జల శక్తి మంత్రిత్వ శాఖ

జల్ జీవన్ మిషన్ వార్షిక కార్యాచరణ ప్రణాళికను సమర్పించిన - ఝార్ఖండ్


2022 మార్చి నాటికి 7.50 లక్షల ట్యాప్ కనెక్షన్లను అందించాలని యోచిస్తున్న - ఝార్ఖండ్

2024 నాటికి ‘హర్ ఘర్ జల్’ లక్ష్యాన్ని సాధించనున్న - ఝార్ఖండ్

Posted On: 01 MAY 2021 6:36PM by PIB Hyderabad

2021-22 ఆర్థిక సంవత్సరానికి ఝార్ఖండ్ రాష్ట్రం, తమ జల్ జీవన్ మిషన్ వార్షిక కార్యాచరణ ప్రణాళికను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జల్ శక్తి మంత్రిత్వ శాఖ కు చెందిన తాగునీరు, పారిశుద్ధ్య శాఖ కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటైన జాతీయ కమిటీ ముందు సమర్పించింది.  2021-22 ఆర్థిక సంవత్సరానికి, రాష్ట్ర వ్యాప్తంగా 7.50 లక్షల ట్యాప్ కనెక్షన్లను అందించాలని ఝార్ఖండ్ యోచిస్తోంది.  జార్ఖండ్ ప్రభుత్వ తాగునీరు మరియు పారిశుద్ధ్య విభాగం, తమ ప్రణాళికను సమర్పిస్తూ, 2024 నాటికి ‘హర్ ఘర్ జల్’ లక్ష్యాన్ని సాధించాలనే తన నిబద్ధతను పునరుద్ఘాటించింది.

రాష్ట్రంలో మొత్తం 58.95 లక్షల గ్రామీణ కుటుంబాలు ఉండగా, వీటిలో 7.40 లక్షలు (12.6 శాతం) కుటుంబాలకు కుళాయి ద్వారా, మంచి నీటి సరఫరాకు హామీ ఇచ్చారు.  2019 ఆగష్టు నెలలో జల్ జీవన్ మిషన్ (జె.జె.ఎం) ప్రకటించినప్పటి నుండి, 4 లక్షలకు పైగా పంపు నీటి కనెక్షన్లు అందించడం జరిగింది.  ఇప్పటివరకు రాష్ట్రంలో 315 గ్రామాలను మాత్రమే ‘హర్ ఘర్ జల్’ గ్రామాలుగా ప్రకటించారు, అంటే ఈ గ్రామాల్లోని ప్రతి గ్రామీణ కుటుంబానికీ కుళాయిల ద్వారా మంచి నీటి సరఫరా చేస్తున్నట్లు.  ఆశాజనక జిల్లాలు వంటి ప్రాధాన్యత ఉన్న ప్రాంతాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్రాన్ని కోరడం జరిగింది. వీటితో పాటు, 100 రోజుల ప్రచారంలో భాగంగా, పైపులతో నీటి సరఫరాకు, అన్ని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను, ఇతర ప్రాధాన్యతా ప్రాంతాలుగా చేర్చడం జరిగింది. 

గ్రామీణ ప్రాంతాల్లో, కుళాయిల ద్వారా మంచి నీటి సరఫరాకు భరోసా ఇవ్వడానికి, కేంద్ర ప్రభుత్వం, 2020-21 ఆర్ధిక సంవత్సరంలో, ఝార్ఖండ్ కు, 572.24 కోట్ల రూపాయల మేర నిధులు మంజూరు చేసింది. అయితే,  తక్కువ గా నిధులు వినియోగించుకున్న కారణంగా,  రాష్ట్రం, ఇప్పుడు, కేవలం 143 కోట్ల రూపాయలు మాత్రమే వినియోగించుకునే అవకాశం ఉంది.  2021-22 ఆర్థిక సంవత్సరంలో, జల్ జీవన్ మిషన్ కింద వివిధ పనులను చేపట్టడానికి, జార్ఖండ్‌ కు సుమారు, 1,400 కోట్ల రూపాయల మేర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయం (గ్రాంట్) అందనుంది.  ఎం.జి.ఎన్‌.ఆర్‌.ఈ.జి.ఎస్; ఎస్‌.బి.ఎం; పి.ఆర్‌.ఐ.లకు 15వ ఆర్ధిక సంఘం గ్రాంట్లు; సి.ఏ.ఎమ్.పి.ఏ. నిధులు; స్థానిక ప్రాంత అభివృద్ధి నిధులు వంటి,  వివిధ కార్యక్రమాల కలయిక ద్వారా అందుబాటులో ఉన్న అన్ని వనరులనూ, ఒకదానికొకటి కలిపి, జె.జె.ఎం. క్రింద, వినియోగించుకునే ప్రయత్నాలు, జరుగుతున్నాయి.   మురుగు నీటి నిర్వహణ, జల సంరక్షణ కోసం రాష్ట్రాలు తమ అత్యవసర నిధులను ఉపయోగించుకోవాలని కమిటీ సూచించింది.

