ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
మూడోదశ కోవిడ్ వాక్సినేషన్ వ్యూహంపై వ్యక్తమైన ఆందోళనలపై సమాధానమిచ్చిన కేంద్ర మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్
ప్రజారోగ్య కార్యక్రమాన్ని గాడితప్పించేందుకు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారని విమర్శ.
ప్రస్తుత సమయంలో కావలసింది, ఉన్నత స్థాయి ఉమ్మడి ఆదర్శమని ప్రకటన.
Posted On:
25 APR 2021 11:05PM by PIB Hyderabad
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ ఈరోజు కొందరు ఇటీవల ప్రకటించిన సరళీకృత వేగవంతమైన మూడోదశ కోవిడ్ -19 వాక్సినేషన్ వ్యూహంపై వ్యక్తం చేసిన ఆందోళనలకు సమాధానమిచ్చారు. దేశంలో చికిత్స, వాక్సిన్‌లకు సంబంధించి కొందరు ఆరోపిస్తున్నట్టు కొరత ఏదీ లేదని, ఈ విషయంలో విశ్వాస సంక్షోభం అవసరంలేదని అన్నారు. కొరత లేదు కనుక ఆ అవసరమే లేదన్నారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో ప్రతి ఒక్కరూ ఉన్నతస్థాయి ఉమ్మడి ఆదర్శాలను కలిగి ఉండడం అవసరమని ఆయన అన్నారు.
మే 1 నుంచి ప్రారంభం కానున్న 3 వ విడత వాక్సినేషన్ కు సంబంధించిన నూతన విధానంపై కొన్ని వర్గాల నుంచి వచ్చిన విమర్శలపై వ్యాఖ్యానిస్తూ ఆయన, “ వాక్సినేషన్ వంటి కార్యక్రమంపై కొందరు అర్దరహితమైన రీతిలో రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. మన వాక్సిన్ సమర్దత పై కానివ్వండి, లేదా ధరల విషయం కానివ్వండి, వీరు ప్రతి అడుగులోనూ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు- అని ఆయన అన్నారు.
ఆయన తన బ్లాగ్ లో పేర్కొన్న విషయాన్ని కింద గమనించగలరు.
మనం ఉన్నత స్థాయి ఉమ్మడి ఆదర్శాన్నికలిగి ఉండాలి.
ప్రభుత్వవం సరళీకృత వేగవంతమైన 3 వ దశ కోవిడ్ -19 వాక్సినేషన్ వ్యూహాన్ని చేపట్టనున్నట్టు ప్రకటించింది. దీనవల్ల 18 సంవత్సరాలు నిండిన వారు ఎవరైనా కోవిడ్ -19 వాక్సిన్ వేయించుకోవడానికి అర్హులు.
ఏ యుద్దంలో అయినా సమయం చాల కీలకమైది. ఒకవైపు కోవిడ్ మహమ్మారి సునామిలాగా వ్యాప్తి చెందుతుంటే నియంత్రణలను ఎత్తివేసి రాష్ట్రప్రభుత్వాలకు , ప్రైవేటు రంగానికి స్వేచ్ఛనివ్వడం సంక్లిష్టమైనది. అందువల్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మొదీ గారి సమర్ధ నాయకత్వంలో వాక్సినేషన్ కార్యక్రమానికి సంబంధించిన విధానపరమైన నిబంధనలను సులభతరం చేయాలని నిర్ణయించాం.
అయినప్పటికీ, ఇంతటి కీలకమైన వాక్సినేషన్ దశపై తప్పుడు సమాచారాన్ని వ్యాపించేందుకు కొందరు ప్రయత్నిస్తుండడం దురదృష్టకరం. ఇందుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను నేను ప్రజలుమందు ఉంచదలచాను. ప్రపంచంలోనే అతిపెద్ద వాక్సినేషన్ కార్యక్రమాన్ని గాడితప్పించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు వీటిని మీముందుంచుతున్నానని ఆయన చెప్పారు. ఇప్పటివరకు 14 కోట్ల వాక్సిన్ డోసులను రాష్ట్రాలలో వేయడం జరిగింది. మరో కొ్ది కోట్ల వాక్సిన్ డోస్‌ల స్టాక్ ఉంది. ఇప్పటివరకూ ఈ డోస్‌లన్నీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఉచితంగానే ఇచ్చింది.
