ప్రధాన మంత్రి కార్యాలయం

మిజోరమ్ మరియు అరుణాచల్ ప్రదేశ్ ల స్థాపన దినం నాడు ఆ రాష్ట్రాల ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 20 FEB 2020 11:01AM by PIB Hyderabad

మిజోరమ్ మరియు అరుణాచల్ ప్రదేశ్ ల స్థాపన దినం అయినటువంటి ఈ రోజు న  ఆ యా రాష్ట్రాల ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందన లు తెలిపారు.

 

 “మిజోరమ్ స్థాపన దినం సందర్భం లో ఆ రాష్ట్ర ప్రజల కు ఇవే అభినందనలు.  ఈ రాష్ట్రం యొక్క సంపన్నమైన సంస్కృతి ని చూసుకొని మనం గర్విస్తున్నాము.  మిజోరమ్ రాష్ట్రాని కి చెందినవారు అనేక రంగాల లో రాణించారు.  వారు భారతదేశం యొక్క వృద్ధి కి తోడ్పాటు ను అందించారు.  మిజోరమ్ రానున్న సంవత్సరాల లో అభివృద్ధి పథం లో ముందంజ వేయాలని ఆ ఈశ్వరుడి ని నేను ప్రార్థిస్తున్నాను.

 

అరుణాచల్ ప్రదేశ్ స్థాపన దినం నాడు ఆ రాష్ట్ర ప్రజల కు ఇవే శుభాకాంక్షలు.  ఈ రాష్ట్రం దేశభక్తి కి మారు పేరు గా ఉంటూ, దేశ ప్రగతి కి అచంచలమైనటువంటి తోడ్పాటు ను అందిస్తున్నది.  వృద్ధి పథం లో అరుణాచల్ ప్రదేశ్ మునుముందుకు సాగాలంటూ ఆ ఈశ్వరుడి ని నేను ప్రార్థిస్తున్నాను’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

***


(रिलीज़ आईडी: 1708407) आगंतुक पटल : 127
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam