రక్షణ మంత్రిత్వ శాఖ
రక్షణ శాఖకు చెందిన మెడికల్ ఇ-హెల్త్ సర్వీసుల ముందంజ
Posted On:
10 MAY 2021 7:58PM by PIB Hyderabad
2021 మే 7వ తేదీన ఇ-సంజీవనిపై విజయవంతంగా ప్రారంభించిన ఎక్స్ డిఫెన్స్ ఒపిడి (https://esanjeevaniopd.in/) ఈ రోజు మరింత శక్తివంతం అయింది. రాజస్తాన్ లోని వైద్యసేవలు అవసరం ఉన్న రోగులకు సేవలందించడానికి, తమ మద్దతు అందించడానికి ఎఎఫ్ఎంఎస్ వైద్యులు ముందుకు వచ్చారు. 21 మంది వైద్యులు వారి సమీపంలో వైద్య సేవలు అందుబాటులో లేని రోగులకు ఉచిత కన్సల్టేషన్ సేవలందిస్తున్నారు. త్వరలోనే ఇతర రాష్ర్టాలకు కూడా ఈ సదుపాయాన్ని విస్తరించనున్నారు.
ఇంటిగ్రేటెడ్ రక్షణ సిబ్బంది ప్రధాన కార్యాలయంలోని మెడికల్ బ్రాంచి మొహాలికి చెందిన సి-డాక్ సమన్వయంతో ఇ-సంజీవనిపై ఇ-ఐసియును అభివృద్ధి చేసింది. సాయుధ దళాల మెడికల్ సర్వీసుల డైరెక్టర్ జనరల్ (డిజిఎఎఫ్ఎంఎస్) సర్జన్ వైస్ అడ్మిరల్ రజత్ దత్తా ఈ పోర్టల్ ను ప్రారంభించారు. ఇంటిగ్రేటెడ్ రక్షణ సిబ్బంది (మెడికల్) డిప్యూటీ చీఫ్ లెఫ్టనెంట్ జనరల్ మాధురి కనిట్కర్, సైనిక, నౌకా, వాయు దళాల మెడికల్ సర్వీసుల డిజిలు, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ కోవిడ్ ఆస్పత్రి కమాండెంట్లు, వైద్యులు, దేశవ్యాప్తంగా సాయుధ దళాలు నిర్వహిస్తున్న కోవిడ్ ఆస్పత్రుల వైద్య సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వివిధ ప్రాంతాల్లో సేవలందిస్తున్న వైద్యాధికారులు తమ రోగులకు అందించాల్సిన చికిత్స విషయంలో స్పెషలిస్టు వైద్యాధికారులు, సీనియర్ ఇంటెన్సివిస్టుల నుంచి అతి తక్కువ శ్రమతో అత్యధికంగా సేవలందించగల సలహాలు వాస్తవిక దృక్పథంతో పొందే వీలుంటుంది. దీన్ని హబ్ అండ్ స్పోక్ నమూనాలో నిర్వహిస్తున్నారు. హబ్ లో ఇంటెన్సివిస్టులు, స్పెషలిస్టు వైద్యాధికారులు ఉండి స్పోక్ లలోని వైద్యాధికారులతో మాట్లాడి వారికి సలహాలు అందిస్తారు. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ప్రారంభించిన ఈ చొరవ వల్ల టెక్నాలజీని ఆసరా చేసుకుని స్పెషలిస్టుల కొరతను అధిగమించే వీలు కలుగుతుంది.
***
(Release ID: 1717603)
Visitor Counter : 184