ఆర్థిక మంత్రిత్వ శాఖ

ఆరోగ్యరంగంతో పాటు ఆర్ధికాభివృద్ధికి దోహదపడే పెట్టుబడులకు ప్రభుత్వ ప్రోత్సాహం

Posted On: 15 MAR 2021 4:56PM by PIB Hyderabad

ఆర్ధిక వ్యవస్థను క్రమబద్దీకరించి మౌలిక ఆరోగ్య రంగాల అభివృద్ధికి దోహదపడే అంశాలలకు ప్రాధాన్యత ఇస్తూ మరిన్ని పెట్టుబడులు వచ్చేలా చూడాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉందని కేంద్ర ఆర్ధికకార్పొరేట్ వ్యవహారాలశాఖ సహాయ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు.ఈరోజు లోక్ సభలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన మంత్రి ఆరోగ్య రంగంతో పాటు మౌలిక వసతుల అభివృద్ధికి దోహదపడే పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం ఇటీవల కాలంలో అనేక చర్యలను తీసుకున్నదని వివరించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఇలా ఉన్నాయని మంత్రి అన్నారు. 

*  ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు, రియల్ ఎస్టేట్  ఇన్వెస్ట్మెంట్ ట్రస్టుల్లో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టేలా చూడడానికి 2021 ఆర్ధిక బిల్లులో సెక్యూరిటీస్ కాంట్రాక్ట్ (రెగ్యులేషన్) చట్టం 1992,  ఆర్థిక ఆస్తుల సెక్యూరిటైజేషన్ మరియు పునర్నిర్మాణం మరియు భద్రతా ఆసక్తి చట్టం 2002 మరియు రికవరీ ఆఫ్ డెట్స్ అండ్ దివాలా చట్టం1993లకు సవరణలను చేర్చడం జరిగింది. 

జీరో కూపన్ బాండ్లను జారీ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెట్ ఫండ్లకు వీలుకల్పించడానికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 2 (48) కు చేసిన సవరణలను  2021 ఆర్ధిక బిల్లులోచేర్చడం. 

*విదేశీ సావరిన్ వెల్త్ ఫండ్స్ (ఎస్‌డబ్ల్యుఎఫ్) మరియు పెన్షన్ ఫండ్లకు భారతీయ మౌలిక సదుపాయాల పెట్టుబడుల ద్వారా వచ్చే ఆదాయంపై కొన్ని షరతులకు లోబడి 2020-21 బడ్జెట్ లో 100 శాతం పన్ను మినహాయింపులు ఇవ్వడం జరిగింది. లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెట్ ఫండ్ (ఎన్బిఎఫ్సి-ఐడిఎఫ్) లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెట్ ఫండ్ (ఎన్బిఎఫ్సి-ఐడిఎఫ్) గా నమోదు చేయబడిన నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే ఎస్డబ్ల్యుఎఫ్ లు మరియు పెన్షన్ ఫండ్లకు ఈ ప్రయోజనాన్ని వర్తింపచేయడం జరుగుతుంది. .   మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంనిర్వహించడం  వంటి వ్యాపారాన్ని నిర్వహిస్తున్న సంస్థలో 75 శాతం కంటే తక్కువ కాకుండా పెట్టుబడులు కలిగి వున్న దేశీయ సంస్థమరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్‌లో పెట్టుబడి పెట్టిన కేటగిరీ లేదా కేటగిరీ II ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధుల్లో  ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఇన్విట్)ల్లో పెట్టుబడులకు కూడా కొన్ని షరతులకు లోబడి మినహాయింపులు ఇవ్వాలని ఫైనాన్స్ బిల్లు 2021 లో చేర్చబడింది. 

*  ఆరోగ్య రంగానికి సంబంధించిన పథకాలతో సహా  ఇన్ఫ్రాస్ట్రక్చర్ [వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ (విజిఎఫ్)]  ఆర్థిక మద్దతు కోసం ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం (పిపిపి) పథకం కింద  రూపొందించిన పథకం 2024-25 వరకు పొడిగించబడింది. 

ఆరోగ్య రంగానికి సమగ్రమైన విధానాన్ని ఆరోగ్య రంగ సమగ్ర అభివృద్ధి కోసం నివారణ, నివారణ మరియు శ్రేయస్సు అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం 2021-22లో ప్రభుత్వం  ఆరోగ్య సంక్షేమ రంగాలకు 2,23,846 కోట్ల రూపాయలను కేటాయించిందని మంత్రి తెలిపారు.  ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మరియు ఆయుష్ మంత్రిత్వ శాఖలకు ప్రత్యేక కేటాయింపులు చేయడంతో పాటు కోవిడ్ టీకా, తాగునీరు మరియు పారిశుధ్య అంశాలకు కేటాయింపులు చేశామని మంత్రి తెలిపారు. ఇవికాకుండా ఆరోగ్యం మరియు నీరు మరియు పారిశుద్ధ్యం రంగాలకు న్యూట్రిషన్ అండ్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు కూడా అందుబాటులో ఉన్నాయని వివరించారు. 

అస్సెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఎఐఎఫ్ఎల్) మరియు ఎన్ఐఐఎఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఎన్ఐఐఎఫ్) లతో కూడిన ఎన్ఐఐఎఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెట్ ఫైనాన్సింగ్ లో  6,000 కోట్ల రూపాయల ఈక్విటీ పెట్టుబడికి 25.11.2020 న జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపామని మంత్రి అన్నారు. మౌలిక రంగ అభివృద్ధికి నిధులు సమకూరుస్తున్న ఈ రెండు సంస్థల్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్న పెట్టుబడిదారులను ఈ నిర్ణయం ఆకర్షిస్తుందని మంత్రి అన్నారు. ఆర్ధికంగా లాభసాటిగా వున్న నూతన మరియు పనిచేస్తున్న మౌలిక వసతుల అభివృద్ధిలో స్వదేశీ విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి 2015లో ఎన్ఐఐఎఫ్ ఏర్పాటు అయ్యింది. 

వ్యూహాత్మక పెట్టుబడులు / ప్రైవేటీకరణ (నిర్వహణ నియంత్రణ బదిలీతో పాటు సిపిఎస్‌ఇల ప్రభుత్వ వాటాను గణనీయంగా అమ్మడం) మరియు మైనారిటీ వాటా అమ్మకం ద్వారా పెట్టుబడులను సమకూర్చుకునే విధానాన్ని ప్రభుత్వం అనుసరిస్తుందని మంత్రి చెప్పారు.  మరియు జిడిపి మొదలైనవి, సిపిఎస్ఇల పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా సమకూరే ఆదాయాన్ని  కొత్త సాంకేతిక పరిజ్ఞానం బదిలీ, ఉపాధి వృద్ధి పరంగా ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం కలిగించే  అభివృద్ధి మరియు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిధుల కోసం వినియోగిస్తామని మంత్రి వివరించారు.  2016 నుంచి ప్రభుత్వం 'సూత్రప్రాయంగా'35 వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణకు ఆమోదం తెలిపిందని మంత్రి అన్నారు.

***


(Release ID: 1704983) Visitor Counter : 129


Read this release in: English , Urdu