ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఈశాన్య ప్రాంతంలో మహిళా వ్యవస్థాపకత కు గొప్ప సంప్రదాయం ఉంది : కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
వెదురు పరిశ్రమ లో మహిళా వ్యవస్థాపకత ను ప్రోత్సహించాలని, ఎఫ్.ఐ.సి.సి.ఐ.-ఎఫ్.ఎల్.ఓ. కి పిలుపు
నాడు పోస్టు చేయడమైనది:
15 APR 2021 6:53PM by PIB Hyderabad
నూతన భారతావని నిర్మాణంలో ఈశాన్య ప్రాంతం ప్రధాన పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని, కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి (డి.ఓ.ఎం.ఈ.ఆర్) శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), పి.ఎమ్.ఓ.; సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, అణుశక్తి, అంతరిక్షం శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, ఈ రోజు ఇక్కడ మాట్లాడుతూ పేర్కొన్నారు.
భారత వాణిజ్యం, పరిశ్రమల మండలి సమాఖ్య (ఫిక్కీ)-ఎఫ్.ఎల్.ఓ. ఆన్-లైన్ లో నిర్వహించిన 37వ వార్షిక సదస్సులో భాగంగా ‘సుస్థిర జీవనోపాధి : నూతన భారతావని కోసం మహిళా సంస్థల్లో పెట్టుబడి" అనే అంశంపై డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ఈశాన్య ప్రాంతంలో మహిళా వ్యవస్థాపకత కు గొప్ప సంప్రదాయం ఉందనీ, అదేవిధంగా, మహిళల స్వయం సహాయక బృందాలు (ఎస్.హెచ్.జి.లు) విషయంలో కూడా ఈశాన్య ప్రాంతం ఎల్లప్పుడూ ముందజలో నే ఉంది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొద్ది సంవత్సరాల తరువాత, అంటే, 1950 దశకంలో, అస్సాం రాష్ట్రం మొట్టమొదటిసారిగా మహిళా మండలి ని స్థాపించిందనీ, ఇది వాస్తవానికి ఇతర రాష్ట్రాలు అనుసరించడానికి మార్గం సుగమం చేసిందనీ, ఆయన గుర్తు చేశారు. ఈ రోజున, వివిధ ఈశాన్య రాష్ట్రాల్లో ‘నాగా మదర్ అసోసియేషన్’ వంటి అనేక శక్తివంతమైన మహిళా సమూహాలు ఉన్నాయి, ఇవి జీవనోపాధికీ, ఆర్థిక సాధికారత కూ దోహదం చేస్తున్నాయి.
డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ఈశాన్య ప్రాంతం, సాంప్రదాయకంగా అత్యంత విముక్తి పొందిన మహిళా సమాజానికి ప్రసిద్ది చెందిందనీ, అక్కడి మహిళా జానపదులు ధైర్యవంతులుగానే కాక, అదే సమయంలో వారి విధానంలో నూతనత్వం మరియు దూరదృష్టి కూడా ఉన్నాయని, పేర్కొన్నారు. ఈ ప్రాంతం అల్లడం, నేయడం మరియు హస్తకళలకు ఈ ప్రాంతం నిలయమని, ఆయన చెప్పారు. కోవిడ్ మహమ్మారి ప్రారంభ వారాల్లో, ఈశాన్య ప్రాంతం మినహా దేశంలోని అన్ని ప్రాంతాల నుండి ఫేస్-మాస్క్‌ల కోసం డిమాండ్ ఉన్నప్పుడు, ఈ విషయం స్పష్టమయిందనీ, ఎలా అంటే, మహిళా స్వయం సహాయక బృందాలు ఫేస్-మాస్క్ లను తగినంత సంఖ్యలో మరియు పరిమాణంలో మాత్రమే కాకుండా, ధరించే వస్త్రధారణతో సరిపోయేలా వైవిధ్యమైన మరియు అందమైన డిజైన్ల లో కూడా అందుబాటులో సిద్ధం చేశాయనీ, ఆయన వివరించారు.
ఈశాన్య ప్రాంతంలో వ్యవస్థాపకతకు, మోదీ ప్రభుత్వం, ప్రత్యేక ప్రోత్సాహాన్ని ఇస్తోందనీ, వెదురు వాణిజ్యం, వాణిజ్యం రంగంలో పెద్ద ఎత్తున అడుగులు వేయాలని కోరినట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. వెదురు పరిశ్రమలో మహిళా వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి ఫిక్కీ-ఎఫ్.ఎల్.ఓ. వంటి మహిళా సంస్థలు ముందుకు వచ్చి సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగత జోక్యంతో, స్థానికంగా సాగు చేసిన వెదురుకు ఆదాయపన్ను నుండి మినహాయింపు ఇవ్వడానికి వీలుగా, వంద సంవత్సరాల నాటి భారతీయ అటవీ చట్టాన్ని సవరించడంతో పాటు, దేశీయ వెదురు ఉత్పత్తులను ప్రోత్సహించడానికి వెదురు ఉత్పత్తులపై దిగుమతి సుంకం పెంచామని ఆయన తెలియజేశారు.
ఈశాన్య ప్రాంతం - భారతదేశానికి కొత్త ఇంజిన్ అని ప్రధానమంత్రి శ్రీ మోదీ అభివర్ణించారని, డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొంటూ, కోవిడ్ అనంతర కాలంలో, ఈశాన్య ప్రాంతంలో వెలికిరాని వనరుల సామర్థ్యం, దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుందని, ఆయన అన్నారు. ఈశాన్య ప్రాంతం, ఈ రోజున భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలకు, ఏవిధంగా ఆదర్శంగా నిలిచిందో, అదే విధంగా, ఈశాన్య ప్రాంతానికి చెందిన మహిళలు కూడా భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లోని తమ మహిళా సహచరులకు ఆదర్శంగా నిలుస్తారని, ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
<><><>
(రిలీజ్ ఐడి: 1712184)
సందర్శకుల సూచీ సంఖ్య : : 155