నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ

ఈశాన్య ప్రాంతంలో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 3.0 అమలును వేగవంతం చేయడానికి స్కిల్ ఇండియా మొట్టమొదటిసారిగా ప్రాంతీయ వర్క్‌షాప్‌ను నిర్వహించింది

Posted On: 08 APR 2021 5:09PM by PIB Hyderabad

ఈశాన్య రాష్ట్రాల ప్రాంత (ఎన్ఈఆర్) యువతకు పరిశ్రమ-సంబంధిత నైపుణ్యాల్లో శిక్షణతో వారి ఉత్పాదకతను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలను ప్రారంభించింది.  ఆర్థిక వ్యవస్థకు తోడ్పడేలా కేంద్రం నైపుణ్య అభివృద్ధి  వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ (ఎంఎస్‌డిఇ) ఈ రోజు సిక్కిం రాజధాని గాంగ్టక్ లో మొట్టమొదటిసారిగా ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన (పీఎంకేవైవై) 3.0 ప్రాంతీయ వర్క్‌షాప్ నిర్వహించింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరం నాగాలాండ్  త్రిపుర సహా మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లోని రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి మిషన్లు (ఎస్ఎస్డిఎంలు)  జిల్లా నైపుణ్య కమిటీల (డిఎస్సి) ముఖ్య సిబ్బంది వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు. ఉత్తమ విధానాలను నేర్చుకోవడం  ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 3.0 కు సంబంధించిన సవాళ్లను అర్థం చేసుకోవడం, సాంకేతిక వేదిక స్కిల్ ఇండియా పోర్టల్ (సిప్) ఉపయోగించుకోవడం వంటి అంశాలను ఈ సందర్భంగా నేర్పించారు. ఈ వర్క్‌షాపుకు కేంద్ర / రాష్ట్ర అధికారులు వచ్చారు.

సిక్కిం నైపుణ్య అభివృద్ధి శాఖ సలహాదారు  సతీష్ చంద్ర రాయ్, ఎంఎస్ఎస్డీఏ కార్యదర్శి  ప్రవీణ్ కుమార్,  ఎంఎస్ఎస్డీఏ అదనపు కార్యదర్శి  అతుల్ కుమార్ తివారీ, ఎంఎస్ఎస్డీఏ ఎండీ, సీఈఓ  డాక్టర్ మనీష్ కుమార్,  డైరెక్టర్ (నైపుణ్య అభివృద్ధి), సిక్కిం నైపుణ్య అభివృద్ధి శాఖ కార్యదర్శి గంగా దేవి ప్రధాన్ తదితరులు పాల్గొన్నారు. వివిధ పారిశ్రామిక శిక్షణా సంస్థలు (ఐటిఐలు) కూడా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వర్క్‌షాప్‌కు హాజరయ్యాయి.

 ఈ సందర్భంగా ఎంస్డీఈ కార్యదర్శి  ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, “మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ ‘ యాక్ట్ ఈస్ట్ ’ విధానంలో ఈశాన్య ప్రాంత సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈశాన్య భారతదేశంలోని యువతను పరిశ్రామిక శక్తిగా మార్చడానికి ఎనిమిది రాష్ట్రాలలో పిఎమ్‌కెవివై 3.0ను అమలు చేస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. మొత్తం ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల్లోని యువతలో  నైపుణ్యాల అభివృద్ధి కోసం నేటి వర్క్‌షాప్ జరుగుతోంది.  ఫలితంగా ఇక్కడ యువత ఉద్యోగాలను చేపట్టేందుకు సిద్ధమవుతారు. స్థానిక అధికారులు ఎదుర్కొంటున్న అవరోధాలను,  కీలకమైన విధానాలను అర్థం చేసుకోవడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. ఫలితంగా మరింత మెరుగైన పీఎంకేవైY 4.0 పథకాన్ని అభివృద్ధి చేయడానికి మాకు వీలువుతుంది”అని వివరించారు.

