మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19, పిల్లలలో పౌష్టికాహారలోపం
Posted On:
18 MAR 2021 4:40PM by PIB Hyderabad
పౌష్టికాహార లోపం పై కో్విడ్ -19 ప్రభావానికి సంబంధించి ఎలాంటి అధ్యయనం నిర్వహించనప్పటికీ, ప్రస్తుత పరిస్థితులపై రాష్ట్రాల నుంచి ప్రభుత్వానికి క్రమం తప్పకుండా నివేదికలు అందుతున్నాయి.
కోవిడ్ -19 సమయంలో , కోవిడ్ ప్రభావాన్ని పరిమితం చేసేందుకు ,దేశ వ్యాప్తంగా గల అన్ని అంగన్ వాడి కేంద్రాలను మూసివేయడం జరిగింది. అయితే, లబ్ధిదారులకు క్రమంతప్పకుండా పౌష్టికాహార మద్దతు నిచ్చేందుకు అంగన్ వాడి వర్కర్లు, హెల్పర్లు, ప్రతి 15 రోజులకు ఒకసారి అనుబంధ పౌష్టికాహారాన్ని లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్ళి పంపిణీ చేశారు. దీనికి తోడు, వారు స్థానిక పాలనా యంత్రాంగానికి కమ్యూనిటీ నిఘా విషయంలో సహాయపడుతూ వచ్చారు. ఈ విషయంలో వారు, ఎప్పటికప్పుడు తమకు కేటాయించిన పనితొపాటు ప్రజలలో చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపడుతూ వచ్చారు.
రోగనిరోధక శక్తి పెరగడానికి, పౌష్టికాహార లేమి లేకుండా చూడడానికి , ఆరోగ్యం, వెల్‌నెస్ ను పెంపొందించడానికి పౌష్టికాహారం, దాని పంపిణీ, చేరేట్టు చూడడం వంటి వాటి విషయంలో ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. పౌష్టికాహార నాణ్యత, పరీక్షల నిర్వహణ, పంపిణీని బలోపేతం చేయడం, పాలనను మెరుగుపరిచేందుకు టెక్నాలజీ వినియోగం వంటి వాటి విషయంలో పలు చర్యలు తీసుకోవడం జరిగింది. అనుబంధ పౌష్టికాహారం ఫుడ్ సేఫ్టీ, స్టాండర్డ్స్ చట్టం 2006, దానికింద రూపొందించిన రెగ్యులేషన్లకు అనుగుణంగా ఉండేట్టు చూడాల్సిందిగా రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రభుత్వం సూచించింది.
పౌష్టికాహార లోపాన్ని నిరోధించడానికి, సంబంధిత రోగాలకు అడ్డుకట్ట వేయడానికి ఆయుష్‌ను ప్రమోట్ చేయడానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు తగిన విధంగా సూచించడం జరిగింది. అంగన్ వాడీ కేంద్రాలలో పోషణ్ వాటికలకు మద్దతు ఇవ్వడానికి ఒక కార్యక్రమం రూపొందించడం జరిగింది. పౌష్టికాహారానికి సంబంధించి వైవిద్యతతో కూడిన ఆహారాన్ని సరఫరా చేసేందుకు సంప్రదాయ విజ్ఞానాన్ని , పద్ధతులను వాడేందుకు దీనిని చేపట్టారు.
తీవ్రమైన పౌష్టికాహార లోపం (ఎస్.ఎ.ఎం) గుర్తింపు, నిర్వహణ నిరంతరం సాగే ప్రక్రియ. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలనుంచి వచ్చిన సమాచారం ప్రకారం, ఎస్.ఎ.ఎం పిల్లల సంఖ్య 10 లక్షల కంటే తక్కువగా ఉంది.
ఈ సమాచారాన్ని కేంద్ర టెక్స్‌టైల్స్, శాఖమంత్ఇర శ్రీమతి స్మృతి జుబిన్ ఇరాని , రాజ్యసభలో ఈరోజు ఒక లిఖిత పూర్వక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.
***
(Release ID: 1705914)
Visitor Counter : 180