ఆర్థిక మంత్రిత్వ శాఖ

దేశీయ డిమాండ్ పెంచడానికి ప్రత్యేక పథకం

Posted On: 23 MAR 2021 4:05PM by PIB Hyderabad

సమాజంలో అన్ని వర్గాల సమగ్ర వృద్ధి మరియు శ్రేయస్సు అంతిమ లక్ష్యంగా సులభతర వాణిజ్య విధానాన్ని ప్రోత్సహించడం, పెట్టుబడులు మరియు జిడిపి వృద్ధిని పెంపొందించడం మరియు దేశీయ డిమాండ్‌కు ప్రోత్సాహాన్ని అందించడానికి పథకాలు మరియు సంస్కరణలను ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం నిరంతర ప్రయత్నిస్తోంది.


ఈ రోజు రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ ఈ విషయాన్ని వెల్లడించారు.

కోవిడ్ -19 మహమ్మారి ప్రభావాన్ని ఎదుర్కోవటానికి మరియు ఆర్థిక వృద్ధిని పునరుద్ధరించడానికి 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ఆధ్వర్యంలో ప్రభుత్వం  ఆర్బీఐ ద్వారా రూ. 27.1 లక్షల కోట్లు (సుమారు) అంటే భారతదేశ జిడిపిలో 13% కంటే ఎక్కువ విలువగల ప్రత్యేక ఆర్థిక మరియు సమగ్ర ప్యాకేజీని ప్రకటించినట్లు మంత్రి వివరించారు.  అలాగే, ఆత్మ నిర్భర్ తయారీకి  ప్రోత్సాహం అందించేందుకు 2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రొడక్షన్ లింక్డ్ ప్రోత్సాహక పథకాలు ప్రారంభించబడ్డాయి.


కేంద్ర బడ్జెట్ 2021-22లో పేర్కొన్న 6 మూలస్తంభాల  విస్తృత-ఆధారిత మరియు సమగ్ర ఆర్థిక అభివృద్ధికి తోడ్పడటానికి అనేక చర్యలను ప్రకటించినట్లు మంత్రి పేర్కొన్నారు:


ఎ.  ఆరోగ్యం మరియు శ్రేయస్సు
బి. భౌతిక & ఆర్థిక మూలధనం మరియు మౌలిక సదుపాయాలు
సి. యాస్పిరేషనల్ ఇండియా కోసం సమగ్ర అభివృద్ధి
డి. మానవ మూలధనాన్ని తిరిగి ఉత్తేజపరచడం
ఇ. సృజనాత్మకత మరియు పరిశోధన, అభివృద్ధి
ఎఫ్. కనీస ప్రభుత్వం మరియు గరిష్ట పాలన

పెట్టుబడి మరియు వాణిజ్యానికి అవసరమైన వాతావరణాన్ని సృష్టించడానికి మరియు దేశీయ డిమాండ్ పెంచడానికి  ఈ క్రింది చర్యలను తీసుకున్నట్టు మంత్రి పేర్కొన్నారు: -

 i.మౌలిక సదుపాయాల రంగంలో 6,835 ఇన్వెస్టిబుల్ ప్రాజెక్టులకు (బడ్జెట్ 2021 లో 7,400 కు విస్తరించింది) 111 లక్షల కోట్ల రూపాయల జాతీయ మౌలిక సదుపాయాల పైప్‌లైన్ (ఎన్‌ఐపి) 2019 డిసెంబర్‌లో ప్రారంభించబడింది. దీనిని 2025 నాటికి అమలు చేయనున్నారు.

 ii.రూ. 6,000 కోట్ల ఈక్విటీ ఇన్ఫ్యూషన్‌ను 25.11.2020 న జాతీయ పెట్టుబడి మరియు మౌలిక సదుపాయాల నిధి (ఎన్‌ఐఐఎఫ్) ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెట్ ఫైనాన్సింగ్ ప్లాట్‌ఫామ్‌లో క్యాబినెట్ ఆమోదించింది.

 iii.దీర్ఘకాలిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు మౌలిక సదుపాయాల కల్పనను అందించడానికి, ప్రారంభించడానికి మరియు ఉత్ప్రేరకపరచడానికి డెవలప్‌మెంట్ ఫైనాన్స్ ఇనిస్టిట్యూషన్ (డిఎఫ్‌ఐ) ఏర్పాటు చేసే బిల్లును 16.03.2021 న కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ  సంస్థకు  పెట్టుబడి పెట్టడానికి 2021 బడ్జెట్ లో ఇప్పటికే రూ. 20,000 కోట్లు కేటాయించారు.

 iv.కొత్త మౌలిక సదుపాయాల కల్పన కోసం  ఫైనాన్సింగ్ ఎంపికగా  “నేషనల్ మోనటైజేషన్ పైప్‌లైన్” ప్రకటించబడింది.

 v.సామాజిక మౌలిక సదుపాయాలకు ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి మరియు కోర్ సెక్టార్ మౌలిక సదుపాయాలకు సహాయాన్ని అందించడానికి, నవీకరించబడిన వేరియబిలిటీ గ్యాప్ ఫండింగ్ (విజిఎఫ్) పథకం “స్కీమ్‌ ఫర్ ఫైనాన్సియల్ సపోర్ట్ టు పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్‌(పిపిపి) ఇన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌” 2020 డిసెంబర్‌లో తెలియజేయబడింది.

 vi.మూలధన ప్రాజెక్టులకు ఖర్చు చేయడానికి రాష్ట్రాలకు రూ.12,000 కోట్ల వడ్డీ లేని 50 సంవత్సరాల రుణం.

 vii.ఉద్యోగుల కోసం ఎల్‌టిసి నగదు వోచర్ మరియు ఫెస్టివల్ అడ్వాన్స్‌ పథకాన్ని ప్రవేశపెట్టారు.

2020-21లో రూ.1,20,147.9 కోట్లుగా ఉన్న గ్రామీణాభివృద్ధి శాఖ బడ్జెట్ అంచనాలను (బిఇ) 2021-22లో రూ. 1,31,509.08 కోట్లకు పెంచినట్లు మంత్రి తెలిపారు. నైపుణ్య అభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖకు సంబంధించి బిఇ 2021-22లో రూ. 2,785.23 కోట్లుగా చూపించారు. 2020-21 బిఇలో అది రూ 3,002.21 కోట్లు. అన్ని కేంద్ర ప్రాయోజిత పథకాలు మరియు కేంద్ర రంగ పథకాలకు బిఇ 2020-21 లో రూ. 3,39,894.53 కోట్లు మరియు 8,31,285.06 కోట్లతో పోలిస్తే బిఇ 2021-22లో  రూ.3,81,304.55 కోట్లు మరియు రూ.1,05,1703.41 కోట్లుగా ఉంది.

 

***



(Release ID: 1706990) Visitor Counter : 143


Read this release in: English