ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
“వైరస్ తరిమివేత: కోవిడ్ సంక్షోభానికి ప్రజారోగ్య స్పందన” డాక్యుమెంట్ విడుదలచేసిన కేంద్రమంత్రి డాక్టర్ హర్ష వర్ధన్
ప్రపంచాన్ని కుదిపేసిన సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకున్న తీరును వర్ణించిన డాక్యుమెంట్: డాక్టర్ హర్ష వర్ధన్
సంక్షోభం మీద పోరులో నేర్చుకున్న అతిపెద్ద పాఠం మన విశ్వాసానికి మరింత ప్రోత్సాహం
Posted On:
30 MAR 2021 7:47PM by PIB Hyderabad
“వైరస్ తరిమివేత: కోవిడ్ సంక్షోభానికి ప్రజారోగ్య స్పందన” పేరుతో రూపొందించిన డాక్యుమెంట్ ను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ ఈ రోజు ఢిల్లీలో ఆవిష్కరించారు. జనవరి 2020 నుంచి నవంబర్ 2020 వఎఅకు కోవిడ్ సంక్షోభం మీద జరిగిన పోరాటాన్ని క్రమంగా అక్షరబద్ధం చేసినదే ఈ డాక్యుమెంట్.
భారతదేశంలో కోవిడ్ మహమారి సృష్టించిన సంక్షోభానికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వశాఖ స్పందించిన తీరును ఈ విధంగా అక్షరబద్ధం చేయటం పట్ల డాక్టర్ హర్ష వర్ధన్ హర్షం వ్యక్తం చేశారు. ఇది అందరికీ ఒక చరిత్రాత్మక ఘట్టమని అభినందించారు. జనవరి 30న మొదటి కరోనా కేసు రాగా నేడు ఏడాది మీద రెండు నెలలు గడిచాక కోటీ 20 లక్షల కోవిడ్ కెసులను తరిమివేశామన్నారు. “ ఇవి కేవలం మన రికార్డులలో ఉన్న కేసులే. ఇంకా మరెన్నిటినో మనం తరిమి ఉంటాం. అవ్ మన రికార్డులకెక్కలేదు. కానీ మనం సంతోషించాల్సిన విషయమేంటంటే కోటీ 20 లక్షల కేసుల్లో కోటీ 13 లక్షలమందిని మనం కాపాడాం. “ అన్నారు.
అంతర్జాతీయ స్థాయి ఉన్న ఈ మహమ్మారిని తరిమేయటాన్ని కూడా ఒక అవకాశంగా ఎలా మార్చుకోగలిగామో ఆయన ప్రత్యేకంగా వివరించారు. “ మొదట్లో ఎదురైన ఎన్నో అవరోధాలను మనం అధిగమించాం. తొలిరోజుల్లో పిపిఇ కిట్లు దిగుమతి చేసుకున్నాం. ఇప్పుడు మనం భారతదేస అవసరాలకు సరిపోయే కిట్లు తయారు చేయగలగటమే కాదు, ఇతరదేశాలకు సైతం ఎగుమతి చేయగలిగే స్థాయికి ఎదిగాం. 2020 జనవరి 1 న కేవలం ఒక లాబ్ ఉండేది. ఇప్పుడు దేశవ్యాప్తంగా మనం 2433 లాబ్ లకు విస్తరించాం. అనేక దేశాలకు మనం టీకామందు పంపగలుగుతున్నాం. సంక్షోభం మీద పోరులో మనం నేర్చుకున్న అతిపెద్ద పాఠం మన విశ్వాసానికి మరింత ప్రోత్సాహం సంపాదించుకోవటం. ఇప్పుడు మన దేశం ఎలాంటి సవాళ్లనైఉనా అవలీలగా ఎదుర్కోగలదు. అనేక దేశాలకంటే మనం మెరుగైన ప్రతిభ ప్రదర్శించాం” అని డాక్టర్ హర్ష వర్ధన్ అన్నారు.
ఇలాంటి అనుభవాలను ఇలా ప్రచురించటం ఎంతో అవసరమని మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఈ సందర్భంగా అభినందించారు. వైద్య పరమైన అత్యవసర పరిస్థితి వల్ల ఒక అనూహ్యమైన సంక్షోభం ఏర్పడినప్పుడు మన స్పందన ఎలాంటిదో “వైరస్ తరిమివేత: కోవిడ్ సంక్షోభానికి ప్రజారోగ్య స్పందన” అనే ఈ డాక్యుమెంట్ చక్కగా వివరించిందని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ డాక్యుమెంట్ మొదటి సంపుటం కోవిడ్ సంక్షోభానికి స్పందించిన తీరులో వివిధ కోణాలను ఆవిష్కరించిందని, కోవిడేతర వ్యాధులకు సైతం నిరాటంకంగా వైద్య సేవలందించటంలో జరిగిన్ అకృషిని కూడా ప్రస్తావించిందని గుర్తు చేశారు. ఇందులో పాలుపంచుకున అందరి సేవలవల్లనే ఇది సాధ్యమైందంటూ ఈ పోరులో పాల్గొన్నవారందరినీ ప్రస్తావించటం అసాధ్యమని కూడా ఆయన అభిప్రాయపడ్దారు.
కోవిడ్ మీద పోరులో సాధించిన విజయాన్నే క్షయ మీద పోరులోనూ ఎలా సాధించాలో ప్రస్తావిస్తూ, 2025 నాటికి క్షయ వ్యాధిని సమూలంగా రూపుమాపటం మనముందున్న బృహత్తర లక్ష్యంగా డాక్టర్ హర్షవర్ధన్ అభివర్ణించారు. కోవిడ్ విషయంలో అమలు చేసిన “పరీక్షించు, ఆనవాలు పట్టు, చికిత్స అందించు” అనే త్రిముఖ వ్యూహాన్ని క్షయవ్యాధి విషయంలోనూ వర్తింపజేయాల్సిన అవసరముందన్నారు. ఇప్పుడు వచ్చిన అనుభవాన్ని క్షయవ్యాధి నిర్మూలన లక్ష్యసాధనలో ఉపయోగించుకోవాలని హితవు పలికారు.
కోవిడ్ మీద పోరులో విశేష సేవలందించినవారందరికీ మంత్రి ఈ కార్యక్రమం చివర్లో మరోమారు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఆరోగ్య రక్షణ వ్యవస్థను బలోపేతం చేయటంలో ఈ డాక్యుమెంట్ ఎంతగానో ప్రోత్సాహకరంగా ఉంటుందని డాక్టర్ హర్ష వర్ధన్ ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఎఏవైనా ఆరోగ్య అత్యవసర పరిస్థితులు ఎదురైన్బానా ధైర్యంగా ఎదుర్కునేందుకు ఆరోగ్యవ్యవస్థకు, అందులోని భాగస్వాములందరికీ తగిన ధైర్యాన్ని, విశ్వాసాన్ని ఇవ్వటానికి ఈ డాక్యుమెంట్ ఉపయోగపడగలదన్నారు.
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ రాజేశ్ భూషణ్, ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ డాక్టర్ సునీల్ కుమార్, మంత్రిత్వశాఖ సహాయ కార్యదర్శులు కుమారి వందనా గుర్నాని, కుమారి ఆర్తి అహుజా, డాక్టర్ మనోహర్ అజ్ఞాని, సంయుక్త కార్యదర్శులు శ్రీ లవ్ అగర్వాల్, శ్రీ వికాస్ శీల్, పలువురు సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
*****
(Release ID: 1708602)
Visitor Counter : 208