ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఛత్తీస్‌గడ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్ మరియు రాజస్థాన్ రాష్ట్రాల్లోని కొవిడ్-19 పరిస్థితి మరియు టీకా పురోగతిని కేంద్ర ఆరోగ్య మంత్రి సమీక్షించారు.
Posted On:
06 APR 2021 9:49PM by PIB Hyderabad
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అధ్యక్షతన ఛత్తీస్‌గడ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య మంత్రులు, అదనపు ప్రధాన కార్యదర్శులు మరియు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు (ఆరోగ్యం) ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. గత రెండు వారాల్లో కొవిడ్-19 కారణంగా ఈ రాష్ట్రాలు రోజువారీ కేసులలో మరియు రోజువారీ మరణాలలో చాలా ఎక్కువ పెరుగుదలను నివేదిస్తున్నాయి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన ఈ సమీక్షలో కొవిడ్ కట్టడి మరియు ప్రతిస్పందన వ్యూహాన్ని, టీకా పురోగతిని సమీక్షించారు.ఈ సమావేశంలో రాష్ట్రాలు / యుటిలకు చెందిన సీనియర్ ఆరోగ్య నిపుణులు, కేంద్ర ఆరోగ్య కార్యదర్శి, డిజి ఐసిఎంఆర్, నీతి ఆయోగ్ సభ్యులు, ప్రొఫెసర్ బలరామ్ భార్గవ, ఐసిఎంఆర్ డైరెక్టర్ జనరల్, డాక్టర్ సునీల్ కుమార్, డిజిహెచ్ఎస్ డైరెక్టర్ జనరల్, డాక్టర్ సుజీత్ కుమార్ సింగ్, ఎన్సిడిసి మరియు హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు.
వివరణాత్మక ప్రదర్శన మరియు సమగ్ర ప్రదర్శన ద్వారా కేంద్ర ఆరోగ్య మంత్రి కొవిడ్ కొత్త కేసులు మరియు రాష్ట్రాలు / యుటిలలో మరణాలు, పరీక్షలు, ప్రయోగశాలల విషయంలో భారతదేశ ప్రజారోగ్య ప్రతిస్పందనను హైలైట్ చేశారు. మార్చి 1, 2021 నుండి దేశంలో కొవిడ్ కొత్త కేసులు మరియు మరణాల పెరుగుదల కనిపిస్తోంది. మరింత సమగ్ర ప్రదర్శన ద్వారా ప్రతి రాష్ట్రంలో యాక్టివ్ కేసులు, కోలుకున్నవారి సంఖ్య, పరీక్షలు, మరణాలు, మరణాల రేటు, మిలియన్ జనాభాకు కేసులు మరియు మిలియన్‌కు మరణాల వంటి వివరాలు కూడా చర్చించబడ్డాయి.
మ్యూటేషన్ వైరస్ కేసులపై డాక్టర్ హర్షవర్ధన్ మరింత స్పష్టంగా సమీక్ష జరిపారు. భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లోని ఉత్పరివర్తనాలతో SARS-CoV-2 సంఖ్య యొక్క వివరణాత్మక గణాంకాలపై కూడా కేంద్రమంత్రి చర్చించారు.
కొత్త ఉత్పరివర్తనాలకు సంబంధించి ఇది గమనించబడింది:
- ఇప్పటివరకు కోవిడ్ -19 కేసుల పెరగుదలకు, విదేశీ ప్రయాణికులకు ఎటువంటి సంబంధం లేదు.
- ప్రస్తుతం గుర్తింతబడిన SARS-CoV-2 వేరియంట్లు గత 6-8 నెలల నుండి ప్రబలంగా ఉన్నాయి.
- కేసుల పెరుగుదల నమోదవుతున్న వివిధ రాష్ట్రాలు వేర్వేరు మ్యుటేషన్ ప్రొఫైల్, పోస్ట్-సీక్వెన్సింగ్‌ను వెల్లడించాయి.
