రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ఆర్మీ వార్ కాలేజ్, మహు గోల్డెన్ జూబ్లీని జరుపుకుంటోంది

Posted On: 02 APR 2021 10:08AM by PIB Hyderabad

ఆర్మీ వార్ కాలేజ్ (ఏడబ్లుసీ),మహు ఈ రోజు తన గోల్డెన్ జూబ్లీని జరుపుకుంది. ఇది ప్రారంభమైన 50 వసంతాలు పూర్తయింది. భారత సైన్యం యొక్క ప్రధాన శిక్షణా సంస్థగా దీని ప్రస్థానం ప్రారంభమయింది. ఈ కళాశాల భారత సైన్యంలోని అన్ని వ్యూహాత్మక శిక్షణలకు ఫౌంటెన్ హెడ్ పనిచేస్తోంది. భారత సాయుధ దళాలతో పాటు స్నేహపూర్వక దేశాల అధికారులకు ఇక్కడ శిక్షణ లభిస్తుంది. వార్ఫేర్ నేర్చుకోవటానికి, వ్యూహాలు, లాజిస్టిక్స్, సమకాలీన సైనిక అధ్యయనాలు మరియు సైనిక సిద్ధాంతంలో మెరుగుదలపై పరిశోధనలు నిర్వహించడానికి ఈ కళాశాల ప్రధాన కేంద్రంగా ఉంది.

దేశం గర్వించదగిన విలక్షణమైన గుర్తింపుతో ఉన్న ఆర్మీ వార్ కళాశాల 'యుద్దాయక్రిత్‌నిశ్చాయ' అనే నినాదంతో పనిచేస్తోంది. 'పరిష్కరించడానికి యుద్ధంలోకి' అని దీని అర్థం. 1971లో ప్రారంభమైనప్పటి నుండి కాలేజ్ సైనిక నాయకత్వ అభ్యాసం మరియు అభివృద్ధి అద్భుతమైన మరియు శక్తివంతంగా అభివృద్ధి చెందింది. కళాశాల సామర్థ్యం, స్థితి మరియు ఖ్యాతిని పెంచుకుంది. తద్వారా దాని వ్యవస్థాపకుల లక్ష్యాన్ని అద్భుతంగా నెరవేరుస్తోంది. ఇండిపెండెంట్ నుండి భారత సాయుధ దళాలు చేపట్టిన అన్ని సైనిక కార్యకలాపాలపై చెరగని ముద్ర వేసిన విశిష్ట అధికారులకు ఈ కళాశాల అల్మా మాటర్‌గా కొనసాగుతోంది.

గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా సైక్లోథాన్, సెయిలింగ్ రెగట్టా మరియు "ఇవాల్యూషన్‌ ఆఫ్‌ వార్‌ ఫైటింగ్‌ ఓవర్‌ డికెడ్స్‌, ఇండియన్‌ మిలటరీ హెరిటేజ్, ఎమర్జింగ్ డొమైన్స్/ఫార్మ్స్‌ ఆఫ్‌ కాన్‌ఫ్లిక్ట్‌ అండ్ రీకాలిబ్రాటింగ్ ఇండియన్‌ మిలిటరీ థింకింగ్‌" అనే వెబ్‌నార్‌తో సహా అనేక కార్యకలాపాలు మరియు వేడుకలు జరిగాయి. లెఫ్టినెంట్ జనరల్‌ విఎస్‌ శ్రీనివాస్‌, కమాండెంట్, ఏడబ్లూసీ మార్గదర్శకత్వంలో ప్రధాన కార్యక్రమం జరిగింది.

అన్ని ర్యాంకులు మరియు రక్షణ పౌర ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సైనిక్‌సమ్మేళన్‌లో ఏడబ్యూసీ కమాండెంట్ లెఫ్టినెంట్ జనరల్ వి.ఎస్.శ్రీనివాస్ ప్రసంగించారు. తన ప్రసంగంలో కమాండెంట్‌ అన్ని ర్యాంకుల సిబ్బంది తమ విధి నిర్వహణలో ప్రదర్శించిన అంకితభావం యొక్క ఉన్నత ప్రమాణాలను అభినందించారు. అదే ఉత్సాహంతో తమ విధులను నిర్వర్తించాలని ఆయన వారికి పిలుపునిచ్చారు. వివిధ రంగాలలో కృషి చేసిన వ్యక్తులకు ఈ సందర్భంగా పురస్కారం అందజేశారు.

ఈ ఉదయం ఆర్మీ వార్ కాలేజీలో వీరసైనికులకు నివాళి అర్పించారు. లెఫ్టినెంట్ జనరల్ రాజ్ శుక్లా, జిఒసి-ఇన్-సి ఆర్ట్రాక్, లెఫ్టినెంట్ జనరల్ విఎస్ శ్రీనివాస్, కమాండెంట్, ఎడబ్ల్యుసి, ప్రముఖ అనుభవజ్ఞులు మరియు మాజీ కమెండెంట్‌ ఎడబ్ల్యుసి లెఫ్టినెంట్ జనరల్ దుష్యంత్‌ సింగ్ (రిటైర్డ్) మరియు లెఫ్టినెంట్ జనరల్ పిజి కామత్ (రిటైర్డ్) దండలు వేశారు.

చీఫ్ ఆర్మీ స్టాఫ్ (సివోఏఎస్‌) మొదటి రోజు కవర్‌ను విడుదల చేసి, ఆర్మీ వార్ కాలేజీపై ఇ-బుక్‌ను ప్రారంభించడంతో ఈ వేడుకలు ముగుసాయి. ఈ చారిత్రాత్మక వేడుక సందర్భంగా గోల్డెన్ జూబ్లీ ట్రోఫీని ఆవిష్కరించారు. చీఫ్ ఆర్మీ స్టాఫ్  తన సందేశంలో "ఆర్మీ వార్ కాలేజీలో శిక్షణ విధానం దాని దృక్పథం ఆధునిక మరియు సమకాలీనమైనది. సాయుధ దళాల యొక్క డైనమిక్ అవసరాలను తీర్చడానికి ఇది నిరంతరం అభివృద్ధి చెందుతుంది.ఈ కళాశాల ఆధునిక 'తక్షశిల' వర్ధిళ్లుతోంది. భవిష్యుత్తులో కూడా ఈ విజయాలు కొనసాగాలని ఆశిస్తున్నాను" అని చెప్పారు.

***



(Release ID: 1709221) Visitor Counter : 215