ఆయుష్

ఆయుష్ ఎగుమతుల ప్రోత్సాహక మండలి

Posted On: 15 MAR 2021 3:52PM by PIB Hyderabad

ప్రపంచవ్యాప్తంగా ఆయుష్ ఉత్పత్తులు, సేవల వృద్ధికీ,  ఎగుమతులకూ ఉన్న భారీ సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని,  వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సహకారంతో, ఆయుర్వేద, హోమియోపతిక్, సిద్ధ, సోవా రిగ్పా, యునాని వైద్య విధానాలకు చెందిన ఉత్పత్తులు, మందులతో పాటు ఆయుష్ విధానాల సేవల కోసం ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఎ.ఈ.పి.సి) ని ఏర్పాటు చేయాలని, ఆయుష్ మంత్రిత్వ శాఖ, ప్రతిపాదించింది.  వాణిజ్య మంత్రిత్వ శాఖ యొక్క నిబంధనలు, మార్గదర్శకాల ప్రకారం ఏ.ఈ.పి.సి. ఏర్పాటు కోసం, తగిన వ్యవస్థను అభివృద్ధి చేయడానికి వీలుగా, ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఇతర పారిశ్రామిక బృందాలు, సంస్థలతో సమన్వయం కోసం, భారత వాణిజ్య, పరిశ్రమల మండలి సమాఖ్య (ఫిక్కీ) కి నోడల్ ఏజెన్సీ బాధ్యతలను అప్పగించడం జరిగింది.

భారతీయ వాణిజ్య వర్గీకరణ క్రింద, హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ కోడింగ్ (ఐ.టి.సి.హెచ్.ఎస్.) ఆధారంగా, రెండు హెచ్.ఎస్. కోడ్స్ - ఔషధాల కోసం 30039011 నెంబరు, ఔషధాలకు సంబంధించిన ఉత్పత్తుల కోసం 30049011 నెంబరు ద్వారా, ఆయుర్వేద ఉత్పత్తుల ఎగుమతి జరుగుతుంది.  యునాని, సిద్ధ, హోమియోపతి వ్యవస్థల ఉత్పత్తుల ఎగుమతి హెచ్.ఎస్. కోడ్స్ - ఔషధాల కోసం 30039012, 30039013, 30039014 నెంబర్లు, అదేవిధంగా ఔషధాలు సంబంధించిన ఉత్పత్తుల కోసం  30049012, 30049013, 30049014 నెంబర్ల ద్వారా జరుగుతుంది.  ఆయుర్వేద, హోమియోపతి, సిద్ధ, సోవా రిగ్పా, యునాని వైద్య విధానాలకు సంబంధించిన ఉత్పత్తులు, మూలికా ఉత్పత్తులు, ఔషధ మొక్కల ఉత్పత్తుల్లో ఎక్కువ భాగం ఉత్పత్తులు నిర్దిష్ట హెచ్.ఎస్. కోడ్స్ (ఇంటర్నేషనల్ హార్మోనైజ్డ్ కమోడిటీ డిస్క్రిప్షన్ అండ్ కోడింగ్ సిస్టమ్) కింద గుర్తించబడలేదు.

ఈ ప్రాంతంలో విధాన రూపకల్పనకు దోహదం చేయడానికి, చురుకైన వ్యూహాన్ని అభివృద్ధి చేయడానికి,  అన్ని వాటాదారులకు ఒక సాధారణ వేదికగా, భారతీయ సంప్రదాయ వైద్యం (ఎఫ్.‌ఐ.టి.ఎమ్) పై, అభివృద్ధి చెందుతున్న దేశాల పరిశోధన సమాచార విధానం (ఆర్‌.ఐ.ఎస్) లో ఒక ఫోరం ఏర్పాటు చేయబడింది.   ఉత్పత్తులు, ఔషధ మొక్కల కోసం హెచ్.ఎస్. యొక్క కవరేజ్ విస్తరణ, ఆయుష్, హెర్బల్ ఉత్పత్తుల కోసం ఏకరీతి వర్గీకరణ వ్యవస్థను తీసుకురావడం దృష్ట్యా,  భారతీయ వైద్య విధానం (ఐ.ఎస్.ఎం), హెర్బల్ ఉత్పత్తుల వాణిజ్య వర్గీకరణ, నాణ్యత నియంత్రణ, ప్రామాణీకరణపై ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఒక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది.

టాస్క్-ఫోర్స్ సిఫారసు ప్రకారం, ఐ.ఎస్.ఎం. ఉత్పత్తులు, మూలికా ఉత్పత్తులు, ఔషధ మొక్కల ఉత్పత్తుల కోసం కొత్త హెచ్.ఎస్. లైన్లను కేటాయించాలని, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధీనంలోని రెవిన్యూ విభాగానికి చెందిన కేంద్ర పరోక్ష పన్నులు, సుంకాల కేంద్ర మండలిని, ఆయుష్ మంత్రిత్వ శాఖ, అభ్యర్థించింది.

కేంద్ర ఆయుర్వేద, యోగా, ప్రకృతి వైద్యం, యునాని, సిద్ధ, హోమియోపతి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (అదనపు బాధ్యతలు), శ్రీ కిరణ్ రిజిజు, ఈ రోజు లోక్‌సభకు సమర్పించిన లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని పేర్కొన్నారు.

*****



(Release ID: 1704986) Visitor Counter : 155


Read this release in: English , Urdu