కొత్త విధానం కింద, మూడవ దశ ప్రారంభమయ్యే 2021 మే 1 తర్వాత కూడా ఉచిత పంపిణీకి భారత ప్రభుత్వ ధరలు కొనసాగుతాయి. ఇప్పటివరకూ చేసినట్టుగానే కేంద్రం వాక్సిన్ డోస్‌లను తన 50 శాతం కోటా నుంచి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉచితంగా సరఫరా చేస్తుంది.ఈ వాక్సిన్‌లను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వేస్తాయి.
మిగిలిన 50 శాతంపై పలు ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది. అంటే దాని అర్థం ఏమిటి? అందుకే నేను ఆ 50 శాతం కోటా కు సంబంధించి వివరణ ఇవ్వాలని నిర్ణయించాను. ఈ 50 శాతం కోటా రాష్ట్రాలకు వెసులు బాటు కలిగిస్తుంది. చాలా రాష్ట్రాలు తమ రాష్ట్రాలు వాక్సినేషన్ కార్యక్రమాన్ని తమకు ఓపన్ అప్ చేయమని కోరుతున్నాయి.ఇప్పుడు ఈ మిగిలిన 50 శాతం కోటా వారు ప్రాధాన్యత అను కున్న వర్గాలకు వేసేందుకు వీలు కల్పిస్తుంది.
నిజానికి ఆరోగ్యం రాష్ట్ర అంశం. ఇక్కడ కేంద్రం రాష్ట్రాలతో సమన్వయం చేస్తూ పనిని సులభతరం చేస్తుంది. దాదాపుగా అన్ని రాష్ట్రాలనుంచి మాకు వాక్సిన్ పంపిణీ విధానాన్ని సరళీకృతం చేయాల్సిందిగా , నియంత్రణలను రాష్ట్రాలకు విడిచిపెట్టాల్సిందిగా విజ్ఞప్తులు అందడంతో మేం ఆ రకంగా ముందుకు వెళ్లడానికి నిర్ణయించాం.
మిగిలిన 50 శాతం కోటా కార్పొరేట్, ప్రైవేట్ రంగానికి వాటి వనరులను వినియోగం లోకి తేవడానికి ఓపెన్ అవుతుంది.
ఇది దేశంలోని ప్రతి ఒక్క వయోజనుడికి వీలైనంత త్వరగా వాక్సినేషన్ వేయించేందుకు టీమ్ ఇండియా ఉమ్మడి కృషిని వినియోగించడానికి వీలు కలుగుతుంది.
భారత ప్రభుత్వం ద్వారా జరిగే వాక్సినేషన్ ప్రక్రియ ముందులాగే కొనసాగుతుంది. ఇందుకు సంబంధించిన మొత్తం ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఈ విధానంలో వాక్సిన్ వేయించుకునేందుకు అర్హతలు మరింత అభివృద్ధి చెందనున్నాయి. భౄరత ప్రభుత్వం అర్హులైన వారందరికీ ఉచితంగా వాక్సిన్ వేయించేందుకు రాష్ట్రాలకు పూర్తి మద్దతు నివ్వనుంది.
ప్రైవేటు, కార్పొరేట్ రంగ మార్గం వల్ల ప్రభుత్వ మార్గంలో కాకుండా పెద్ద సంఖ్యలో ప్రజలు త్వరగా వాక్సిన్ వేయించుకోవడానికి వీలు కలుగుతుంది. మొత్తం మీద, వాక్సిన్ వేయించుకోవడానికి అయ్యే ఖర్చును భరించగలిగిన వారు ప్రైవేటు, కార్పొరేట్ రంగ రేట్లతో ముందుకు వెళ్లవచ్చు.
