ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 టీకాల కార్యక్రమం- 63వ రోజు

4 కోట్లకు పైగా కోవిడ్ డోసులతో మరో మైలురాయి చేరిన భారత్

ఈ రోజు సాయంత్రం 7 గంటలవరకు 18.16 లక్షల టీకా డోసులు

Posted On: 19 MAR 2021 8:55PM by PIB Hyderabad

కోవిడ్ మీద పోరులో భారతదేశం మరోమైలురాయి దాటింది. ప్రపంచమంతటా సాగుతున్న టీకాల కార్యక్రమంలో భాగంగా భారత్ లో ఇప్పటివరకు వేసిన టీకాల సంఖ్య నాలుగు కోట్లు దాటింది.  ఈ సాయంత్రం 7 గంటలవరకు అందిన తాత్కాలిక సమాచారం ప్రకారం మొత్తం 4,11,55,978 టీకా డోసులిచ్చారు. అందులో 76,86,920 మంది మొదటి డోస్ అందుకున్న ఆరోగ్య సిబ్బంది, 47,69,469 మంది రెండో డోస్ అందుకున్న ఆరోగ్య సిబ్బంది, 79,10,529 మంది మొదటి డస్ అందుకున్న కోవిడ్ యోధులు, 23,16,922 మంది రెండో డోస్ అందుకున్న కోవిడ్ యోధులు,  1,53,78,622 మంది 45-60 ఏళ్ళ మధ్య దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు, 30,93,516 మంది 60 ఏళ్ళు పైబడ్డ లబ్ధిదారుల ఉన్నారు.

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45 -60 ఏళ్ళ దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు

60 ఏళ్ళు పైబడ్డవారు

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

1వ డోస్

76,86,920

47,69,469

79,10,529

23,16,922

30,93,516

1,53,78,622

టీకాల కార్యక్రమం మొదలైన 63 వ రోజైన నేటి సాయంత్రం 7 గంటలవరకు మొత్తం 18,16,161 టీకా డోసుల పంపిణీ జరిగింది. అందులో 16,43,357 మంది లబ్ధిదారులు మొదటి డోస్ తీసుకోగా  1,72,804 మంది ఆరోగ్య సిబ్బంది, కోవిడ్ యోధులు రెండో డోస్ తీసుకున్నారని తాత్కాలిక నివేదిక చెబుతోంది. రాత్రిపొద్దుపోయాక తుది నివేదిక అందుతుంది. .

 

తేదీ:మార్చి 18, 2021

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45 -60 ఏళ్ళ దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు

60 ఏళ్ళు పైబడ్డవారు

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

1వ డోస్

1వ డోస్

2వ డోస్

51,732

54,296

77,251

1,18,508

3,13,518

12,00,856

16,43,357

1,72,804

 

***



(Release ID: 1706184) Visitor Counter : 142


Read this release in: English , Hindi