జార్ఖండ్ నీటి కొరత, నీటి కాలుష్యం సమస్యలను ఎదుర్కొంటోంది.  రసాయన కాలుష్యం కోసం చాలా తక్కువ నీటి వనరుల పై పరీక్షలు నిర్వహించడం పట్ల, అదే విధంగా బ్యాక్టీరియాకు సంబంధించిన కాలుష్యం కోసం 0.31 శాతం మాత్రమే పరీక్షలు నిర్వహించడం పట్ల కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది.  కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత సమయంలో, నీటి కొరత, కాలుష్యం సమస్యలు పరిష్కరించడం చాలా ముఖ్యమైనది.  పరిశుభ్రమైన నీరు మెరుగైన పరిశుభ్రత ను ప్రోత్సహిస్తుంది.  గృహ ప్రాంగణంలో ఒక మంచి నీటి కుళాయి సౌకర్యం ఉంటే బహిరంగ బావులు, పంపుల దగ్గర రద్దీ నివారించబడి, సామాజిక దూరాన్ని పాటించే అవకాశం ఉంటుంది.  అందువల్ల, ప్రతి ఇంటి లో ట్యాప్ కనెక్షన్లను అమర్చడం యొక్క ప్రాముఖ్యతపై రాష్ట్రం సానుకూల నిర్ణయం తీసుకోవాలి.

జల్ జీవన్ మిషన్ కింద, జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో నీటి నాణ్యత పరీక్ష ప్రయోగశాలలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.  అదేవిధంగా, నీటి నాణ్యతను పర్యవేక్షించడానికి సమాజాన్ని ప్రోత్సహించడం జరుగుతోంది.  పి.హెచ్.ఈ. విభాగం సమాజానికి అధికారం ఇవ్వడానికి మరియు పరస్పర చర్యకు వీలు కల్పిస్తుంది.  ఇందుకోసం, సమాజానికి క్షేత్ర పరీక్షా వస్తు సామగ్రిని సకాలంలో సేకరించడం, సరఫరా చేయడం, సమాజ భాగస్వామ్యం కోసం ప్రతి గ్రామంలో, కనీసం ఐదుగురు మహిళలు చొప్పున ఎంపిక చేసి, వారికి శిక్షణ ఇచ్చి, పరీక్షా పరికరాల వాడకం, పరీక్షా ఫలితాలను నివేదించడం కోసం ఒక కార్యాచరణ ప్రణాళికను చేపట్టారు.  2021-22 ఆర్ధిక సంవత్సరంలో 11 కొత్త ప్రయోగశాలలను ఏర్పాటు చేసి, 18 ప్రయోగశాలలకు ఎన్.ఏ.బి.ఎల్. గుర్తింపు నివ్వాలని రాష్ట్రం యోచిస్తోంది. అన్ని జిల్లా స్థాయి ప్రయోగశాలలు గుర్తింపు పూర్తి చేయడానికి ప్రణాళికలు రూపొందించాలని, కమిటీ రాష్ట్రానికి సూచించింది.

రాష్ట్ర, జిల్లా స్థాయిలో వివిధ నిపుణులను (అసిస్టెంట్ ఇంజనీర్లు, జూనియర్ ఇంజనీర్లు, నీటి నాణ్యత నిపుణులు మొదలైనవారు) నిమగ్నం చేయాలని రాష్ట్రం యోచిస్తోంది.   దీనికి తోడు, ఇంజనీరింగ్ విభాగంలో (సూపరింటెండెంట్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్), బ్లాకు స్థాయి అధికారులు, వి.డబ్ల్యు.ఎస్.సి. సభ్యులు, స్వచ్చా గ్రాహులు, నెహ్రూ యువ కేంద్రంతో పాటు స్వయం సహాయక బృందం సభ్యులు మొత్తం 7,837 మందికి శిక్షణ ఇచ్చి, సామర్థ్యం పెంపొందించాలని, కూడా రాష్ట్రం భావిస్తోంది. ఇంకా, ఈ ప్రణాళిక ప్రకారం, 2021-22 ఆర్ధిక సంవత్సరం లో, 3,600 మంది స్థానిక వ్యక్తులకు ప్లంబర్, పంప్ ఆపరేటర్, ఎలక్ట్రీషియన్లు గా నైపుణ్యం పొందుతారు.  ఈ శిక్షణ పొందిన శ్రామికులు శక్తి నీటి సరఫరా మౌలిక సదుపాయాలను నిర్మించడానికి ఉపయోగించబడుతుంది.గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పెంచడంలో, ఈ ప్రాంతంలోని యువతకు ఉపాధి కల్పించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.

