సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
అఫ్ గానిస్తాన్ కు చెందిన ఇండిపెండెంట్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్ స్ ఎండ్ సివిల్ సర్వీసెస్ కమిశన్ కు, భారతదేశాని కి చెందిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిశన్ కు మధ్య ఒక ఎమ్ఒయు పై సంతకాల కు ఆమోదం తెలిపిన మంత్రిమండలి
Posted On:
23 MAR 2021 3:24PM by PIB Hyderabad
అఫ్ గానిస్తాన్ కు చెందిన ఇండిపెండెంట్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్ స్ ఎండ్ సివిల్ సర్వీసెస్ కమిశన్ (ఐఎఆర్‌సిఎస్‌సి) కి, భారతదేశాని కి చెందిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిశన్ (యుపిఎస్‌సి) కి మధ్య ఒక అవగాహనపూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ఒయు) పై సంతకాల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశం ఆమోదం తెలిపింది.
ఐఎఆర్‌సిఎస్‌సి, యుపిఎస్‌సి కి మధ్య గల సంబంధాలను ఈ ఎమ్ఒయు పటిష్టం చేయనుంది. ఇది అభ్యర్థుల ఎంపిక రంగం లో ఇరు పక్షాలు వాటి అనుభవాన్ని, ప్రావీణ్యాన్ని పరస్పరం ఇచ్చి పుచ్చుకొనే సౌకర్యాన్ని సమకూర్చనుంది.
ఒప్పంద పత్రం (ఎమ్ఒయు) తాలూకు ముఖ్యాంశాలు:
i. సార్వజనిక సేవల కు సంబంధించిన భర్తీల లో ఆధునిక దృష్టికోణం, మరీ ముఖ్యం గా యుపిఎస్‌సి, ఐఎఆర్‌సిఎస్‌సి ల విధుల లో అనుభవాన్ని ఒక పక్షాని కి మరొక పక్షం అందజేసుకోవడం.
ii. గోప్య స్వభావానికి చెందినటువంటివి కాని పుస్తకాలు, మార్గదర్శక పుస్తకాలు మరియు ఇతర దస్తావేజులు సహా సమాచారాన్ని, ప్రావీణ్యాన్ని ఒక పక్షానికి మరొక పక్షం అందజేసుకోవడం.
iii. రాత పరీక్షల కు సంబంధించిన సన్నాహాల లో, కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్ష లు, ఆన్ లైన్ ఆధారిత పరీక్షల నిర్వహణ లోను సమాచార సాంకేతిక విజ్ఞానం (ఐటి) ని ఉపయోగించడం లో ప్రావీణ్యాన్ని ఇచ్చి పుచ్చుకోవడం.
iv. దరఖాస్తుల ను త్వరిత గతి న పరిశీలించి, పరిష్కరించడానికి ఏక గవాక్ష వ్యవస్థ (సింగిల్ విండో సిస్టమ్) తాలూకు అనుభవాన్ని ఉభయ పక్షాలు ఒక పక్షాని కి మరొక పక్షం అందించుకోవడం.
v. పరీక్షల నిర్వహణ పద్ధతి లో భాగం అయినటువంటి వివిధ ప్రక్రియల కు సంబంధించిన ప్రావీణ్యాన్ని, అనుభవాన్ని పరస్పరం ఇచ్చి పుచ్చుకోవడం.
vi. అధికారుల కు శిక్షణ ను ఇవ్వడానికి సమావేశాల ను నిర్వహించడం, వీటిలో ఆయా పక్షాలకు అందిన ఆదేశాల మేరకు అన్ని అంశాల లో ఉభయ పక్షాల ను సచివాలయం/ ప్రధాన కేంద్రాల కు తాత్కాలికం గా జతపరచడం భాగం గా ఉన్నాయి.
vii. వివిధ ప్రభుత్వ ఏజెన్సీల ను వాటికి గల శక్తి ప్రకారం ఏజెన్సీల ద్వారా ఉద్యోగాల భర్తీ లో అనుసరించినటువంటి విధి విధానాల మరియు ప్రక్రియల కు సంబంధించిన అనుభవాన్ని పరస్పరం వెల్లడి చేసుకోవడం.
***
(Release ID: 1706971)
Visitor Counter : 112