రక్షణ మంత్రిత్వ శాఖ
పాల కేంద్రాలను అధికారికంగా మూసివేసిన భారత సైన్యం
Posted On:
31 MAR 2021 6:00PM by PIB Hyderabad
బ్రిటీష్ ఇండియా అంతటా మోహరింపబడిన వివిధ దళాలకు అవసరమైన పరిశుభ్ర ఆవుపాలను సరఫరా చేయాలనే ఏకైక లక్ష్యంతో పలు సైనిక క్షేత్రాల్లో పాల కేంద్రాల ఏర్పాటు చేయడమైంది. మొదటి సైనిక క్షేత్రాన్ని 1889 ఫిబ్రవరి 01న అలహాబాద్‌లో ఏర్పాటు చేయడమైంది. స్వాతంత్రం తరువాత మిలటరీ ఫామ్స్ భారత దేశం అంతటా ఏర్పాటు చేయడమైంది. మొత్తంగా 130 మిలిటరీ ఫామ్స్‌లో 30,000 వ్యవసాయ పశువులతో వివిధ రకాలైన వ్యవసాయ-వాతావరణ పరిస్థితులలో ఫామ్స్అభివృద్ధి చేయడమైంది. చివరిగా 1990 చివరలో లే మరియు కార్గిల్ ప్రాంతాలలోని సైనిక క్షేత్రాలలో వీటిని ఏర్పాటు చేయడమైంది. రోజు వారీగా ఆయా ప్రదేశాలలో దళాలకు తాజా మరియు పరిశుభ్రమైన పాలను సరఫరా చేసే ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేశారు. రక్షణ శాఖకు చెందిన పెద్ద పెద్ద భూముల నిర్వహణ, ఉత్పత్తి, జంతువుల హోల్డింగ్ యూనిట్లకు బాల్డ్ హే సరఫరా తదితరాలు ప్రధాన సవాలుగా నిలిచాయి. గత శతాబ్దానికి పైగా మిలిటరీ ఫామ్స్ అంకితభావం మరియు నిబద్ధతతో దాదాపుగా 3.5 కోట్ల లీటర్ల మేర పాలు మరియు సంవత్సరానికి 25000 మెట్రిక్ టన్నుల ఎండు గడ్డిని సరఫరా చేశాయి. పశువుల కృత్రిమ గర్భధారణ, భారతదేశంలో వ్యవస్థీకృతమైన పాడి పరిశ్రమను ప్రవేశపెట్టడం, నవ డెయిరింగ్ పరిచయ సాంకేతికతలలో ఈ పాల కేంద్రాలు ఎంతో ముందున్నాయి. 1971 యుద్ధ సమయంలో గొప్ప సేవలను అందించడంతో పాటు పాశ్చాత్య, తూర్పు వార్ ఫ్రంట్‌లకు కార్గిల్ యుద్ధ సమయంలో దేశంలో నార్తర్న్ కమాండ్‌కు పాలను సరఫరా చేసిన ఘనత ఈ కేంద్రాలది. వ్యవసాయ మంత్రిత్వ శాఖ సహకారంతో వీరు "ప్రాజెక్ట్ ఫ్రీస్వాల్"ను స్థాపించారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద పశువుల క్రాస్ బ్రీడింగ్ ప్రోగ్రాం. బయో ఇంధన అభివృద్ధిలో వారు డీఆర్‌డీఓతో జతకట్టారు. దేశానికి 132 సంవత్సరాల అద్భుతమైన సేవల తరువాత ఈ సంస్థను మూసివేశారు. సంస్థకు సేవలను కొనసాగించేలా అధికారులు మరియు కార్మికులందరినీ మంత్రిత్వ శాఖలో వివిధ పోస్ట్‌లలో తిరిగి నియమించారు.
***
(Release ID: 1708814)
Visitor Counter : 252