ప్రతి గ్రామానికి గ్రామ కార్యాచరణ ప్రణాళిక (వి.ఏ.పి) అభివృద్ధి మరియు గ్రామ జల, పారిశుద్ధ్య కమిటీ (వి.డబ్ల్యు.ఎస్.సి) ఏర్పాటుపై మిషన్ దృష్టి సారిస్తుంది. తద్వారా దీర్ఘకాలంలో గ్రామస్తులకు 'హర్ ఘర్ జల్' కార్యక్రమం కింద సృష్టించబడిన నీటి సరఫరా మౌలిక సదుపాయాలను వినియోగించి మరియు నిర్వహించడానికి, గ్రామస్థులకు అధికారం ఉంటుంది.    ప్రణాళిక మరియు నీటి సరఫరా కార్యక్రమాల అమలుకు సంబంధించి రాష్ట్రం అనుసరించే క్షేత్ర స్థాయి విధానాన్ని ఇది నిర్ధారిస్తుంది.  సమాజిక ప్రాతినిధ్యం ద్వారా, గ్రామాల్లో / ఆవాసాల్లో సృష్టించబడిన వనరుల పర్యవేక్షణ, నిఘా, సంరక్షణ బాధ్యతలను, పంచాయతీలకు, ప్రజలకు అప్పగిస్తారు.  జార్ఖండ్ ఇప్పటివరకు 19,363 వి.డబ్ల్యూ.ఎస్.సి. లను ఏర్పాటు చేసింది, కాగా, 2021-22 ఆర్ధిక సంవత్సరంలో మరో 10,389 వి.డబ్ల్యూ.ఎస్.సి. లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.  ఇప్పటివరకు 1,264 గ్రామ కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయబడ్డాయి. కాగా ఈ  సంవత్సరానికి మరో 28,488 వి.ఏ.పి. లను రూపొందించాలని ప్రతిపాదించారు. 

రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలతో వార్షిక కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడం కోసం, తాగునీరు, పారిశుద్ధ్య శాఖ కార్యదర్శి అధ్యక్షతన జాతీయ కమిటీతో పాటు వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు / విభాగాలు, నీతీ ఆయోగ్ కు చెందిన ఇతర సభ్యులు కృషి చేస్తున్నారు.   ప్రతిపాదిత వార్షిక కార్యాచరణ ప్రణాళిక (ఏ.ఏ.పి) లను ఖరారు చేసే ముందు, వాటిని నిశితంగా పరిశీలించే ప్రక్రియను చేపట్టడం జరిగింది.  మిషన్ నిర్దేశించిన లక్ష్యం ప్రకారం కార్యక్రమాన్ని సకాలంలో అమలు చేసే విధంగా నిర్ధారించేందుకు, సాధారణ క్షేత్ర సందర్శనలతో పాటు త్రైమాసిక సమీక్షా సమావేశాల ఆధారంగా, ఏడాది పొడవునా నిధులు విడుదల చేయడం జరుగుతుంది.

జల్ జీవన్ మిషన్ - 2024 నాటికి ప్రతి గ్రామీణ గృహాల్లో పంపు నీటి కనెక్షన్‌ను అందించే లక్ష్యంతో రాష్ట్రాల భాగస్వామ్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన కార్యక్రమం.  మిషన్ కింద, 2021-22 లో, జె.జె.ఎమ్. కోసం 50,011 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపుల తో పాటు, 15వ ఆర్ధిక సంఘం కింద 26,940 కోట్ల రూపాయల మేర భరోసా నిధులు కూడా అందుబాటులో ఉన్నాయి.  బాహ్య సహాయం తో పాటు రాష్ట్ర నిధుల ప్రాజెక్టులు కూడా అందుబాటులో ఉన్నాయి.  ఈ విధంగా, 2021-22 ఆర్ధిక సంవత్సరంలో, గ్రామీణ గృహాలకు కుళాయిల ద్వారా మంచి నీటి సరఫరా చేయడం కోసం  పంపు నీటి సరఫరా ఉండేలా దేశంలో ఒక లక్ష కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టాలని యోచిస్తున్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పెంపొందించడంలో, యువతకు ఉపాధి కల్పించడంలో, మహిళలు మరియు బాలికల దురదృష్టాన్ని (వెట్టి చాకిరీ ని) తొలగించడంతో పాటు గ్రామీణ భారతదేశానికి ఒక వరంగా పరిణమించే ఇటువంటి కార్యక్రమానికి భారీగా ఈ పరిమాణంలో పెట్టుబడి పెట్టడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

******


(Release ID: 1715498) Visitor Counter : 122


Read this release in: English , Urdu , Hindi