రాష్ట్రాలు / యుటిలు తీసుకున్న చర్యల యొక్క వివరణాత్మక మరియు సమగ్ర సమీక్ష తరువాత ఈ 11 రాష్ట్రాలు కలిసి మొత్తం కేసులలో 54% మరియు దేశంలో మొత్తం మరణాలలో 65% కలిగి ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రి తేల్చారు. మహారాష్ట్ర మరియు పంజాబ్ రాష్ట్రాల్లో గత 14రోజులలో మరణాల సంఖ్య పెరిగింది. దేశంలోని మొత్తం మరణాలలో 64% ఈ రెండు రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయి. ఫిబ్రవరి 2021 నుండి ఈ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య బాగా పెరిగింది. వీటిలో ఎక్కువ భాగం యువ జనాభాలో (15-44 సంవత్సరాల మధ్య) నమోదయ్యాయి. మరోవైపు వృద్ధ జనాభాలో (> 60 సంవత్సరాలు) మరణాలు ఎక్కువగా నమోదయ్యాయి. మహారాష్ట్ర (25%), ఛత్తీస్‌గడ్ (14%) అత్యధిక పాజిటివిటీ రేటును నమోదు చేశాయి. గత 4 వారాలలో పరీక్షలు పెరిగాయి కానీ గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్,మహారాష్ట్ర, ఛత్తీస్‌గడ్ రాష్ట్రాల్లో అధిక నిష్పత్తి నమోదయింది. మరో ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే, ప్రైవేటు రంగం యొక్క పరీక్షా సామర్థ్యం చాలా రాష్ట్రాల్లో ఉపయోగించబడలేదు. సందర్శన బృందాలు ఈ మేరకు అభిప్రాయం వ్యక్తం చేశాయి. ఇది సిఎబి,సిజడ్ కార్యకలాపాలు మరియు పెరిగిన సామాజిక సమావేశాలను అనుసరించడంలో ఉన్న సున్నితత్వాన్ని సూచిస్తుంది. ఈ పరిణామాల బట్టి మన మూడు సాధనాలైన కోవిడ్ నియమావళి, ఇన్ఫెక్షన్ మరియు టీకాల వంటి కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేయబడలేదని తద్వారా అది దేశ ప్రస్తుత పరిస్థితులకు దారితీసింది.
మహమ్మారి యొక్క ఉత్పాతాన్ని అరికట్టడంతో పాటు ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆరోగ్య వనరులను బలోపేతం చేయడానికి రాష్ట్రాలకు పలు ఆంశాలను సూచించారు. వాటిని ప్రత్యేకంగా అమలు చేయాలని కోరారు:
- కోవిడ్ నియమావళిని బలోపేతం చేయడంతో పాటు మాస్కింగ్, భౌతికదూరం మరియు చేతుల పరిశుభ్రత.
- సామాజిక / బహిరంగ సమావేశాలను పరిమితం చేయడం.
-“టెస్ట్, ట్రాక్,ట్రీట్‌మెట్” సమర్ధవంతంగా అమలు చేయడం.
- పాజిటివ్‌గా నిర్థారణ అయిన వ్యక్తులతో పాటు వారితో సన్నిహితంగా ఉన్నవారిని నిర్థారించడం మరియు పరీక్షించడం (పాజిటివ్ వ్యక్తికి కనీసం 25 నుండి 30 మంది).
- కంటైన్‌మెంట్ జోన్ మార్గదర్శకాలను సమర్థవంతంగా అమలు చేయడం.
- ప్రోటోకాల్ ప్రకారం టీకా వేగాన్ని పెంచడం
టీకా నిల్వలను ఎప్పటికప్పుడు అందిస్తామని డాక్టర్ హర్షవర్ధన్ హామీ ఇచ్చారు. మిషన్‌లో ప్రాధాన్యత గల వర్గాలకు టీకాలు వేయాలని రాష్ట్రాలను కోరారు. "టీకా కొరత కారణంగా, మేము టీకాలు వేయలేకపోయామని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు చేయదు" అని ఆయన అన్నారు.
****
(Release ID: 1710015)
Visitor Counter : 256