రక్షణ మంత్రిత్వ శాఖ
భీమునిపట్నం వద్ద కోవిడ్ కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేసిన భారతీయ నేవీ
Posted On:
11 MAY 2021 7:12PM by PIB Hyderabad
వినాశకరంగా పరిణమిస్తున్న కోవిడ్ రెండో దశవ్యాప్తిని ఎదుర్కోవడంలో భాగంగా భీమునిపట్టణంలోని సాధారణ జనాభాకు సహాయపడటానికి భారత నావికాదళం ముందుకు వచ్చింది. ఈ ప్రయత్నాల్లో భాగంగా భీమునిపట్టణం లోని ఐఎన్ఎస్ కళింగ వద్ద 60 పడకల కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసింది. ఈ సౌకర్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటకశాఖ మంత్రి, భీమునిపట్నం ఎమ్మెల్యే శ్రీముట్టమ్ శెట్టి శ్రీనివాసారావు 11మే 2021న ప్రజలకు అంకితం చేశారు. భీమునిపట్టణం మండలం దాని పరిసర ప్రాంతాలలో మితమైన కోవిడ్ లక్షణాలతో వచ్చే కోవిడ్ పాజిటివ్ రోగులకు చికిత్స అందించడానికి కోవిడ్ కేర్ సెంటర్‌లో అవసరమైన తగు సౌకర్యాలు ఉన్నాయని కమాండింగ్ ఆఫీసర్ ఐఎన్ఎస్ కళింగ పేర్కొన్నారు.
పరిపాలనపరమైన, లాజిస్టిక్ సహకారం ఫుడ్ కన్జర్వెన్సీ సర్వీసెస్ మరియు వైద్య పరికరాలను భారత నావికా దళం అందిస్తోంది. కోవిడ్-19 సెంటర్‌కు మొత్తం ముగ్గురు వైద్యులు, 10 మంది నర్సింగ్ సిబ్బంది కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అందిస్తుంది. కోవిడ్ కేర్ సెంటర్ నిర్వహణ మరియు రోజువారీ కార్యకలాపాలకు
సంబంధించి పర్యాటక మంత్రి, విశాఖ జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డాక్టర్ జి సూర్యనారాయణ సమక్షంలో ఐఎన్ఎస్ కళింగ కమాండింగ్ ఆఫీసర్ సీఎండీ నీరజ్ ఉదయ్, భీమునిపట్నం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్‌లు ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ కోవిడ్ కేర్ సెంటర్‌లో తేలికపాటి, మితమైన లక్షణాలతో వచ్చే రోగులకు సంరక్షణ అందించడానికి వైద్య సదుపాయాలు ఉన్నాయి. ఇక్కడున్న 60 లో 14 పడకలు సిలిండర్ల ద్వారా ఆక్సిజన్ అందించే వెసులుబాటుతో పాటుగా ఆక్సిజన్ కాన్‌సెంట్రేటర్ సౌలభ్యాన్ని కలిగి ఉన్నాయి. నిరంతరాయంగా వైద్య సేవలను అందించేందుకు వీలుగా కోవిడ్ కేర్ సెంటర్ సమీపంలో వైద్యులు మరియు నర్సింగ్ సిబ్బందికి అనువైన వసతి సేవలను అందించేలా తగిన ఏర్పాట్లు
చేయడమైంది. భీమునిపట్నం లోని కోవిడ్ కేర్ సెంటర్‌తో పాటు, రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి అదనపు సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఈస్టర్న్ నావల్ కమాండ్ విదేశాల నుండి సహాయక సామగ్రిని రవాణా చేయడానికి నౌకలను మోహరించడంతో పాటు, కోవిడ్ పాజిటివ్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ వెటరన్స్ కోసం గజువాకా ఐఎన్ఎస్ ఏకశిలలో 50 పడకల కోవిడ్ కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. నావల్ డాక్యార్డ్ విశాఖపట్నం వద్ద రక్షణ విధులను నిర్వహించే
వారు కోసం మరో 200 పడకల కోవిడ్ కేర్సెంటర్‌ను కూడా ఏర్పాటు చేసింది.
***
(Release ID: 1717896)
Visitor Counter : 130