ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
అమెజాన్ సంభవ్ ఆన్‌లైన్ సమ్మేళనాన్ని ఉద్దేశించి ప్రసంగించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
కోవిడ్ అనంతర కాలంలో మొత్తం భారత ఉపఖండానికి వ్యాపారగమ్యస్థానంగా ఈశాన్య ప్రాంతం రూపుదిద్దుకోనుంది : డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
16 APR 2021 5:18PM by PIB Hyderabad
కోవిడ్ అనంతర భారత దేశ ఆర్ధిక వ్యవస్థ, ఇంతకుముందు వినియోగించుకోని ప్రాంతాల సామర్ధ్యాలను వినియోగించుకునే దిశగా చూస్తుందని, ఇలాంటి పరిస్థితులలో ఇప్పటివరకు తక్కువ వనరులు ఉపయోగించుకున్న ప్రాంతాలు, పెద్దగా దృష్టిపడని ప్రాంతాలు కీలక భూమిక పోషించనున్నాయని, ఈశాన్య ప్రాంత అభివృద్ది శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర చార్జి), ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు , పెన్షన్, అణుశక్తి, అంతరిక్షశాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.
ఇందుకు సంబంధించి ఆయన ఈశాన్య రాష్ట్రాల వెదురు ఉదాహరణను ప్రస్తావించారు. మొత్తంగా ఇతర రాష్ట్రాలలో ని విస్తారమైన వనరుల గురించి ఆయన ప్రస్తావించారు.
అమెజాన్ సంభవ్ ఆన్‌లైన్ సమ్మిట్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన, ఇండియాకుగల అనంత అవకాశాలను అందిపుచ్చుకోవాలని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ప్రతి అననుకూలతలోనూ ఏదో ఒక సానుకూల అవకాశం ఉంటుంది. కోవిడ్ మహమ్మారి సంక్షోభమూ మనం కొత్త అవకాశాలను , వినూత్న సామర్ధ్యాలను, ఆర్ధిక వ్యవస్థ నిలదొక్కుకోడానికి కొత్త వనరుల కోసం చూసి లోటును భర్తీ చేసుకోవడానికి మనల్ని సిద్ధం చేసిందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో ఈశాన్య ప్రాంతం మొత్తం భారత ఉపఖండానికే వ్యాపారగమ్యస్థానంగా ఎదిగేందుకు అవకాశం ఏర్పడింది.
అమెజాన్ నూతన చొరవ అయిన నార్త్ ఈస్ట్ స్పాట్‌లైట్ కార్యక్రమాన్ని డాక్టర్ జితేంద్ర సింగ్ అభినందించారు. కోవిడ్ అనంతర ఆర్ధికవ్యవస్థను ముందుకు తీసుకుపోవడానికి భారతదేశ వ్యాపార ప్రపంచం కూడా తాను ఎక్కడ చూడాలన్నది తెలసుకుంటున్నదనడానికి ఇది నిదర్శనమని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా తెలిసిన అన్ని సాంప్రదాయ వనరులు సామర్థ్యాలు గరిష్ఠంగా వినియోగానికి గురైనట్టు లేదా అయిపోయినట్లు కనిపించినప్పుడు, ఈశాన్యప్రాంతం మాత్రం వనరులతో అలరారుతున్నది. ఇది రాగల కాలంలో ఇది కీలక పాత్ర పోషించనుంది అని ఆయన అన్నారు.
ప్రస్తుత పరిస్థితిని కేంద్రంలోని శ్రీ నరేంద్ర మోదీప్రభుత్వం జాగ్రత్తగా గమనిస్తున్నదని డాక్టర్ జితేంద్రసింగ్ అన్నారు. అందువల్లే,వంద సంవత్సరాల నాటి ఇండియన్ ఫారెస్ట్ చట్టాన్ని సవరించి ఇళ్లల్లో పెంచిన వెదురును అటవీ చట్ట నిబంధనల నుంచి మినహాయించడం జరిగింది. అలాగే వెదురుపై దిగుమతి సుంకాన్ని పెంచడం ద్వారా దేశీయ వెదురు ఉత్పత్తులను ప్రోత్సహించడం జరిగింది.
కోవిడ్ అనంతర కాలంలో, వివిధ భాగస్వాములు, విధాన రూపకర్తలు చిన్న ,మధ్య తరహా వ్యాపారాలపైన అలాగే కొత్త లేదా ఇటీవలి స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టిపెట్టాల్సి వచ్చింది. కోవిడ్ వల్ల ఎదురవుతున్న ఇలాంటి సంక్షోభ సమయంలో తిరిగి గాడిన పడడానికి సంయుక్త చొరవలు, సంయుక్త వెంచర్లు తప్పని సరి అని ఆయన అన్నారు.
***
(Release ID: 1712338)
Visitor Counter : 154