వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
గోధుమల సేకరణలో 32శాతం వృద్ధి!
మొత్తం 353.99లక్షల మెట్రిక్ టన్నుల సేకరణతో 36.19లక్షల మంది రైతులకు ప్రయోజనం
పంజాబ్ లో 131.14లక్షల టన్నుల ఆల్ టైమ్ రికార్డ్!
ప్రస్తుత ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో
740.22లక్షల టన్నుల ధాన్యం సేకరణ,
74లక్షల మంది రైతులకు లబ్ధి.
నోడల్ ఏజెన్సీల ద్వారా 6,59,584.98 టన్నుల
పప్పు ధాన్యాలు, నూనె గింజల సేకరణ,..
4,00,168మంది రైతులకు ప్రయోజనం
Posted On:
13 MAY 2021 7:27PM by PIB Hyderabad
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రస్తుతం 2021-22వ సంవత్సరపు రబీ మార్కెటింగ్ సీజన్లో గోధుమల సేకరణ ప్రక్రియ సజావుగా సాగుతోంది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, జమ్ము కాశ్మీర్, బీహార్ రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ,. గత సీజన్లలోలాగే సజావుగా సాగుతోంది. ఈ నెల 12వ తేదీవరకూ 353.99 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా గోధుములను సేకరించారు. గత ఏడాది ఇదే వ్యవధిలో 268.91లక్షల మెట్రిక్ టన్నులను మాత్రమే సేకరించగలిగారు. ఈ రాష్ట్రాల్లో రూ. 69,912.61 కోట్ల కనీస మద్దతు ధర విలువతో ప్రస్తుత సీజన్ లో చేపట్టిన ఈ సేకరణ ప్రక్రియ ద్వారా ఇప్పటికే దాదాపు 36.19 లక్షల రైతులకు ప్రయోజనం చేకూరింది.
పంజాబ్ లో గోధుమల సేకరణ రీషెడ్యూల్
పంజాబ్ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు గోధుమల సేకరణ కాలాన్ని రీషెడ్యూల్ చేశారు. 2021-22వ సంవత్సరపు రబీ మార్కెటింగ్ సీజన్ కు గాను, ఈ ఏడాది ఏప్రిల్ 10వ తేదీనుంచి మే నెల 31వరకూ జరగాల్సిన సేకరణ ప్రక్రియను ఏప్రిల్ పదవ తేదీనుంచి మే నెల 13వరకూ జరిగేలా మార్పు చేశారు. గత కొన్ని రోజులుగా మండీలకు చేరుకున్న గోధుమల పరిమాణం తగ్గిన నేపథ్యంలో, పంజాబ్ లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతితో కేసులు సంఖ్య పెరగడాన్ని దృష్టిలో పెట్టుకుని షెడ్యూల్.లో ఈ మార్పు చేశారు. అయితే, గత ఏడాది 127.14లక్షల మెట్రిక్ టన్నులమేర జరిగిన గోధుమల సేకరణను, ఈ ఏడాది నిర్దేశించుకున్న 130లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యాన్ని, అంచనాలను పంజాబ్ ఈ సారి అధిగమించడం ఇక్కడ గమనార్హం. ఈ ఏడాది మార్చి 12వ తేదీనాటికి 131.14 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ జరిగింది. సెంట్రల్ పూల్ లో ఇది పంజాబ్ ఇదివరకెన్నడూ సాధించని ఆల్ టైమ్ రికార్డుగా నమోదైంది.
ఇక 2020-21 ఖరీఫ్ సీజన్ కు సంబందించి ధాన్యం సేకరణ ప్రక్రియ ఆయా రాష్రాల్లో సజావుగా సాగుతోంది. ఈ ఏడాది మే నెల 12వరకూ మొత్తం 740.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగింది. (అంటే, 705.45లక్షల మెట్రిక్ టన్నుల ఖరీఫ్ పంటను, 34.77లక్షల మెట్రిక్ టన్నుల రబీ పంటను సేకరించారు) దీనితో ప్రస్తుత ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో రూ. 1,39,755.10 విలువైన కనీస మద్దతు ధరతో జరిగిన సేకరణ ప్రక్రియతో దాదాపు 110.74 లక్షలమంది రైతులకు ఇప్పటికే ప్రయోజనం చేకూరింది.
|
|
దీనికి తోడు, 2020-21 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్, 2021 రబీ మార్కెటింగ్ సీజన్లకు గాను తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదనల ఆమోదం ప్రాతిపదికన 107.37లక్షల మెట్రిక్ టన్నుల పప్పు ధాన్యాలు, నూనె గింజల సేకరణకు అనుమతి ఇచ్చారు. ధరల మద్దతు పథకం కింద ఈ సేకరణ ప్రక్రియ చేపట్టేలా అనుమతి ఇచ్చారు. ఇక ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో 1.74లక్షల మెట్రిక్ టన్నుల కొబ్బరి కురిడీల సేకరణకు కూడా అనుమతి ఇచ్చారు. ధరల మద్దతు పథకం కిందనే, జరిగే పప్పు ధాన్యాలు, కొబ్బరి కురిడీల సేకరణకు సంబంధించి ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలనుంచి అందే ప్రతిపాదనలకు కూడా ఆమోదం తెలపనన్నారు. సగటు నాణ్యతతో కూడిన ఈ పంటలను రిజిస్టరయిన రైతులనుంచి నేరుగా కొనుగోలు చేస్తారు. ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో దిగుబడి సీజన్ సమయంలో మార్కెట్ ధర కనీస మద్దతు ధరకంటే తక్కువగా ఉన్న పక్షంలో నోటిఫై చేసిన కనీస మద్దతు ధరపై ఈ పంటలను కొనుగోలు చేస్తారు. సంబంధిత రాష్ట్రాల్లో ఎంపిక చేసిన సంస్థల ద్వారా కేంద్ర నోడల్ ఏజెన్సీలు ఈ సేకరణ ప్రక్రియను నిర్వహిస్తాయి.
ఇక ఈ నెల 12వ తేదీవరకూ 6,59,584.98 మెట్రిక్ టన్నుల పెసలు, మినుములు, కందులు, ఎర్రకంది పప్పు, వేరుశనగ కాయలు, ఆవ విత్తనాలు, సోయాబీన్ ను ప్రభత్వం తన నోడల్ ఏజెన్సీల ద్వారా సేకకరించింది. రూ. 3,455.20ల విలువైన కనీస మద్దతు ధరతో జరిపిన సేకరణతో తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, హర్యనా, రాజస్థాన్ రాష్ట్రాల్లోని 4,00,168 రైతులకు ప్రయోజనం చేకూరింది. 2020-21వ సంవత్సరపు ఖరీఫ్ సీజన్, 2021వ సంవత్సరపు రబీ సీజన్ కింద ఈ పంటల సేకరణ జరిపారు.
అలాగే, ఈ నెల 12వ తేదీ నాటికి, రూ. 52.40 కోట్ల విలువైన కనీస మద్దతు ధరతో 5,089 మెట్రిక్ టన్నుల కొబ్బరి కురిడీలను కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి సేకరించారు. దీనితో ఈ సేకరణ ప్రక్రియ ద్వారా ఆయా రాష్ట్రాల్లోని 3,961మంది రైతులకు ప్రయోజనం చేకూరింది.
***
(Release ID: 1718447)
Visitor Counter : 149