రక్షణ మంత్రిత్వ శాఖ
యాస్ తుఫాను దృష్ట్యా తన నౌకలను మోహరించిన ఇండియన్ కోస్ట్ గార్డ్
प्रविष्टि तिथि:
23 MAY 2021 7:02PM by PIB Hyderabad
2021 మే 26న యాస్ తుఫాను తూర్పు తీరాన్ని తాకే అవకాశం ఉన్న దృష్ట్యా ఇండియన్ కోస్ట్ గార్డ్(ఐసీజీ) నష్ట నివారణ చర్యలలో భాగంగా తన ఆస్తులను తరలింపును చేపట్టింది. తీరప్రాంతంలో ఉన్న, సముద్రంలో తెలియాడతున్న పలు ఏవియేషన్ యూనిట్లు అత్యధికంగా తుఫాను హెచ్చరిక ప్రాంతంలో ఉన్నాయి. దీంతో ఐసీజీ నౌకల్ని విమానాలను బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలో మోహరించింది. సముద్రయానదారులు మరియు మత్స్యకారుల నిమిత్తం స్థానిక భాషలలో వాతావరణ హెచ్చరిక సందేశాలను ఐసీజీ రిమోట్ ఆపరేటింగ్ స్టేషన్లు.. ఎంఎంబీ రేడియోలు ప్రసారం చేస్తున్నాయి. నవ్‌టెక్స్ హెచ్చరికలు క్రమం తప్పకుండా జారీ చేస్తున్నారు. ఈ ప్రాంతం గుండా/ ప్రయాణం చేసే ఓడలను అప్రమత్తం చేయడానికి అంతర్జాతీయ భద్రతా వలయం (ఐఎస్ఎన్) సక్రియం చేయబడింది. అవసరమైన భద్రతా చర్యల కోసం ఆంకరేజ్ వద్ద ఉన్న ఓడలు కూడా తగు ఆశ్రయం, సింగిల్ పాయింట్ మూరింగ్ (ఎస్‌పీఎం) ఆపరేటర్లను తీసుకోవాలని సూచించారు. బంగాళాఖాతం లోని లోతైన నీటితో పాటు తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, అండమాన్ & నికోబార్ దీవులలో ఐసీజీ రోజుకు సగటున 16 నౌకలు మరియు మూడు విమానాలను మోహరించింది. దీనికి తోడు గాలితో కూడిన పడవలు, లైఫ్‌బాయ్‌లు, లైఫ్‌జాకెట్‌లతో పాటు 31 కోస్ట్ గార్డ్ డిజాస్టర్ రిలీఫ్ టీమ్‌లను(డీఆర్‌టీ) సంసిద్దంగా ఉంచింది. అవసరం మేరకు వైద్య బృందాలు, అంబులెన్స్‌లను కూడా వేగంగా సమీకరించటానికి గాను స్టాండ్‌బైగా ఉంచబడ్డాయి. ముందస్తు నష్ట నివారణ చర్యలతో సముద్రంలో బయలుదేరిన 254 పడవలను సురక్షితంగా తిరిగి వచ్చేలా ఐసీజీ నిర్ధారిస్తుంది. రవాణాలో ఉన్న వివిధ వ్యాపార వెసెల్స్‌ను.. ఇప్పటి వరకు ఆంకరేజ్ వద్ద ఉన్న 77 ఓడలను కూడా అప్రమత్తం చేసింది. నౌకశ్రయం అధికారులు, చమురు రిగ్ ఆపరేటర్లు, షిప్పింగ్, ఫిషరీస్ అధికారులు మరియు మత్స్యకారులకు రానున్న తుఫాను ముప్పు గురించి సమాచారం ఇవ్వడమైంది. ఎలాంటి తుఫాను నష్టం జరగకుండా చూసుకొనేందుకు.. ముందస్తు చర్యలు తీసుకునేందుకు.. రాబోయే తుఫాను గురించి సమాచారం ఇవ్వబడింది. తౌక్టే తుఫాను తరువాత పడమట సముద్ర తీరంలో కొనసాగుతున్న తుపాను తరువాత శోధన మరియు సహాయక చర్యలను కొనసాగిస్తూ ఐసీజీ తన ఆస్తులను తూర్పు తీరం దిశగా తరలిస్తోంది.


***
(रिलीज़ आईडी: 1721219)
आगंतुक पटल : 197