మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
విద్యావ్యవస్థలో పరివర్తన కోసం కృత్రిమ మేధస్సును ఉపయోగించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు
Posted On:
15 MAR 2021 4:57PM by PIB Hyderabad
కృత్రిమ మేథ వంటి సమకాలీన అంశాలను సంబంధిత తరగతుల్లో ప్రవేశపెట్టాలని జాతీయ విద్యావిధానం(నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ) సిఫారసు చేసింది. జాతీయ విద్యావిధానం–2020 అనుసరించి, పాఠశాల విద్య కోసం జాతీయ పాఠ్యప్రణాళిక ముసాయిదాను తయారుచేసే ప్రక్రియను నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ & ట్రైనింగ్ (ఎన్‌సిఇఆర్‌టి) ప్రారంభించింది. సెకండరీ స్థాయిలో కృత్రిమ మేథ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ప్రారంభ కోర్సులను ప్రవేశపెట్టే అవకాశాలను పరిశీలిస్తోంది. ఇప్పటికే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్ఇ) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను 2019-2020 విద్యాసంవత్సరం నుంచే తొమ్మిదో తరగతి విద్యార్థులకు, 2020-2021 విద్యాసంవత్సరం నుంచి పదో తరగతి విద్యార్థులకు సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలల్లో ప్రవేశపెట్టింది. నైపుణ్యాల అభివృద్ధి, పరీక్ష వ్యవస్థలను సమర్థవంతంగా నిర్వహించడానికి కృత్రిమ మేథస్సును ఇప్పటికే విద్యావ్యవస్థలో ప్రాథమిక స్థాయిలో ఉపయోగిస్తున్నారు. కృత్రిమ మేథ.. విద్యార్థుల, ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని, వ్యక్తిగతీకరణ, పరిపాలన పనుల క్రమబద్దీకరణలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఉపాధ్యాయుల సమయాన్ని ఆదా చేయడం, వారికి తగినంత స్వేచ్ఛాయుతంగా వ్యవహరించడానికి సహకరిస్తుంది. యంత్రాలు, ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని పెంచడం ద్వారా.. విద్యార్థుల నుంచి ఉత్తమ ఫలితాలను సాధించేలా కృత్రిమ మేథ తోడ్పాడునందిస్తుంది. ఆసక్తి కలిగిన బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ(బీటెక్) విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంపిక చే సుకునేలా కోర్సులను అందించాలని ఏఐసీటీసీ ఆమోదించిన సంస్థలకు సూచనలు అందాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డేటా అనలిటిక్స్లో మానవ వనరులను పెంచడానికి కృత్రిమ మేథ, డేటా సైన్స్ లో బీటెక్స్ కోర్సులను ప్రారంభించాలని సూచించారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)ల విషయానికి వస్తే.. వాటి చట్టాలు, శాసనాలు సొంత పాఠ్యాంశాలు, విద్యాపరిశోధన వంటి అంశాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలు, యూనివర్సిటీల సమన్వయంతో కోర్సులు నిర్వహించుకునేందుకు అనుమతిస్తాయి. అందువల్లే డీప్ లెర్నింగ్ ఫౌండేషన్స్ & అప్లికేషన్స్, ఫౌండేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, రీఇన్‌ఫోర్స్‌మెంట్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ప్రాబబిలిస్టిక్ రీజనింగ్, ప్రిడిక్టివ్ & ప్రిస్క్రిప్టివ్ డేటా అనలిటిక్స్, డీప్ లెర్నింగ్, సిస్టమ్ ఐడెంటిఫికేషన్, సైబర్ ఫిజికల్ సెక్యూరిటీ వంటి వివిధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధిత కోర్సులను దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు అందిస్తున్నాయి. , డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్, మొదలైనవి కాకుండా, పని చేసే ప్రొఫెషనల్ మరియు ఆసక్తిగల విద్యార్థుల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ఇంటర్-అలియా అనే స్వల్పకాలిక కార్యక్రమాలను కూడా ఐఐటిలు నిర్వహిస్తాయి. ఇవే కాకుండా ఆసక్తి కలిగిన విద్యార్థులకు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం ఇంటర్ అలియా అనే స్వల్ప కాలిక కోర్సులను కూడా ఐఐటీలు నిర్వహిస్తున్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ లోక్ సభకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ సమాచారం ఇచ్చారు.
***
(Release ID: 1704985)
Visitor Counter : 151