సిక్కిం నైపుణ్య అభివృద్ధి శాఖ కార్యదర్శి గంగా దేవి ప్రధాన్ మాట్లాడుతూ “ఈశాన్య రాష్ట్రాలు వాటి సహజ, వ్యవసాయ-వాతావరణ వనరులు, విభిన్న సంస్కృతి  స్థానిక వర్తకాలు ప్రత్యేకమైనవి. అందువల్ల ఇక్కడి యువతకు పీఎంకేవైని అమలు చేయడానికి ఎస్ఎస్‌డిఎంల,  డిఎస్‌సిల మద్దతు బాగా అవసరం. ఈ వర్క్‌షాప్ విజయవంతం కావడానికి వారి అభిప్రాయాలు, ఆలోచనలు చాలా ముఖ్యం.  మనమందరం ఈ కార్యక్రమంలో భాగస్వాములం కావాలి. ఈశాన్య ప్రాంత  కళలు,  చేతివృత్తులు,  సంస్కృతిని ప్రోత్సహించడమే కాకుండా,  నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని సృష్టించడానికి తగిన వ్యవస్థను ప్రోత్సహించడానికి ప్రభుత్వ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడం చాలా అవసరం”అని ఆమె వివరించారు.

రోజంతా నిర్వహించిన ఈ వర్క్‌షాప్‌లో వివిధ పథకాలు,  కార్యక్రమాలు, నిర్వహణ విధానాలు,   ప్రక్రియలు, మెరుగైన మౌలిక సదుపాయాలు, స్థానికంగా ఉండే సవాళ్లపై చర్చించారు. మొత్తం ఎనిమిది రాష్ట్ర బృందాలతో సమగ్ర చర్చ జరిగింది.   ఆయా రాష్ట్రాల అధికారులు తమ విలువైన సలహాలను అందించారు.  ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 3.0 ను  అప్రెంటిస్ షిప్ ప్రమోషన్ స్కీమ్ (ఎన్ఎపిఎస్), జన్ శిక్షణ్ స్థాన్ (జెఎస్ఎస్), ఐటిఐలతో కలపడంపైనా చర్చలు జరిగాయి.  ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 1.0  ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 2.0 కింద, దేశంలో మెరుగైన ప్రామాణిక నైపుణ్య పర్యావరణ వ్యవస్థ ద్వారా 1.21 కోట్ల మందికిపైగా యువతకు విజయవంతంగా నైపుణ్యాల శిక్షణ ఇచ్చారు.  నైపుణ్యాల ఉపాధిని పెంచడంపై దృష్టి పెట్టడానికి భారత ప్రభుత్వం నవంబర్ 9, 2014 న నైపుణ్య అభివృద్ధి  వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఉన్న ఉద్యోగులకు మాత్రమే కాకుండా, సృష్టించబోయే ఉద్యోగులకు కూడా కొత్త నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చింది. శ్రామికశక్తికి డిమాండ్  సరఫరా మధ్య అంతరాన్ని తగ్గించడం మంత్రిత్వ శాఖ లక్ష్యం. ఇప్పటి వరకు, స్కిల్ ఇండియా కింద సుమారు 5.5 కోట్ల మందికి శిక్షణ ఇచ్చారు.  ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 1.0  ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 2.0 వల్ల 1.21 కోట్ల మందికిపైగా యువత శిక్షణ పొందారు.

నైపుణ్య అభివృద్ధిపై మరింత సమాచారం కోసం సందర్శించండి

ఫేస్బుక్: www.facebook.com/SkillIndiaOfficial;

ట్విట్టర్: @MSDESkillIndia

యూట్యూబ్: https://www.youtube.com/channel/UCzNfVNX5yLEUhIRNZJKniHg

 

****



(Release ID: 1710602) Visitor Counter : 107


Read this release in: Urdu , English , Hindi