వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
ప్రస్తుత ఆర్‌ఎంఎస్‌లో 13% అధికంగా గోధుమలు సేకరించబడ్డాయి
గత ఏడాది 344.94 ఎల్‌ఎమ్‌టిల గోధుమలు సేకరించగా ఈ ఏడాది మొత్తం 390.68 ఎల్‌ఎమ్‌టి గోధుమలు సేకరించబడ్డాయి
ప్రస్తుతం జరుగుతున్న ఆర్‌ఎంఎస్ గోధుమల సేకరణ వల్ల సుమారు 40.81 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు
ప్రస్తుతం కొనసాగుతున్న కెఎంఎస్ 2020-21 మరియు ఆర్‌ఎంఎస్‌ల్లో 772.92 ఎల్‌ఎమ్‌టిల వరిని ఎంఎస్‌పిలో సేకరించారు
ప్రభుత్వ సంస్థలు ఎంఎస్‌పిపై 6,91,581.09 మెట్రిక్ టన్నుల పప్పుధాన్యాలు, నూనె గింజలను సేకరించాయి
నాడు పోస్టు చేయడమైనది:
25 MAY 2021 5:25PM by PIB Hyderabad
ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్‌ఎంఎస్ 2021-22లో ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ మరియు జమ్మూ & కాశ్మీర్ రాష్ట్రాల్లో ఎంఎస్‌పి వద్ద గోధుమల సేకరణ సజావుగా కొనసాగుతోంది. గత సంవత్సరం 344.94 ఎల్‌ఎమ్‌టి కొనుగోలు జరపగా..ఈ ఏడాది ఇప్పటివరకూ (24.05.2021) 390.68 ఎల్‌ఎమ్‌టి గోధుమలు సేకరించబడ్డాయి. తద్వారా సుమారు 40.81 లక్షల మంది రైతులు ఇప్పటికే కొనసాగుతున్న ఆర్‌ఎంఎస్ సేకరణ కార్యకలాపాల ద్వారా రూ 77,159.58 కోట్లు లబ్ధి పొందారు.
గత ఏడాది 711.90 ఎల్‌ఎమ్‌టి వరి కొనుగోలు చేయగా ఈ ఏడాది ప్రస్తుతం కొనసాగుతున్న ఖరీఫ్ 2020-21 సీజన్ వరి సేకరణ 24.05.2021 వరకు 772.92 ఎల్‌ఎమ్‌టిల (ఖరీఫ్ పంట 706.43 ఎల్‌ఎమ్‌టి మరియు రబీ పంట 66.49 ఎల్‌ఎమ్‌టిలను కలిగి ఉంది) కొనుగోలు చేయడం జరిగింది. ప్రస్తుతం ఆయా రాష్ట్రాలలో కొనుగోలు సేకరణ కార్యక్రమాలు సజావుగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే కొనసాగుతున్న కెఎంఎస్ సేకరణ కార్యకలాపాల నుండి సుమారు 114.98 లక్షల మంది రైతులు ఎంఎస్‌పి విలువ రూ. 1,45,927.84 కోట్లు లబ్ధి పొందారు.
ఇంకా రాష్ట్రాల ప్రతిపాదన ఆధారంగా, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్ మరియు ఆంధ్రప్రదేశ్ నుండి ధరల మద్దతు పథకం (పిఎస్ఎస్) కింద ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2020-21 మరియు రబీ మార్కెటింగ్ సీజన్ 2021 యొక్క 107.37 ఎల్ఎంటి పప్పులు మరియు నూనె గింజల కొనుగోలుకు అనుమతి లభించింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాల కోసం 1.74 ఎల్ఎంటి కొప్రా (శాశ్వత పంట) కొనుగోలుకు అనుమతి లభించింది. ఇతర రాష్ట్రాలు / యుటిల కొరకు, పప్పుధాన్యాలు, నూనెగింజలు మరియు కొప్రాలను పిఎస్ఎస్ క్రింద సేకరించే ప్రతిపాదనలను స్వీకరించినప్పుడు కూడా ఆమోదం లభిస్తుంది. ఈ పంటల యొక్క ఎఫ్‌ఏక్యూ గ్రేడ్ సేకరణను 2020-21 సంవత్సరానికి సంబంధిత రాష్ట్రాలు / యుటిలలో నోటిఫైడ్ హార్వెస్టింగ్ కాలంలో మార్కెట్ రేటు ఎంఎస్పి కంటే తక్కువగా ఉంటే నోటిఫైడ్ ఎంఎస్పి వద్ద రిజిస్టర్డ్ రైతులు, సెంట్రల్ నోడల్ ఏజెన్సీలు రాష్ట్ర నామినేటెడ్ ప్రొక్యూర్ ఏజెన్సీల ద్వారా సేకరణ జరుగుతుంది.
24.05.2021 వరకు ప్రభుత్వం తన నోడల్ ఏజెన్సీల ద్వారా ఖరీఫ్ 2020-21 & రబీ 2021 కింద తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, తెలంగాణ, హర్యానా మరియు రాజస్థాన్ రాష్ట్రాల్లోని రైతుల నుండి 6,91,581.09 మెట్రిక్ టన్నుల పెసర, మినప, కంది, గ్రామ్, మసూర్, వేరుశనగ, ఆవ గింజలు, సోయాబిన్‌లను కొనుగోలు చేసింది. తద్వారా 4,12,421 మంది రైతులకు ఎంఎస్‌పి విలువ రూ .3,621.03 కోట్లు ప్రయోజనం చేకూర్చింది.
అదేవిధంగా 24.05.2021 వరకు రూ .52.40 కోట్ల ఎంఎస్‌పి విలువ కలిగిన 5089 మెట్రిక్ టన్నుల కొప్రా (శాశ్వత పంట) సేకరణ ద్వారా కర్ణాటక, తమిళనాడులలోని 3961 మంది రైతులకు లబ్ధి చేకూర్చారు.
***
(రిలీజ్ ఐడి: 1721690)
సందర్శకుల సూచీ సంఖ్య : : 201