కేంద్ర మంత్రివర్గ సచివాలయం

సాధికార‌ "టెక్నాల‌జీ గ్రూపు" ఏర్పాటు కు ఆమోదం తెలిపిన మంత్రిమండలి

Posted On: 19 FEB 2020 4:43PM by PIB Hyderabad

సాధికార "టెక్నాల‌జీ గ్రూపు’’ ను ఏర్పాటు చేయడానికి ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ అధ్య‌క్ష‌త‌ న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

 

వివరణ

 

ప్ర‌భుత్వ ప్రిన్సిప‌ల్ అడ్వైజ‌ర్ అధ్య‌క్ష‌త‌ న 12 మంది స‌భ్యుల టెక్నాల‌జీ గ్రూపు ఏర్పాటు కు మంత్రిమండలి అనుమ‌తిచ్చింది.  ఆధునిక టెక్నాల‌జీల‌ పై స‌కాలం లో స‌రైన విధాన‌ ప‌ర‌మైన స‌ల‌హాల ను ఇవ్వ‌డం ఈ గ్రూపు యొక్క ప్ర‌ధాన బాధ్య‌త‌.  టెక్నాల‌జీ మాపింగ్‌, టెక్నాల‌జీ ఉత్ప‌త్తు లు, జాతీయ ప్ర‌యోగ‌శాల‌లు- ప్ర‌భుత్వ ఆర్ & డి కేంద్రాల లో త‌యారుచేసిన ద్వంద్వ టెక్నాల‌జీ ల వాణిజ్యీక‌ర‌ణ‌, కొన్ని ప్ర‌ధాన టెక్నాల‌జీల ను దేశీయంగానే రూపొందించ‌డం, టెక్నాల‌జీ అభివృద్ధి కి అవ‌స‌ర‌మైన ఆర్ & డి కార్య‌క్ర‌మాల ఎంపిక లో కూడా ఈ గ్రూపు స‌హ‌కారాన్ని అందిస్తుంది.

 

ప్ర‌ధాన ప్ర‌భావం

 

ఆ టెక్నాల‌జీ గ్రూపు :-

            

 

               ఎ.  టెక్నాల‌జీ స‌ర‌ఫ‌రా, టెక్నాల‌జీ సేక‌ర‌ణ వ్యూహాలు అభివృద్ధి చేయ‌డానికి వీలుగా అత్యుత్త‌మ స‌ల‌హాలు ఇస్తుంది.

 

            బి.  విధానం, వ‌ర్థ‌మాన టెక్నాల‌జీ ల వినియోగం పై స్వంత టెక్నాల‌జీ ల అభివృద్ధి చేస్తుంది.

 

            సి.  ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ లు, జాతీయ ప్ర‌యోగ శాల‌ లు, ప‌రిశోధ‌న సంస్థ‌ లు అభివృద్ధి పరచే/ అభివృద్ధి పరచిన టెక్నాల‌జీ ల మ‌నుగ‌డ‌ కు త‌గ్గ చ‌ర్య‌లు అమ‌లయ్యేటట్టు చూస్తుంది.

 

అమలు వ్యూహం మరియు లక్ష్యాలు

 

          టెక్నాల‌జీ గ్రూపు ప‌ని కి కీల‌క‌మైనటువంటి మూడు స్తంభాల లో :

 

  1. విధాన‌ప‌ర‌మైన మ‌ద్ద‌తు;
  2. స‌మీక‌ర‌ణ‌ కు అవ‌స‌రమైన మ‌ద్ద‌తు; మరియు
  3. ప‌రిశోధ‌న‌, అభివృద్ధి ప్ర‌తిపాద‌న‌ల‌ కు తోడ్పాటు లు

ఉన్నాయి.

 

టెక్నాల‌జీ గ్రూపు ఈ క్రింది కార్యాలకు పూచీ పడుతుంది :-

 

అన్ని రంగాల లో ఆర్థికాభివృద్ధి, దేశీయ ప‌రిశ్ర‌మ‌ స్థిర‌మైన అభివృద్ధి కి దారి తీసే ఆధునిక సాంకేతికత లు రూపొందించ‌డానికి అవ‌స‌ర‌మైన, స‌మ‌ర్థ‌వంత‌మైన విధానాలు, వ్యూహాల రూప‌క‌ల్ప‌న‌;

  1. అన్ని రంగాల లో వ‌ర్థ‌మాన సాంకేతికతల‌ పై ప‌రిశోధ‌న‌ కు అవ‌స‌ర‌మైన ప్రాధాన్య‌ాలు, వ్యూహాల‌ పై ప్ర‌భుత్వాని కి స‌ల‌హాలు అందించ‌డం;
  2. దేశ‌ వ్యాప్తం గా అందుబాటు లో ఉన్న‌, అభివృద్ధి చేయ‌నున్న టెక్నాల‌జీ లు, టెక్నాల‌జీ ఉత్ప‌త్తుల‌ మ్యాపింగ్ ఎప్ప‌టిక‌ప్పుడు న‌వీక‌రించ‌డం, నిర్వ‌హ‌ణ‌;
  3. ఎంపిక చేసిన ప్ర‌ధాన టెక్నాల‌జీ లు దేశీయంగానే త‌యారు చేసేందుకు అవ‌స‌ర‌మైన ప్ర‌ణాళిక రూప‌క‌ల్ప‌న‌;
  4. టెక్నాల‌జీ స‌ర‌ఫ‌రాదారు, స‌మీక‌ర‌ణ వ్యూహాల‌ పై ప్ర‌భుత్వాని కి అవ‌స‌ర‌మైన స‌ల‌హా ఇవ్వ‌డం;
  5. డేటా సైన్స్, కృత్రిమ మేథ ల వంటి వ‌ర్థ‌మాన టెక్నాల‌జీ ల వినియోగం, విధానాల‌ పై సొంత నైపుణ్యాలు అభివృద్ధి చేసుకొనేందుకు అన్ని మంత్రిత్వ శాఖ‌ లు, ప్ర‌భుత్వ శాఖ‌ లు, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ ను ప్రోత్స‌హించ‌డం, ఆయా విభాగాల లో శిక్ష‌ణ‌, సామ‌ర్థ్యాల అభివృద్ధి కి స‌హ‌క‌రించ‌డం;
  6. విశ్వ‌విద్యాల‌యాలు, ప‌రిశోధ‌న సంస్థ‌ల‌ తో స‌హ‌కార‌, ప‌రిశోధ‌న భాగ‌స్వామ్యాల ను ఏర్పాటు చేసుకోవ‌డం ద్వారా ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ లు, ప్ర‌యోగ‌శాల‌ లు సుస్థిర‌మైన అభివృద్ధి ని సాధించేందుకు అవ‌స‌ర‌మైన విధానాల రూప‌క‌ల్ప‌న‌; మరియు
  7. ప‌రిశోధ‌న‌, అభివృద్ధి ప్ర‌తిపాద‌న‌ల‌ కు అవ‌స‌రం అయిన ప్ర‌మాణాల మరియు ఉమ్మ‌డి ప‌ద‌జాలం రూప‌క‌ల్ప‌న‌.

 

 

పూర్వరంగం

టెక్నాల‌జీ రంగం లో ప్రధానమైన అయిదు అంశాలు: ఎ. టెక్నాల‌జీ అభివృద్ధి కి ప‌టిష్ఠ‌మైన కేంద్రాల ఏర్పాటు విధానం; బి.  పారిశ్రామికాభివృద్ధి సంపూర్ణంగా ఉండేందుకు దోహ‌ద‌ ప‌డే విధంగా అభివృద్ధి చేయవలసిన‌, అమ‌లుప‌రుస్తున్న టెక్నాల‌జీల‌ కు ప్ర‌మాణాల నిర్దేశం. సి.  పూర్తి స్థాయి లో వాణిజ్యీక‌ర‌ణ చేయ‌ని టెక్నాల‌జీ ల ద్వంద్వ వినియోగం డి. టెక్నాల‌జీ అభివృద్ధి ప్ర‌య‌త్నాల‌ తో అనుసంధానం కాని ఆర్ & డి కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డం.  . స‌మాజానికి, పారిశ్రామిక రంగం వినియోగానికి కూడా ప్ర‌ధానం అయిన టెక్నాల‌జీల మ్యాపింగ్‌.  పైన పేర్కొన్న స‌మ‌స్య‌ల ను ప‌రిష్కరించడం లో ఒక ప్రయత్నమే టెక్నాల‌జీ గ్రూపు ఏర్పాటు.

 

 

**



(Release ID: 1708403) Visitor Counter : 81