భారతప్రభుత్వ ఉచిత మార్గంలో లేదా ప్రయివేట్ రూట్‌లో వాక్సిన్ వేయించుకోని వారికి
రాష్ట్రాలు తమ స్వంత ప్రాధాన్యతలు, వాటి హామీలకు అనుగుణంగా వాక్సిన్ వేయించవలసి ఉంటుంది.
సామాన్య ప్రజలు వాక్సిన్ అనేది తమకు ఏమాత్రం భారం కాకుండా చాలావరకు ఉచితంగా వాక్సిన్ వేయించుకునే వీలుంది.
కేంద్ర ప్రభుత్వం వాక్సిన్‌ను ఎవరికీ నేరుగా ఇవ్వదన్నవిషయం పునరుద్ఘాటించడం జరుగుతోంది. ప్రభుత్వ ధరల కోటా కింద
50 శాతం కోటా ఉచిత పంపిణీకి నిర్దేశించినది. ఈ పంపిణీ అంతా రాష్ట్రాల ద్వారానే జరుగుతుంది. అందువల్ల కేంద్రం తక్కువ ధరకు తీసుకుంటుందని, రాష్ట్రాలకు లభించడం లేదనేది పూర్తిగా అవాస్తవం.
వాస్తవం ఏమంటే, రాష్ట్రాలు ఉచిత వాక్సిన్ సరఫరాను గ్యారంటీ కలిగిన ఛానల్ ద్వారా పొందుతున్నాయి. మరోవైపు ఇవి ఇతర మార్గాలలో వాటి అవసరాలు, ఆకాంక్షలు హామీలకు అనుగుణంగా ప్రజలకు వాక్సిన్ వేయడానికి వాక్సిన్‌ను సమకూర్చుకోవచ్చు.
ఈ విషయంలో రాష్ట్రాలు ఫిర్యాదు చేయడం ఎందుకో అర్ధం కాదు.వాక్సిన్ సరఫరాకు సంబంధించి ఆంక్షలను ఎత్తి వేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కొత్త విధానం కింద వారు నేరుగా తయారీదారునుంచి , వారు సమకూర్చుకోదలచుకున్న వాక్సిన్ డోసుల సంఖ్యను బట్టి వారితో ధర విషయం లో వారిని సంప్రదించవచ్చు. ఇది జాప్యాలను నిలువరిస్తుంది.
రాష్ట్రాల పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. వారు కోవిడ్ పై పోరాటాన్ని ముందుండి ఎదుర్కొంటున్నారు. వారికి వాక్సిన్ స్టాక్‌లు త్వరగా అందాలి. ఎప్పుడు, ఎవరికి ఎలా ఎంతమందికి వాక్సిన్ వేయాలన్నది వారు నిర్ణయించుకోవలసి ఉంది. కేంద్రం ఈ ప్రక్రియను సులభతరం చేయడం ద్వారా ఖచ్చితంగా దీనినే చేసింది.
వాస్తవానికి, ఈ చొరవకు రాష్ట్రాల స్పందన కూడా సంతోషకరంగా ఉంది. అస్సాం, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, జార్ఖండ్, జమ్ముకాశ్మీర్, తమిళనాఉ, హిమాచల్ ప్రదేశ్, కేరళ, ఛత్తీస్‌ఘడ్, హర్యానా, కేరళ, సిక్కిం, పశ్చిమబెంగాల్, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, తదితర రాష్ట్రాలు ఇప్పటికే తాము 18-45 సంవత్సరాల మధ్యగల వారికి ఉచితంగా వాక్సిన్ వేయిస్తామని ప్రకటించాయి. ఇది స్వాగతించవలసిన విషయం. కొత్త సరళీకృత విధానం కింద, వారికి ఇలా చేయడానికి పూర్తి స్వేచ్ఛ ఉంది.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ నాయకత్వంలో భారతప్రభుత్వం కోవిడ్ -19మహమ్మారి పై పోరాటాన్ని సమర్ధంగా , ముందుకు తీసుకుపొవడానికి ప్రజారోగ్య బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తించడానికి కట్టుబడి ఉంది. ప్రజారోగ్య కార్యకర్తలు, వ్యాధిబారిన పడేందుకు అవకాశం కలిగిన వారు, సీనియర్ సిటిజన్లు 45 సంవత్సరాలకు పైబడిన వారికి ముందు ప్రాధాన్యత నివ్వడం జరిగింది. వాక్సినేషన్ ప్రక్రియను ప్రస్తుతం తదుపరి దశకు తీసుకెళ్లడం జరిగింది. అలాగే రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలు, కార్పొరేట్, ప్రైవేట్ రంగ పాత్రను విస్తరింపచేయడం జరిగింది. తయారీదారులకు మద్దతు నివ్వడం కూడా జరిగింది. వీరికి ఉత్పత్తి పెంచడానికి ఆర్థిక మద్దతునివ్వడం జరిగింది. టీమ్ ఇండియా ఉమ్మడిగా కలిసి సాగిస్తున్న పోరాటం ఇది. ఈ పోరాటంలో మనం కలసి కట్టుగా విజయంసాధిస్తాం.
బాధాకరమైన విషయం ఏమంటే, కొద్దిమంది రాజకీయనాయకులు, వాక్సినేషన్‌పై అనవసర రాజకీయాలు చేస్తున్నారు. వీరు ప్రతి దశలో అది ధరల గురించి కానీ లేదా సమర్ధత గురించి కానీ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారు.
అందువల్ల రాజకీయపార్టీలకు నా విజ్ఞప్తి ఏమంటే, వాక్సిన్ కార్యక్రమ విజయాన్ని రాజకీయాలకు , ఇతరేతర వాటికి అతీతంగా చూడమని విజ్ఞప్తి చేస్తున్నాను.అప్పుడు మనం మన ప్రజలను కాపాడు కోగలుగుతాం.
నేను ఈ సందర్భంగా ఒక విషయాన్ని పునరుద్ఘాటించాలి. నిర్మాణాత్మక విమర్శను నేను ఎప్పుడూ స్వాగతిస్తాను. ఎందుకంటే ఇది స్పష్టమైన, కార్యాచరణకు అనువైన సూచనలతో కూడిన ప్రతిస్పందనలు ఉపయుక్తకరంగా ఉంటాయి.
ఈ కోవిడ్ మహమ్మారి సమయంలో అతి పెద్ద విజయం , టీమ్ వర్క్. వ్యక్తిగత కీర్తిని పక్కన పెట్టి ప్రజలు సరైన ఫలితం సాధించేందుకు కృషి కొనసాగిస్తున్నారు.శాస్త్రవేత్తలు, సంస్థలకు చెందిన వారు అర్థవంతమైన లక్ష్యాల సాధనపై దృష్టిపెడుతున్నారు. ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్నది. అలాగే ఆసియా ఖండంలోనూ జరుగుతున్నది. అందువల్లే మనకు ఈ అత్యంత ప్రమాదకరమైన వ్యాధిపై పోరాటానికి పలు వాక్సిన్‌లు అందుబాటులోకి వచ్చాయి.
విశ్వాస సంక్షోబానికి తావులేదు. చికిత్స సదుపాయాల కొరత గురించి లేదా వాక్సిన్ గురించి విశ్వాసం కోల్పోనవసరం లేదు.
అలాంటిదేమీ లేదు.
మనమందరం అర్థం చేసుకోవలసినదేమంటే, ఈ మహమ్మారి ద్వారా తెలుస్తున్నది, రాగల రెండు దశాబ్దాలలో మరిన్ని ఆరోగ్య రంగ సవాళ్లను ఎదుర్కొనవలసి ఉంటుందని. అదేసమయంలో ఈ మహమ్మారి మనకు బోధించినది కూడా ఉంది. అన్ని
సవాళ్లకు కూడా ఉమ్మడి స్పందన అవసరం. ఎందుకంటే, ఇవన్నీ ఉమ్మడి ముప్పులు. వీటిపై చర్యలకు ఉమ్మడి బాధ్యతలు అవసరం. ప్రస్తుత సమయంలో కావలసింది ఉన్నత స్థాయి ఉమ్మడి ఆదర్శాలు.
***
(Release ID: 1714188)
Visitor Counter : 218