520 పనులు 2020-21 ఆర్హిక సంవత్సరంలో పూర్తయ్యాయి.  ఇదొక
          రికార్డు.   మరే  ఆర్ధిక సంవత్సరంలో ఈ ఘనత సాధించలేదు.
❖       టెండర్ల పరిస్థితి :    2021 ఫిబ్రవరి నుంచి   కె ఆర్ సి ఎల్  &  ఇర్కాన్ సంస్థలు వరుసగా రూ.  580  కోట్లు,  రూ. 32.84 కోట్ల
            విలువైన టెండర్లను ఖరారు చేశాయి.   అంతేకాక ఇర్కాన్ & కె ఆర్ సి ఎల్ సంస్థలు వరుసగా  రూ. 915 కోట్లు మరియు రూ. 234
            కోట్ల విలువైన టెండర్లను పిలిచాయి.   మిగిలిన  రూ. 435 కోట్లకు సంబంధించిన టెండర్లను 2020 జూన్ నెలలో పిలుస్తామని
             రైల్వే మంత్రికి తెలియజేయడం జరిగింది.   ఆ  టెండరు ప్రకటన త్వరితగతిన పూర్తిచేసి  ప్రాజెక్టు లక్ష్యాన్ని సాధించవచ్చని
            భావిస్తున్నారు.
❖         బనిహాల్ -  బారాముల్లా సెక్షను విద్యుదీకరణ :    
            బనిహాల్ నుంచి   బారాముల్లా  వరకు గల 136 కిలోమీటర్ల రైల్వే లైనును ఇదివరకే ప్రారంభించడం జరిగింది.   ఆ మార్గం
            విద్యుదీకరణ  పనులకు మంజూరు లభించింది    టెండర్లను ఖరారు చేసి పనులు అప్పగించడం జరిగింది. సిగ్నల్  & టెలి
            కమ్యూనికేషన్ ప్రణాళికలను కూడా ఆమోదించడం జరిగింది.   పనులు కొనసాగుతున్నాయి.   బనిహాల్ -  బారాముల్లా  
            సెక్షనులో విద్యుదీకరణ పనులను 2022 మార్చి లోపల పూర్తిచేయాలన్నది లక్ష్యం.  మొత్తం ప్రాజెక్టు పూర్తి
             చేయవలసిన తేదీ :  2023 ఏప్రిల్

 

*****

 

 


(Release ID: 1721837) Visitor Counter : 181


Read this release in: English , Urdu , Hindi