భారత పోటీ ప్రోత్సాహక సంఘం
పికోఫాల్-కమ్-కుట్టు మెషీన్ సరఫరా కోసం పూణే జిల్లా పరిషత్ పిలిచిన టెండర్లలో బిడ్లను రిగ్గింగ్ చేసినందుకు ముగ్గురు సప్లైయర్లకు వ్యతిరేకంగా ఉత్తర్వులు జారీచేసిన సీసీఐ
నాడు పోస్టు చేయడమైనది:
18 MAR 2021 12:43PM by PIB Hyderabad
పికోఫాల్-కమ్-కుట్టు మెషీన్ సరఫరా కోసం పూణే జిల్లా పరిషత్ పిలిచిన టెండర్ కోసం బిడ్డర్లు కేవలం కొన్ని రూపాయల తేడాలతో బిడ్లను కోట్ చేయడం యాదృచ్చికం కాదని, టెండరు కోసం వీరంతా కుమ్మక్కయ్యారని కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) తేల్చింది. ఈ బిడ్లను ఒకే కంప్యూటర్ ఐపీ అడ్రస్ నుంచి కోట్ చేసినట్టు గుర్తించింది. టెండర్ల సమయంలో వీరంతా ఫోన్లలో మాట్లాడుతుకున్నట్టు గుర్తించింది. కాల్ డేటా రికార్డ్, మొబైల్ లొకేషన్ మొదలైన వాటి ద్వారా ఈ విషయాన్ని నిర్ధారించింది. రిగ్గింగ్ ద్వారా పుణే జిల్లా పరిషత్ టెండరును అక్రమంగా దక్కించుకోవడానికి కుట్ర పన్నారని స్పష్టం చేసింది. ఇలాంటి పనులు కాంపిటిషన్ చట్టంలోని 3 (1 ), 3 (12), 3 (3) (డి) సెక్షన్లకు ఇది విరుద్ధమని ప్రకటించింది. టెండర్ల ప్రక్రియన రిగ్గింగ్ చేయడం వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. సప్లైయర్లు.. క్లాస్సీ కంప్యూటర్స్, నయన్ ఏజెన్సీ, జవహర్ బ్రదర్సుకు రూ.10 లక్షల చొప్పున జరిమానా విధించింది. సెక్షన్ 48 ప్రకారం జవహర్ బ్రదర్స్లోని ప్రతి వ్యక్తిపై 10,000 చొప్పున విధించింది. మిగతా ఇద్దరు బిడ్డర్లు సోల్ ప్రొప్రైటర్లు కాబట్టి వాటి యజమానులకు ప్రత్యేకంగా జరిమానా వేయలేదు. ఇక నుంచి ఇలాంటి పనులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ సీజ్ అండ్ డెసిస్ట్ ఆర్డర్ను కూడా సీసీఐ జారీ చేసింది. 2016లో నమోదైన 90 వ కేసులో ఈ మేరకు 17.03.2021 న ఆర్డర్ జారీ చేసింది. దీని కాపీని సీసీఐ వెబ్సైట్లో www.cci.gov.in లో అప్లోడ్ చేశారు.
****
(రిలీజ్ ఐడి: 1705815)
సందర్శకుల సూచీ సంఖ్య : : 130